Wednesday, May 4, 2011

బ్యాచి‌లర్ కష్టాలు


ఏమని చెప్పను ప్రేమ ఎగిరే చిలకమ్మా.. :(.
          నిన్న మా రూం ఓనర్, ఎప్పుడూ రానిది రూంలోపలికి వచ్చి చక చక రూం అటు ఇటు ఓ సారి తిరిగి, మీరు వచ్చే నెలలో రూం ఖాళీ చెయ్యండి అని చెప్పాడు. నాకు ఏమి అర్ధం కాలేదు. అదేంటండి అలా అంటారు అని అడిగితే, మీరు రూం శుభ్రంగా ఉంచుకోవడం లేదండి. ఇలా ఐతే నాకు మీకు రూం ఇవ్వడం ఇష్టం లేదు అన్నాడు. శుభ్రంగానే ఉందిగా ఇంకేంటి ప్రాబ్లం అని అడిగితే అదంతా నాకు తెలియదండీ మీరు వచ్చే నెల ఖాళీచెయ్యండి అన్నాడు. తీరా విషయం ఏంటి అని పక్క రూం వాళ్ళని అడిగితే వాళ్ళని కూడ ఖాళీ చెయ్యమన్నాడంట, పెళ్ళైన వాళ్ళకే ఇవ్వాలని డిసైడ్ అయ్యాడంట. వాళ్ళే ఇల్లుని శుభ్రంగా ఉంచుకుంటారంట అని చెప్పాడు. అంటే ఇప్పుడు నేను మనోడి ఇంట్లో ఉండాలంటే పెళ్ళి చేసుకోవాల..చట్
       మేము ఒకటిన్నర సంవత్సరంగా ఈ ఇంట్లో ఉన్నాము. మొదట ఎనిమిది నెలలకే ఐదు వందలు పెంచాడు. అదేంటండి పదకొందు నెలలకి కదా పెంచుతారు, అప్పుడే ఏంటి అని అడిగితే, వాటర్ బిల్లు ఎక్కువగా వస్తుంది అన్నాడు. సరేలే ఐదువందలే కదా అని లైట్ తీసుకుంటే పదకొండవ నెలకి ఏకంగా ఇరవై రెండు శాతం పెంచాడు. ఏంటండి బాండ్‍లో పది శాతమే కదా ఉండేది అంటే మీకు ఇష్టం ఐతే ఉండండి లేదంటే ఖాళీచెయ్యండి అనేశాడు. సరేలే వేరే రూం చూసుకుందాం అని బయట చూస్తే అడ్వాన్స్‍లు భయంకంరంగా ఉండంటంతో వేరేదారి లేక తప్పక అక్కడే ఉండవలసి వచ్చింది. అరె నాకు హైక్ కూడా అంతరాలేదు రాలేదు వీడేందిరా బేవార్స్ గాడు, శని గ్రహం మీద ఇల్లు కట్టుకునే మొహమూ వీడు అనుకున్నా. మరిప్పుడేమో ఉన్నట్టుండి ఖాళీ చేయమంటే ఏడికెళ్ళాలి రా బాబు. అయినా బ్యాచిలర్స్ రూములు ఇలా కాకుండ ఇంకెలా ఉంటాయి. మేబీ రోజు శుభ్రంగా ఇల్లు ఊడ్చి, దేవుని దగ్గర దీపం పెట్టి, ప్రసాదం తీసుకెళ్ళి మనోడికి ఇవ్వాలేమో..సినెమా తియేటర్‍లో కష్టమర్ కేర్‍తో మాట్లాడే మొహం వీడూను.
          మా ఇంటి ఓనర్‍ని తిట్టానని వేరేగా అనుకోకండి ఏదో ఫ్రస్ట్రేషన్. సాఫ్ట్వేర్ జాబులు చేస్తున్నారు కదా అని ఎంత పడితే అంత రూము అద్దెలు పెంచడం భావ్యం కాదు. ఎంత పెంచినా చచ్చినట్టు ఉంటారు కదా అనుకొని ఇష్టం వొచ్చినట్టు పెంచకండి.

18 comments:

Indian Minerva said...

మా ఓనరు దేవుడు తెలుసా. ఏమైనా ఉత్తరమో లేక మరేదైనానో వస్తే తప్పిస్తే నన్నసలు కదిలించడుతెలుసా. పైపెచ్చు మేమేమైనా పిచ్చగొడవచేసినా "బ్యాచిలర్లుచెయ్యకపోతే మీరుచేస్తారా అని ఫ్యామిలీస్‌తో అంటాడు". రెండేళ్లకొకసారి పాపం మొహమాటపడుతూ ఓ నాలుగొందలు పెంచుతాడు. మేమూ హ్యాపీస్ ఆయనా హ్యాపీస్.

Pramida said...

bachelors ane kaadandi... familieski kuda anthe.. maa friend vaalla owner 6600 nunchi 7500 chesadu sarle anukunte.. 6 months tarvatha 10,000 chesthadata....

Anonymous said...

ఒసామాకీ కమ్యూనిస్టులకీ పోలికా? ఓ లీటరు కిరోసినివ్వండి అమరుణ్ణైపోతా ..

గిరీష్ said...

@మినర్వా మిత్రమా..
బాబ్బాబు, కొంచెం మీ ఇంటి ఓనర్ సెల్ నెంబరు చెప్పు, నేను కూడ వచ్చి చేరిపోతా మీ రూంలో.. :),
మా వాడు కూడ మంచోడే, తెలుగోడే, కాని ఏమో, ఎవరిమీదో కోపం మామీద చూపెట్టాడు. :(

@ప్రమిద గారు,
hmm.. ఈ ఓనర్స్ అంతా మోనోపోలీగా తయరయ్యి పండగ చేసుకుంటున్నారు, టైం :(.

@Anonymous,
Command not understand! :)

Unknown said...

mee owner better 500 penchadu ..
chennai lo nenu maa anna vadinalato unnappudu .. aa owner okkasari 2500 penchadu enti ante .. mugguru job chestunnaru kada anta ..

bachelors kinda kadu family kinda unna kuda owners alage chestaru .. Chetta vedavalu

గిరీష్ said...

@కావ్య గారు,
ఎవడి భాధలు వాళ్ళవి :(,
చూస్తుంటే బ్యాచులర్స్‌కి, ఫ్యామిలీస్‌కి తేడా లేకుండ వాయించేస్తున్నారు అనుకుంట ఈ ఓనర్స్.

kiran said...

hahahahahhaha..bagayyindi.. :P
aanandamaanandamayale..:P

paapam girish garu.. :(

Unknown said...

ఓ పని చేద్దాం .. :) ఆనందం సినెమా లో లాగ రవుండ్ అప్ చేసేసి చితక్కోట్టేద్దాం ప్లాన్ చెయ్యండి

గిరీష్ said...

@కిరణ్ గారు,
నవ్వు, బాగ నవ్వేసి తర్వాత పాపం అంటార, నాకే గనక సర్వశక్తులుంటే మీకు కూడ మీ రూం ఓనర్ అద్దె పెంచుగాక.. :), నా శక్తులు పనిచేస్తున్నాయో లేవో తర్వాత తెలియచేయగలరు :P

@కావ్య గారు,
అయితే నేను మావాడికి రాంబాబు క్యారెక్టర్ గురించి వివరిస్తా, చితక్కొట్టేద్దాం :). पिया तू अब् तो आजा.. :)

Anonymous said...

gold ayina konoch kani bangalore lo site konlemu ,anduke ekada rent chala huntundi... edo meekantha rent gurinchi thinking ayte naku mathram Mr.perfect malli malli chudalani hundi .

గిరీష్ said...

@Anonymous,
నిజం, ఒకప్పుడు పనికిరాని ఈ అవుటర్ రింగ్ రోడ్ ఇప్పుడు పిచ్చ హాట్. /sq.ft భీబత్సంగా ఉంది.
అయితే వెళ్ళి బంగారం కొనండి (అక్షయ తృతియ సందర్భంగా.. :) )

రాజ్ కుమార్ said...

హా.... ఈ కష్టాలు అందరికీ కామన్ అన్కుంటా.. ఏమన్నా అడిగితే మీకేంటీ సాఫ్ట్వేర్ బూం లో ఉంది కదా అంటాడు. అయినా రెంటల్ అగ్రిమెంట్ లేదా?? సడెన్ గా ఖాళీ చెయ్యమని ఎలా అడుగుతారు?? ఇప్పటికిప్పుడు రూం కి అడ్వాన్స్ ఇవ్వాలీ అంటే రెండు మూడు పెళ్ళిళ్ళు చేసుకోవాలి. ;) ;)

గిరీష్ said...

@రాజ్ కుమార్ గారు,
రెంటల్ అగ్రిమెంట్ ఉన్నాకూడ ఏదో ఒక సాకు చెప్పి అలా పెంచేస్తూ ఉంటారు. ఏమన్నా పడిఉంటామని వాళ్ళ ధీమా.. మూడు కూడ సరిపోవేమో :)

Unknown said...

Maa owner, ippatiniki 2 yrs aina penche oosettaledu. Memu rent ivvataniki vellinapude kanipinchedi ... vallu maa room ki raaru .. .memu valla flat ki vellamu ... :)

గిరీష్ said...

@Rahman,
సుఖ పురుషులు బాబు మీరు, enjoy.. :)

Roopa said...

ayyo...last month maaku ide kashtam vachindandi...illu vetakaleka chacche chaavu vachindi..

first time telsindi illu vetakadam enta kashtamo ani..

రసజ్ఞ said...

పాపం! హమ్మయ్యా నాకు ఈ అద్దె ఇంటి గోల లేదు బాబూ! హాస్టల్లో ఇలా అద్దెలు పెంచరు!

గిరీష్ said...

రసజ్ఞ గారు,
అంతేలెండీ, అయినా bachelor software engineer అంటే చాలు ఈ బెంగళూరు ఇంటి ఓనర్లకు పండగే.., ధన్యవాదాలు.:)