బ్లాగ్మిత్రులందరికి శ్రీరామ నవమి శుభాకాంక్షలు. జై శ్రీరాం.
ఈ సందర్భంగా నాకు నచ్చిన ఓ అందమైన పాట.
ఈ సినెమా చూసిన తర్వాతే నాకు గోదావరిని చూస్తూ భద్రాచలం వెళ్ళాలని ఆశ కలిగింది. ఎప్పుడు తీరుతుందో ఏమో. ఇప్పటికి ఓ ఇరవైసార్లు చూసుంటా ఈ సినెమాని. రామయ్యా..కాస్త దయ తలచవయ్యా..
*******************************************************************
శద్యమాం భవతి వేదం
పంచమాం భవతి నాదం
శృతి శిఖరి నిగమఝరి స్వరలహరి
ఉప్పొంగెలే గోదావరి ఊగిందిలే చేలో వరి
భూదారిలో నీలాంబరి మా సీమకే చీనాంబరి
వెతలు తీర్చు మా దేవేరి వేదమంటి మా గోదారి
శబరి కలిసిన గోదారి రామ చరితకే పూదారి
ఏసెయ్ చాప
జోరుసేయ్ నావ
బారు సేయి వాలుగా
చుక్కానే చూపుగా
బ్రతుకు తెరువు ఎదురీతేగా
ఉప్పొంగెలే గోదావరి ఊగిందిలే చేలో వరి
భూదారిలో నీలాంబరి మా సీమకే చీనాంబరి
సావాసాలు సంసారాలు చిలిపి చిలక జోస్యం
వేసే అట్లు వేయంగానె లాభసాటి బేరం
ఇళ్ళే వోడలైపోతున్న ఇంటి పనుల దృశ్యం
ఆరేసేటి అందాలన్ని అడిగే నీటి అద్దం
ఏం తగ్గింది మా రామయ్య భోగం ఇక్కడ
నది ఊరేగింపులో పడవ మీద లాగా
ప్రభువు తాను కాదా
ఉప్పొంగెలే గోదావరి ఊగిందిలే చేలో వరి
భూదారిలో నీలాంబరి మా సీమకే చీనాంబరి
గోదరమ్మ కుంకంబొట్టు దిద్దె మిరప ఎరుపు
లంకానాధుడింకా ఆగనంటు పండు కొరుకు
చూసే చూపు ఏం చెప్పింది సీతా కాంతకి
సందేహాల మబ్బే పట్టె చూసే కంటికి
లోకం కాని లోకంలోన ఏకాంతాల వలపు
అల పాపి కొండలా నలుపు కడగలేక
నవ్వు తనకు రాగా
ఉప్పొంగెలే గోదావరి ఊగిందిలే చేలో వరి
భూదారిలో నీలాంబరి మా సీమకే చీనాంబరి
వెతలు తీర్చు మా దేవేరి వేదమంటి మా గోదారి
శబరి కలిసిన గోదారి రామ చరితకే పూదారి
ఏసెయ్ చాప
జోరుసేయ్ నావ
బారు సేయి వాలుగా
చుక్కానే చూపుగా
బ్రతుకు తెరువు ఎదురీతేగా
ఉప్పొంగెలే గోదావరి ఊగిందిలే చేలో వరి
భూదారిలో నీలాంబరి మా సీమకే చీనాంబరి
*******************************************************************
చిత్రం: గోదావరి
రాసింది: వేటూరి (మహా ప్రభువు)
పాడింది: ఎస్.పి. బాలు (No Words)
సంగీతం: రాధా కృష్ణన్ K.M.
సంగీతం: రాధా కృష్ణన్ K.M.
6 comments:
శ్రీరామ నవమి శుభాకాంక్షలు girish garu..
కిరణ్ గారు,
Thank You! :)
what a coincident ..
nenu oka paata gurinchi raasa meeru oka paata gurinchi raasaru :)
happy sriraama navami
కావ్య గారు,
అప్పుడప్పుడు అలా జరుగుతూ ఉంటుంది.. :)
Thank You.
శ్రీరామనవమి శుభాకాంక్షలు గిరీష్ గారు ..
రాజి గారు,
ధన్యవాదములు.
Post a Comment