అది ఆగష్టు 20, 2007 సంవస్త్రం - నేను మొదటిసారి ఆఫీసు లో అడుగుపెట్టిన రోజు. నా చరిత్రలో ఓ మలుపు ఆ రోజు. మొదటి రోజు అంత సావకొట్టారు welcome అని చెప్పి. ఆఫీసు లో ఎలా ఉండాలి, ఎలా బిహేవ్ చెయ్యాలి, ఎం చెయ్యాలి, ఎం చెయ్యకూడదు ఇలాంటివి.. బొమ్మరిల్లు ప్రకాష్ రాజ్ రేంజ్ లో అన్నమాట. ఆ రోజు ఒకరిద్దరు కళ్ళు తిరిగి పడ్డారు కూడా, అ తీవ్రతని తట్టుకోలేక. నేను మాత్రం ఓ అమ్మాయిని చూస్తూ ఆ రోజు గడిపేసాను అనుకోండి.
నెక్స్ట్ డే నుంచి వర్క్ లొకేషన్ కి వెళ్ళాలి. రోజు పొద్దున్నే లేచి.. neat గ tuck చేసుకొని.. బెంగుళూరు బస్సు ఎక్కి ఆఫీసు వెళ్ళే అంత నరకం ఇంకోటిలేదు..ఒక నెలలో నేను మా రూం ని ఆఫీసు పక్కకి మర్చానంటే అర్ధం చేసుకోండి. అదేంటో బస్సు దిగంగానే shoe తెల్లగా, షర్టు బాగా ముడతలు పడి, inshirt బయటకి వచేసి, ఒక రేంజ్ లో తయారు అవుతాం. దానికి తోడు వాడు బస్ ఎక్కినా వెంటనే తలుపులు ముసేస్తాడు, ఆఫీసు స్టాప్ ఒకచోట ఉంటె..ఇంకో చోట ఆపి తెరుస్తాడు. మొదట్లో కనడ అర్ధం కాక అసలు మాట్లాడే వాణ్ణి కాదు బయట(అంటే ఇప్పుడు వచ్చని కాదు :) ). హెన్రి, హోగ్రి, బన్రి, చేనగేదిర ఇలా ర రి బాషలో మాట్లాడటం మన బాషలో తప్పుగా అందుకే.
ఆఫీసు మాత్రం సూపర్ గ ఉండేది మొదట్లో..neat గ ఉండేది, ఎసి పెట్టేవారు సల్లగ ఉండేది, ఫుడ్ చాల వెరిటీస్ ఉండేవి. బానే ఉనింది కానీ తర్వాత తర్వాత కొద్దిగా తింటేనే కడుపు ఫుల్ ఇపోవటం, కొద్దిగా తినటం స్టైల్ గ మారటం, రోజు తినిందే తినటం వల్ల అనుకుంట అసలు ఎం తింటున్నామో, వాళ్ళేమి పెడుతున్నారో కూడా తెలిసేది కాదు. అ తర్వాత తెలిసిన విషయం ఏంటంటే ఎసి మనుషులకి కాదు కంప్యూటర్స్ కూలింగ్ కి అని. కానీ నేను, మా ఫ్రెండ్స్ మాత్రం రోజు సాయంత్రం తొమ్మిది వరకు పనిచేసే వాళ్ళం అ రోజుల్లో(అంటే అప్పట్లో మా ఆఫీసు లో రాత్రి తొమ్మిది గంటలకి డిన్నర్ ఫ్రీ అందుకే :), recession టైం లో తీసేసారు మల్లి పెట్టలేదు సో ఇప్పుడు ఆరున్నరకే జంపు :) ). ఇంకా రాయాలనుంది కానీ ఫస్ట్ టైం తెలుగులో రాయటం కొంచెం ఇష్టం గ కొంచెం కష్టం గ ఉంది, సో మిగతాది మల్లి రాస్తాను. :)
(ఇందులోని విషయాలు సరదాకి రాసినవి మాత్రమే, ఎవరిని ఉద్దేశించి మాత్రం కాదు అని అర్ధం చేసుకోగలరు )