Monday, January 16, 2012

బిజినెస్ పూరి - నాకు నచ్చింది

అమ్మ ఇడ్లీ, నువ్వు సామాన్య మైన వాడివి కావు. ఆ స్క్రిప్ట్ ఏంటి స్వామీ. 76 రోజులలో ఎలా తీశావ్. కేక నువ్వు. ఎప్పుడు దేవున్ని నాకిదివ్వు అదివ్వు అని అడగటమే కానీ స్వామీ నువ్వెలా ఉన్నావు, బీ హ్యాప్పీ అని ఎప్పుడైనా అడుగుతామా... జింక-పులి కాన్సెప్ట్... కేక అసలు.

కథలోకి వెళ్తే సూర్య అనబడే మహేష్ తన తల్లిదండ్రులను చిన్నతనంలోనే పోగొట్టుకొని సమాజం మీద విరక్తితో, కసితో సమాజాన్నే ఏలాలని కోపంతో ముంబై వస్తాడు. చిన్న చిన్న రౌడీలతో మొదలయ్యి పొలిటికల్ టచప్‌తో ప్రకాష్ రాజ్‌కే స్పాట్ పెట్టి చంపేస్తాడు. ఈ ప్రాసస్‌లో పోలీసోడి కూతురిని ప్రేమించినట్లు నాటకమాడి తర్వాత నిజమని తెలుసుకొని ప్రేమిస్తాడు. పాపం ఏమి తెలియని చిత్ర అనబడే కాజల్‌కి మరియు బ్రహ్మాజీ, నాజర్‌లకి అప్పుడప్పుడు కథలు చెబుతూ తన పాత్రని మనకు చూపిస్తాడు పూరీ.

నటనలోకి వెళ్తే మహేష్ యధావిధిగా బా చేశాడు. కాజల్ హ్మ్మ్మ్.. నాజర్, ప్రకాష్ రాజ్, సుబ్బరాజు.. పోకిరి‌లో చేసినట్టే చేశారు.. :), బ్రహ్మాజీ ఏ సినెమాలోనైనా ఒకే నటన, ఓకె.

కొత్త విషయాలు: ఎప్పుడూ రకం పాటకి మమైత్‌ని పెట్టుకునే పూరీ ఈ సారి వేరే అమ్మాయిని తీసుకోవటం. ఆలీ సీక్వె‌న్షియల్ హాస్యం లేకపోవటం. అసలు ఆలీనే లేడు. నేను నా రాక్షసి సినెమాలోని ఆలీ భూతు హాస్యం మరొక్కసారి తలచుకొని భయపడ్డాడేమో లేక మహేష్ పాత్రను మనకు తెలపటానికి ఎక్కువ సమయం తీసుకున్నాడో ఏమో పూరి. నాకు పోకిరి మొదటిసారి చూసినప్పుడు వచ్చిన ఫీలింగే ఈ సినెమాకి కలిగింది. పోకిరి అంత హిట్ కాకపోయినా అదే ఫీలింగ్.. :).

బాగున్న అంశాలు: కథ, కథనం (దర్శకత్వం). మహేష్ నటన. కాజల్..(సారొత్తారు పాటలో తన కలర్ పరదేశీయులతో కలసిపోయింది :) ). ఓ మూడు పాటలు, నేపధ్య సంగీతం.

బాలేని అంశాలు: పాటలు పూర్తిగా లేవనిపించింది. దూకుడులో ఉన్న డౌట్ ఈ సినెమాతో క్లియర్ అయింది.(మహేష్ డ్యాన్సులు వెయ్యలేకపోతున్నాడు :)). రెండవ భాగము నాకు కొద్దిగ ఎడిటింగ్ సరిలేదనిపించింది.

మొత్తానికి: పూరిలో ఏదో కసి కనపడుతుంది. మరొక మంచి చిత్రం పూరీ నుంచి.

PS: This is not Review. This is My view.


సినిమా డైలాగులు (రాజ్ కుమార్ గారి సౌజన్యంతో.. :)) :
  
-> అప్పుడప్పుడూ.. టెర్రరిస్ట్‌లు బాంబులు పెడతారు.... ఐడెంటిటీ కోసం
అప్పుడప్పుడూ... వినాయకుడు పాలు తాగుతాడు
కానీ అదే వినాయకుడు రోజూ పాలు తాగితే ఎవడూ పొయ్యడు తెలుసా ?
నేను కూడా అంతే... అప్పుడప్పుడూ మర్డర్స్ చేస్తేనే ఐడెంటిటీ
(
గుర్తున్నంత వరకూ)

->
మనం క్రిమినల్స్ రా... క్రైమ్ చేసుకొనే బతకాలి మనం

->
నేను కొడితే అదోలా ఉంటాదని ఆడూ ఈడూ చెప్పడమే గానీ ఎలా ఉంటాదో నాక్కూడా తెలీదు

->
డబ్బు శాశ్వతం కాదూ... మనుషులే శాశ్వ్వతం అంటారు. కానీ ఇక్కడ మనుషులు చచ్చిపోతున్నారు కానీ డబ్బు అలాగే ఉంటుంది. ఈ మనుషులు చచ్చేలోపల ఆ డబ్బుని పంచేస్తాను

->
నేను ఎలాగోలా బతికెయ్యడానికి ముంబై రాలేదు. ముంబై ని ఏలడానికొచ్చాను. .. [ఆ తర్వాత...సెన్సార్]

->
మాఫియా లేక ఎన్ని ప్రాజెక్ట్లు ఆగిపోయాయో తెలుసా? ఎన్ని ట్రాన్షాక్షన్స్ ఆగిపోయాయో తెలుసా? ఒక్క చాన్స్ ఇవ్వండి సార్ ముంబై మొత్తం మళ్ళీ మాఫియా తో కళ కళలాడిపోతుంది

->
నేను మాట్లాడ్డాన్కొచ్చాను కాబట్టీ మనస్పూర్తిగా కొట్టలేకపోతున్నాను

->
ఇలా చుట్టూ రౌండప్ చేసి కంఫ్యూజ్ చెయ్యకండిరా.. ఎందుకంటే కన్ఫ్యూజన్న్ లో ఎక్కువ కొట్టేస్తాను
->డిస్కవరీ చానల్ లో పులి జింకని వేటాడటం చూస్తూ జింక బ్రతకాలని ప్రార్ధన చేస్తాం. జింక తప్పించుకోగానే టీవీ కట్టేసి మనం మాత్రం వెళ్ళి కోడిని కోసి బిర్యాని వండుకొని తినేస్తాం. మనకి జింక మీద ప్రేమ కాదు, పులి మీద కోపం. దాన్ని ఏమీ పీక లేక అది ఓడిపోతే చూడాలనుకుంటాం.

->గ్యాంగ్స్టర్స్ అందరికీ సాలరీలిచ్చి పోషిస్తున్నాను సర్. కడుపు నిండితే ఎవ్వడూ ఎవరి జోలికీ వెళ్ళడు. కావ్వాలమ్టే రికార్డ్స్ చూసుకోండీ క్రయిమ్ రేట్ తగ్గిపోయింది

->మహేష్: బిజినెస్ ఎక్స్పాండ్ చెయ్యాలి. మన బ్రాంచ్ లు దేశం మొత్తం ఉండాలి. ఒక్కో బ్రాంచ్ లో 50 మంది స్టాఫ్ ఉండాలి. ప్రతీ స్టేట్ లోనూ ఉండే లోకల్ గూండాల్ని సెలక్ట్ చేసుకోండీ

అసిస్టేంట్ః 50 మంది ఎందుకూ?

మహేష్: 50 మంది గ్యాంగ్ స్టర్స్ నడిచొస్తుంటే చూసేవాళ్లకి ఎలా ఉంటుందీ
50 మంది గన్స్ పట్టుకొని పరిగెట్ట్టుకొస్తుంటే ఎలా ఉంటుందీ ??
బిజినెస్ చేసే ప్రతీ ఒక్కడి టేబుల్ మీదా మన వాళ్ళ గన్ ఉండాలి

->యుద్ధం చేయలేని వాడే ధర్మం మాట్లాడతాడు

->ఒక గుర్రాన్ని వదిలేసీ.. "ఇది అడుగెట్టిన చోటంతా నాదే, అడిగితే చంపేస్తా" అని అంటే అది అశ్వమేధయాగం.. ఇప్పుడు నేను చేస్తున్నదదే

->హీరోః ఈ ప్రపంచమంతా నమ్మకపోయినా పర్వాలేదు.. నువ్వు నమ్మితే చాలు....
హీరోయిన్ః ఈ ప్రపంచమంతా నమ్మినా.. నేను మాత్రం నిన్ను నమ్మను

->వాడు భాయ్ ఏంటీ సార్.. మిల్క్బోయ్ లాగా ఉన్నాడు

->నిన్ను చూస్తే భయమేస్తుందిరా మామా..
ఫ్రెండ్ వి నువ్వే నన్ను చూసి భయపడకపోతే రేపు ముంబాయ్ మొత్తం ఎలా భయపడతాది రా? చల్

->సర్ ఇప్పుడు చెబుతున్నా... మాఫియా ని లీగల్ చేసేస్తాం... మీరు కానీ మీ సిస్టం కానీ టచ్ చేయని రేంజ్ కి వెళ్త.. అప్పుడొచ్చి చిత్రని తీసుకెల్తా... ఇష్టం వున్నా లేకపోయినా

->తు కిదర్ సే ఆయారే?
హైదరాబాద్
ఎక్కడినుండో వచ్చి ఇక్కడ నువ్ పీకేదేమిటీ*
ఇక్కడే పుట్టీ నువ్వే పీకావ్ రా ?
ఇప్పటివరకూ పీకిన ప్రతీవాడూ ఎక్కడ నుండో వచ్చిన వాడే

->ఇలాంటి టైం లో జోకులెయ్యకూడదు. చూశావా? ఆరుగురు పోయారు

ఆ బ్యాలెన్స్ ని ఫినిష్ చేసొచ్చే లోపు చిత్రని చూపించు. లేకుంటే ఆ తర్వాత చిత్ర ఎక్కడుందని కూడా అడగను.. మొత్తం అందర్నీ చంపిపారదొబ్బుతా


->ఫిష్.. టునా ఫిష్... ఈ భూమి మీద 6౦౦ కోట్ల మంది మనుషులు వున్నారు... వారిలో సగం మంది ప్రతి రోజు సముద్రం లో చేపలు పట్టి తినేస్తుంటారు...ఉడక పెట్టుకొని, వండుకొని, వేపుకొని, ఫ్రై అంటారు , పులుసాని, ఎండ పెట్టుకొని తినేస్తుంటారు.... ఎన్నో వేల సంవత్సరాల నుంచి ఇన్ని వేల కోట్ల కోట్ల చేపలు పట్టుకొని తినేస్తుంటే తప్పులేదు...కానీ అదే చేప ఒక్కసారి ఒక్కడిని కరిచింది అంటే మాత్రం గోల గోల చేసి _____తారు

->రెండు కోట్ల కారు ఇస్తే ఎవత్తైనా ఐ లవ్యూ చెప్తుంది

->మేమూ ప్రొఫెషనల్స్ సార్.. తను ఆర్టిస్ట్. నేను ఫ్లూటిస్ట్

->ఢిల్లీ వచ్చినప్పుడు నాకేం ఇస్తావని కాదు. నేనే నీకు ఢిల్లీనిస్తాను


->Abstract art is kind of art, where the subject of the art is not much important, but the combination of colours plays a great role..and more.."________Heroine

->మహేష్: మీరిప్పుడు చెప్పిన దానికంటే ఈ బొమ్మే బాగా అర్థమయ్యేట్టుంది

->నాజర్ః ఒకప్పుడూ బ్యాంక్ దోపిడీ చేసినవాడు ఈరోజు బ్యాంక్ పెడుతున్నాడు.. దానికి నేను చీఫ్ గెస్ట్.. హ్మ్మ్

మహేష్: దేశం లో చాలా డబ్బుంది సర్. పాపం ఎక్కడ దాచుకోవాలో తెలియట్లేదు.అందుకే పెడుతున్నా. ఇది ఇండియన్ స్విస్ బ్యాంక్. బ్లాక్, వైట్ మొత్తం దాచుకోవచ్చు
మీరు ఊ అనండీ. గొప్పోణ్ణి కొట్టేద్దాం పేదోడికి పెట్టేద్దాం

11 comments:

రాజ్ కుమార్ said...

naakoo nachchindi cinema..
dookudu meeda baagundi.
alaa ani goppa cinema ani kaadu. andarikee nachchutaadanee kaadu.

naa plus lo Dialogues raasaanu.. blog lo pettukonumu (if u want :))

Raj said...

బాగుంది అంటూనే బాగా చురకలు అంటించారుగా మీరు... :)

Manoj said...

వామ్మొ గిరీష్, నువ్వు మాములొదిని కాదు దార్లీంగ్
డైలాగ్స్ అన్ని అలా రాసెసావు ఇంతకీ సినిమ చూసావా లెదా?

Hemanth Kumar R said...

Concept baaganevunna...
koncham Ram Gopal Varma touching ichinatludeee (songs lo)... anduke nemo chaala varaku sensor cut!?!....

Inkoka side effect emitante, this will influence the next generation to think that mafia is not a bad and its passion...

వేణూశ్రీకాంత్ said...

-ve points ఉన్నా కూడా సినిమా నాకూ నచ్చింది గిరీష్ :-)

గిరీష్ said...

@రాజ్ కుమార్,
నిజమే మీరన్న వాఖ్యలు.. :), థ్యాంక్యూ.

@రాజ్ గారు,
చురకలు కాదండి నాకు అనిపించినవే వ్రాశాను.. :), ధన్యవాదములు.

@మనోజ్,
మనకంత సీన్ లేదు మనోజు, టపా మళ్ళొకసారి చదువు.. :)

గిరీష్ said...

@‌హేమంత్,
హాహా..నిజమే చాలా వరకు పాటల్లో బ్లర్, డైలాగ్స్‌లో డాట్స్.. :)

coming to influence point: may be u r true! మనం అనుకునిందే చెయ్యాలి, ఎవ్వరిని నమ్మకు, నీకన్నా ఎక్కువ ఎవరు కాదు...ఇలాంటి మాటలకు న్యాయం చెయ్యాలని డైరెక్టరు హీరో గారిని మాఫియా డాన్‌గా చూపించారని నాకనిపిస్తుంది. మంచిగా వెళ్ళే వాడిలో ఈ క్వాలిటీస్ ఉండవని ఆయన అభిమతమని నా అభిప్రాయం. :), ఏమో మంచిగా కూడ ట్రై చేసుండచ్చేమో అందుకే కొంతమందికే నచ్చుతోందీ సినిమా.Thanks for the comment.

@వేణూ శ్రీకాంత్ గారు,
సేం పింన్చ్.. :), థ్యాంక్యూ.

kiran said...

ఏమిటో నీకు నచ్చేసింది...కానీ నాకు చిరాకేసేసింది :(

గిరీష్ said...

@కిరణ్,
Mixed talk కిరణు, నేను రెండు ఇతర బ్లాగుల్లో చూశా, చాలా మందికి నచ్చలేదట, ఏం చెయ్యలేం :). థ్యాంక్స్.

Anonymous said...

మాఫియాకి అశ్వమేధయాగంతో పోలికా?

"యుద్ధం చేయలేని వాడే ధర్మం మాట్లాడతాడు"

....అసలు యుద్ధం చేసేదే ధర్మం కోసం.

గిరీష్ said...

@bonagiri గారు,
>> యుద్ధం చేయలేని వాడే ధర్మం మాట్లాడతాడు>>
ఈ డైలాగ్‌లో పూరి ఉద్దేశం చేతకాని వాడే ధర్మం మాట్లాడుతాడని.. హీరో గారి క్యారెక్టరు కోసం అలా..నిజానికి ఇప్పుడు జరిగేది కూడ అదే ప్రపంచంలో.. నిజాలు చెప్పటం వల్లే అనుకుంట సినిమాను ఎవరు జీర్ణించుకోలేక పోతున్నారు. కాకపోతే పూరీ మీరన్నట్టు మాఫియా కాకుండ ఏదైనా +ve background తీసుకొని చేసుంటే కేక సినిమా అయుండేది. Thanks for ur comment.