Monday, April 25, 2011

ప్రేమ - పెళ్ళి (నా కథ) - 4


  ప్రేమ - పెళ్ళి (నా కథ) -3 కి తరువాయి
           నిర్ణయం ఏంటంటే ప్రాణభయంతో ఇలా ఉండే కన్నా పక్కఊరిలో ఉన్న పాఠశాలలో(హాస్టల్లో)చేరాలి అని. మొత్తానికి నానా గొడవా చేసి ఇంట్లో వాళ్ళను ఒప్పించా. హాస్టల్లో చేరాకా కాని అర్ధం కాలేదు అదెంత బుద్ధి తక్కువ పని అని . ఉదయాన్నే 5 గం.లకు లేవాలి. మా మాస్టార్లతో పాటు 2-3 కి.మీలు పరుగెత్తాలి. ఎవడి పనులు వాడే చేసుకొవాలి, అది తిండి తినడం ఐనా బట్టలు ఉతకడం ఐనా.ఓరినాయనో పెనం మీద నుండి పొయ్యిలో పడ్డాను కదా అనుకొన్నా కాని ఏమి చేస్తాం తప్పదు కదా. ఇన్నింటికి పైన మా అమ్మ మీద బెంగ. ఎవరి పరిచయాలూ పెద్దగా అవ్వలేదు నా పని ఏంటో నేను ఏంటో అన్నట్టు ఉండే వాడిని. కాని అన్ని రోజులూ అలా ఉంటే విషయం ఏమి ఉంది.
          కొన్నాళ్ళకు అలవాటుపడ్డా, ఇప్పుడు ఇంటికన్నా హాస్టల్ బాగున్నట్టూ అనిపించడం మొదలుపెట్టింది. ఒక రోజు ఉదయం ప్రార్ధనా సమయంలో ఒక ప్రకటన చేసారు అదేంటంటే నెల నుండి యూనిట్ పరీక్షలో మొదటిస్థానం వచ్చినవారిని మరియు ఆటలలో మిక్కిలి ప్రతిభ చూపించిన వారిని ఎంపిక చేసి మా ఉపాధ్యాయుల సంఘం ఒక నిర్ణయానికి వచ్చి ఒక్కొక్క తరగతికి ఒక నాయకుణ్ణి ఎంపిక చేస్తారు.ఇది విద్యార్ధులలో నాయకత్వ లక్షణాలు పెంపొందించేందుకు ఒక ప్రయత్నం అని ప్రకటన సారాంశం.
          అమ్మో ఇవన్నీ మనకు పడేవి కాదులే అని నా మానాన నేను చదువుకొంటూ మామూలుగా మా టైం-టేబుల్ ప్రకారం ఆటలు ఆడుకొంటున్నా. ఇంతలో ఒక సాయంత్రం మా మాస్టార్లు ఆటల పోటీలు నిర్వహించారు..నా ఖర్మ కాలి పరుగులో,హై జంప్ ,లాంగ్ జంప్, డిస్క్ త్రో, షాట్ పుట్ లో నాదే మొదటి స్థానం హ్మ్మ్మ్.. నాకే మొదటి స్థానం అంటే మిగతా వారు ఎంత ఘనులో చెప్పఖర్లేదు కదా .ఐనా అప్పటికి దేవుడి జూదం లో మనం పావులం అని తెలిసే వయసు కాదు లెండి లేకపోతే మున్ముందు పరిణామాలు ఆలోచించి అసలు ఆటలే ఆడకపోదును అంతే తర్వాత యూనిట్ పరీక్షలు వచ్చాయి ఖర్మ కాలి తరగతి మొదటి స్థానం వచ్చింది..ఇంక చెప్పేదేముంది మనమే మా తరగతి నాయకులం వద్దు మొర్రో అంటున్నా వినకుండా ఎద్దుకి గిట్టలు కొట్టినట్టు పదవిని నాకు బలవంతంగా తగిలించారు ఇంకేం చేస్తాం. చచ్చినట్టు బండి లాగించడం మొదలుపెట్టా. ఒక రోజు మాస్టారు రాలేదు నేను మా తరగతిని కాపలా కాస్తున్నా.ఇంతలో ఒక మూల నుండి కెవ్వుమని చప్పుడు ఏమైందో అని అటువైపు చూసేలోపు ఒక నోటుపుస్తకం గిర గిర తిరుగుతూ  వచ్చి నా మొహమ్మీద తగిలింది నాకు తిమ్మ దిరిగి (దిమ్మ తిరిగి కాదు :) ) ఏమి జరుగుతుందో అని వైపు చూస్తే ఇంకేముంది హిడింబి,శూర్ఫణఖ లాంటి మణిమాల , శ్రీకాంతి ఒకరి జుట్టూ ఒకరు పట్టేసుకొని సిగపట్లు పట్టేసుకొంటున్నారు..నేను వాళ్ళకు గొడవ వద్దు అని చెప్పి చూసా..వినలే.హతవిధీ!! వీళ్ళు ఇద్దరూ మామూలుగానే తిన్నగా ఉండరు మళ్ళా ఎందుకు గొడవ పడుతున్నారో అనుకొన్నా ఐనా కాని, నాకెందుకులే ముందే చెప్పాం కదా ఇంకా గొడవైతే మా ఉపాధ్యాయుడికి చెప్దాం అని ఊరుకొన్నా. కాని గొడవ అంతకంతకూ ముదురుతుంది నాలో నిద్రిస్తున్న సింహం లేవబోయింది కాని దాన్ని బజ్జోపెట్టి ఎంతో ఓపికతో ఏమి జరిగింది అన్నా. వెంటనే ఇద్దరూ ఒకేసారి !@#$%
నేను: అర్ధం కాలా
ఇద్దరూ
:!!@\\#$%%
నేను
: ఏహె ఇద్దరిలో ఒకరు సరిగ్గా ఏమి జరిగిందో చెప్పండి అన్నా
సారి మళ్ళా !@#$%^ తో పాటుగా స్కేళ్ళు ఇచ్చుకొని అలెగ్జాండెర్, పురులు కత్తులు దూసుకొన్నట్టు మీద పడిపోయారు. విడతీయబోయిన నాకు ముక్కు పచ్చడయ్యి రంగులలోకం కనిపించింది. రంగులలోకం మాయమవ్వగానే అసలు లోకం లో వీరిద్దరు తన్నుకోవడం కనిపించిది. ఇంక నాకు తగిలిన దెబ్బలకి పిచ్చ ఎవరెస్ట్ శిఖరాన్ని దాటేయడంతో, నాలోని సింహం గొలుసులు తెంచుకొని దూకేసింది. అంతే ఇద్దరి పిలకలు పట్టుకొని ఒక్క గుంజుగుంజి నడ్డి మీద రెండు తగిలించా దెబ్బకి అప్పటి దాకా మొదటి రోజు సినేమా హాలు లాగ గోలగా ఉన్న వాతావరణం కాస్తా 20 రాం గోపాల్ వర్మ  సినిమాలు వెంట వెంటనే చూసిన ప్రేక్షకుళ్ళా నిశ్శబ్దం అయిపోయింది. అప్పుడు ఇద్దరి పిలకలూ గుర్రం కళ్ళాలలాగా రెండు చేతులలో పట్టుకొని క్లాస్ అందరి వైపు తిరిగి అడిగా....నేనెక్కడి నుండి వచ్చానో తెలుసా(అందరూ: తెలియదు) (సమాధానం : పక్క ఊరినుండి) నేనెందుకు వచ్చానో తెలుసా(అందరూ: తెలియదు)(సమాధానం:చదువుకోవడానికి) చదువు కాకుండా నేను మిగతా గొడవలకు దిగవలసి వస్తే.. రెచ్చగొట్టినవాళ్ళెవ్వరూ వాళ్ళ తరువాత పుట్టినరోజులకు వాళ్ళుందరు...ఒక్కొక్కరి వీపుపై దెబ్బలు శివమణి డప్పులా మోగుతాయి..అమ్మాయిలూ ముఖ్యంగా మీరు..జాగ్రత్త అని చెప్పి వాళ్ళ పిలకలు బల్లకేసికొట్టి కూర్చున్నా. మన ఆవేశాన్ని చూసి హెచ్చరిక అమ్మాయిలకు మాత్రమేనా అని అడిగే ధైర్యం అమ్మాయీ చెయ్యలేదు.
          ఆ రోజు తరగతులు ముగిసాకా అబ్బాయిలు అందరూ ప్రపంచ కప్ గెలిచాకా సచిన్ ని ఊరేగించినట్టూ భుజాలమీద పెట్టుకొని ఊరేగించి తీసుకొనివెళ్ళి చిన్నసైజు సన్మానం చేసి శూరసింహ అనే బిరుదు ప్రసాదించారు. ఇంక రోజునుండి మన వాక్కు వేద వాక్కు ,అబ్బాయిలందరూ భాషాలో రజనీకాంత్ వెనకాల అనుచరుల్లాగా ఉందేవారు, వాళ్ళకు ధైర్యం కోసం మా తరగతి గుంపు ఫొటో ని తీసుకొని నా చుట్టూ వ్రుత్తం గీసి (తెలియడం కోసం అన్న మాట..గుంపులో గోవిందం కాదుగా హి..హి..హి) పడుకొనేముందు దణ్ణం పెట్టుకొనేవారు. అమ్మాయిలందరూ నన్ను చూసి లారి గుద్దిన సైకిళ్ళలాగ వంగి వంగి నడిచేవారు. ఇన్నాళ్ళకి నా సమయం వచ్చింది అని మధ్యాన్న మార్తాండుడిలాగ చెలరేగిపోయేవాడిని(ఎలాగూ మొదటిస్థానాలూ, ఆటలూ కూడా మనవైపునే ఉన్నాయి). ఎలా చెలరేగేవాడిని అంటారా.
ఉదా: 1)అమ్మాయిలు తరగతి లో మాట్లాడితే వాళ్ళ పేరుపక్కన రెండు ఇంటూలు మాస్టారితో దెబ్బలు అబ్బాయిలైతే..వాళ్ళు ఎప్పుడైనా మాట్లాడతారా అసలు హి..హి..హి.
2) అమ్మాయిలు పాఠశాలకు రావడం లేదు అని కబురు పంపినా నాకు చేరదు.అబ్బాయిలైతే ప్రార్ధనా సమయానికి రాకపోయినా నాకు ముందే చెప్పి మానేవాళ్ళు.
3) సాయంత్రం మాకు పాఠశాలలో చిరుతిళ్ళు ఇస్తే నేనే అందరికీ పంచాలి , అమ్మాయిలు ఎవరైనా పంచే సమయానికి లేకపోతే వాల్లు రోజు కనిపించలేదు కాబట్టి అవి తిరిగి పాఠశాలకే ఇచ్చివేయబడేవి, అదే అబ్బాయిలైతే ఎన్ని గంటలైనా దాచి వాళ్ళకు ఇవ్వడం జరిగేది.
విధంగా జనరంజకంగా(జు..హిట్లర్) లాగా పరిపాలన సాగిస్తూండగా నెలకు మూడు వర్షాలు పడి రాజ్యం ఎంతో సుభిక్షంగా ఉండేది( ఏదో ఫ్లోలొ రాసా హి..హి..హి) విధంగా ఉన్న రాజ్యంలో ఒక తుఫాను రేగింది..అదేంటో వచ్చే భాగంలో      
         

13 comments:

రాఘవ said...

బా.త్రి.సుం. వచ్చి చేరిందా ఏమిటండీ? :)

మనసు పలికే said...

అమ్మాయిలన్నా, వాళ్ల జడలన్నా మరీ ఇంత కక్షా??
ఆ ఉదాహరణలు చూసి నాలో సివంగి నిద్ర లేచే సమయం ఆసన్నమైందని అనుమానంగా ఉంది..;) జాగ్రత్త...హిహ్హిహ్హీ

గిరీష్ said...

@రాఘవ,
వస్తుంది వస్తుంది..on the way :)
చూస్తుంటే మీరు బా.త్రి.సు కి పెద్ద ఫ్యాన్‌లా ఉన్నారు.. :)

@అపర్ణ గారు,
నిద్రపోయే వాళ్ళని ఎందుకండీ లేపటం, అయినా
మేము బయట పాత్రలని మా టపాల్లోకి అనుమతించం :)

కావ్య said...

కోపం లో అలా కొట్టేసారు కానీ .. దాని పర్యావసానం .. మీరు ఊహించి ఉండరు ..

నెక్స్ట్ ఎపిసోడ్ లో మీకుంటుంది చుడండి .. అబ్బ నాకు తలుచుకుంటేనే బలే నవ్వోచ్చేస్తోంది ఏంటో :)

బులుసు సుబ్రహ్మణ్యం said...

బాబ్బాబు మా ఊరు రండి pl. ఎండలు మండుతున్నాయి, బట్టతలలు మాడుతున్నాయి. వచ్చి ఒక వర్షం కురిపిస్తే మీ పెళ్లి మేం చేయిస్తాం. :):)

గిరీష్ said...

@కావ్య గారు,
చూద్దాం ఎవరు నవ్వుతారో.. :)

@బులుసు సుబ్రహ్మణ్యం గారు,
welcome to my blog అండి.
ఇక్కడేదో తుఫాను రేగింది అని నేను తెగ బెంగపడిపోతుంటే మీరేంటండి వర్షాలంటారు.. :)
ఏలూరు లాగే బెంగళూరులో కూడ ఎండలు బాగానే ఉన్నాయండోయ్..
ధన్యవాదములు.

kiran said...

ఇంత హింసిస్తే..తుఫాను..కాదు tsunami రావాలి.. :P
>> అప్పటి దాకా మొదటి రోజు సినేమా హాలు లాగ గోలగా ఉన్న వాతావరణం కాస్తా 20 రాం గోపాల్ వర్మ సినిమాలు వెంట వెంటనే చూసిన ప్రేక్షకుళ్ళా నిశ్శబ్దం అయిపోయింది...హహహ..ఆవన ఇలా ఉంటుందా??..నేను ఎప్పుడూ చూడలేదు..RGV సినిమాలు..:)

గిరీష్ said...

@కిరణ్ గారు,
శాంతించండి.. శాపాలు పెట్టకండి :)
బులుసు సుబ్రహ్మణ్యం గారు అన్నట్టు వర్షం రావాలని కోరుకోండి, మీరు మళ్ళీ Mr.పర్‌ఫెక్ట్‌కి వెళ్ళొచ్చు.. :D

..nagarjuna.. said...

సూపర్ సిరీస్ బాస్..... :))

కొత్తగా బా.త్రి.సు వచ్చారా గజలక్ష్మినా ?

మీ స్నేహితుడిని తొందరగా తరువాయి భాగం రాయమనండి, మేము కూడా తత్వవేత్తలం ఔతాము ;)

pallavi said...

We are waitinggggg for the part FIVE. Checking almost Twodays once. please post the new one as fast a s possible

గిరీష్ said...

@నాగార్జున & పల్లవి గార్లకి,
నేను ఇదే విషయం మా కవినడిగా..
మా సంబాషణ చూడండి..
నేను: part 5 :(
కవి: ఇక్కడ పార్టుపార్టులుగ నంజుకుంటున్నారు.. :'(

కనుక, నేను ఏమి చెయ్యలేనండి..మీ అభిమానానికి ధన్యవాదాలు. I will try my best to get it soon. Thank You. :)

రసజ్ఞ said...

అమ్మాయిల మీద ఇంత కక్షా? హన్నన్నా! నేనొప్పుకోను! ఏమిటీ అన్యాయం?

గిరీష్ said...

@రసజ్ఞ గారు,
ఏదో మా కవికి అమ్మాయిల మీద పాత కక్షలు లేండి.. :), ధన్యవాదములు.