Tuesday, April 26, 2011

Lots of Love


మంచి శుక్రవారం సందర్భంగా మళ్ళీ నిన్న వారాంతం ఇంటికి జంప్.. :). ఈ మూడు రోజులలో రెండు ముఖ్య ఘటనలు చోటు చేసుకున్నాయి. మొదట చెడు, తర్వాత మంచి. అవేమిటో చూద్దాం.
          మా అన్న పెళ్ళి సందర్భంగా ఇంటి పనులు జరుగుతున్నప్పుడు ఇంట్లో ఉన్న పాత వస్తువులు, పుస్తకాలు అన్నీ సర్దాము. నేను, మా అన్న పుస్తకాలు అన్నీ అట్టపెట్టెళ్ళో వేసి, కట్టి క్రింద మా అంగడి(ఇంటి)లో పెట్టాము పైన అడ్డాలెందుకని. పెళ్ళి అయిపోయాక తెచ్చుకోవచ్చని. షాపులో అద్దెకు ఉంటున్న అతను ఏం పర్వాలేదు నాకేం అడ్డంలేదు, మీరు ఇక్కడ పెట్టుకోవచ్చు అన్నాడు. సరేలే అని, మేము ఆ తర్వాత అక్కడ నుంచి తియ్యలేదు. ఆయన ఏం అనలేదు. కానీ.. కానీ.. కానీ.. మొన్న ఇంటికి వెళ్ళినప్పుడు చూస్తే అక్కడ లేవు. ఏం అయ్యాయని నానమ్మని అడిగితే పాత పుస్తకాలని వేసేశాను అని చెప్పింది. నాకు, మా అన్నకి చిన్నగా నవ్వు వచ్చింది. సరేలే చెప్పు అని మా అన్న అడిగాడు. చెప్పాగ పనికిరావు అనుకొని వేసేశాను అంది. నాకు, అన్నకి సౌండ్ లేదు. అదేంటి అని అడిగా..?ఏమో పనికిరావేమో అనుకొని వేసేశాను అంది. నీకు ఎవరు చెప్పారు పనికిరావు అని అడిగాను. మరి అన్నిరోజులుగ కింద అంగడిలో ఉంటే నేను అలాగే అనుకొని వేసేశాను అంది. మా అన్నకి నాకు కోపం మొదలైంది. అరిచాము లైట్‍గా మా డార్లింగ్ పైన. మా అన్నైతే నేను బి.టెక్‍లో రాసుకున్న నోట్స్‌లు, నా ఎమ్.ఎస్. ప్రాజెక్ట్ బుక్స్ అన్నీ అందులో ఉన్నాయి, చెప్పమ్మా ఎవరికి వేసావో వెళ్ళి తెచ్చుకుంటాము అని చాల భాధ పడ్డాడు. నాకైతే, నేను నా పదవతరగతి నోటు పుస్తకాలు కూడ ఎవ్వరికి ఇవ్వకుండ చాల జాగ్రత్తగా దాచుకున్న, అన్నీ పోయాయి.. :(. ఊరు మొత్తం అన్నీ పాత పుస్తకాలు కొనే షాపులలో వెతికా, ఫలితం లేకపోయింది. కట్ చేస్తే నేను ఆ రోజు ఇంట్లో అన్నం తినలేదు, మా నానమ్మతో మాట్లాడల.. :(. I was dippressed alot. It was a very bad day for us. అమెను ఏమి అనటానికి లేదు, తనకేం తెలియదు పాపం. ఎవ్వరిని ఏమి అనలేక మౌనం పాటించా ఆరోజు. ఇప్పుడు ఒక పుస్తకం లేదు ఇంట్లో. తలచుకుంటేనే భాధగా ఉంది.
          తర్వాత రోజు ఇంక చేసేది ఏం లేక ఆరోజుది దాని ముందు రోజుది కలిపి ఫుల్‍గా తిన్నా.. :), ఓకె ఓకెగా గడిచింది ఆరోజు. చివరగా ఆదివారం పొద్దున్నే మా అన్న-వదిన వెళ్ళి తిరుమలకి వెళ్ళాలని టోకన్ వేయించుకొచ్చారు. మూడ్ బాలేక నేను రాను అని చెప్పా. సరేలే అని వాళ్ళు వెళ్ళి టోకన్ వేయించుకున్నారు. ఇంతలో మా సీల్ రాకాసి(నానమ్మ :) ) నేను వెళ్తా అంది తిరుమలకి. అదెలా కుదురుతుంది. నువ్వు వెళ్ళాలంటే నీకు ఎవరైనా తోడు ఉండాలి (అరవై ఐదు సంవత్సరాలు పైబడిన వృద్ధులకి, వారితో పాటు మరొకరికి గుడిముందు ముందు నుండి నేరుగా పంపుతారు లోపలకి, తెలుసా.. ? :) ) అని చెప్పా. నువ్వున్నావ్‍గా అంది తను. నేను రాను అన్నా. మా అన్న ఏమో, ముసలామి అడుగుతుందిగా తీసుకెళ్ళు అంటే ఇంక చేసేది ఏమి లేక నలుగురం వెళ్ళాం కొండకి. మా అన్నకి ఏమో మా వదిన, నాకేమో మా నానమ్మ. అందరూ మా పెయిరే బాగుంది అన్నారు.. :). నాకు బుర్రకి తెలియని విషయం ఏంటంటే, వృద్ధులని, వికలాంగులని, వళ్ళు బాగలేని వాళ్ళని గుడి లోపలికి వదిలేటప్పుడు వేరే వాళ్ళని అనుమతించరు. మరియూ ఎవ్వరిని త్వరత్వరగా లాగరు బయటకి. సో నాకు సూఊఊపర్ దర్శనం మా నానమ్మ పుణ్యమా అని :). దాదాపుగ ఒక నిమిషం పైనే చూశాను వెంకీని. జన్మ ధన్యమైందిపో అనుకున్నా.. :). బయటకి వచ్చేశాక అడిగా మా నానమ్మని ఏంటి తెగ మొక్కేస్తున్నావ్, ఏం కోరుకున్నావ్ అని. తను ఏమందో తెలుసా.. "ఏముంది నాయన, (మా)అన్నకి తొందరగా ఒక బిడ్డ పుట్టాలి. నేను మీ ముగ్గరి చేతిలో సంతోషంగా చనిపోవాలి". నాకు ఏడుపొక్కటే తక్కువ ఆ క్షణంలో తను ఆ మాట అన్నందుకు మరిము మేము ఆమెను పుస్తకాలమ్మేశావని అరిచింది గుర్తుకువచ్చి. ఆమె నావంక చూసింది, ఏదో కవర్ చెయ్యాలని అవన్నీ నువ్వు కోరుకోకపోయినా జరుగుతాయిలే అన్నా..తనూ ఓ నవ్వు నవ్వింది.
          ఇంకేమి చెప్పాలి మా రాక్షసి గురించి :), ఎట్టి పరిస్థితులలోను పెద్ద వాళ్ళు మనల్ని భాధ పెట్టరు. ఒకవేళ ఏదైనా అలా జరిగితే తెలియకో లేక వయస్సు ప్రభావం వళ్ళనో కాని, ఇంకేవిధమైన కారణం ఉండదు. That’s It.  

13 comments:

Bhaskar said...

బాగా రాసావు. టచింగ్ గా ఉంది

kiran said...

గిరీష్ గారూ.. చాలా touching గా ఉంది పోస్ట్...:)....హ్మ్న్న్..
మీకు పుస్తకాలు కావాలి అంతే గా..మళ్ళి స్కూల్ లో చేరండి..:P ..అంతే గాని మీ స్వీట్ నానమ్మ గారిని ఏమి అనకండి..:)

Unknown said...

కదా .. హ్మ్ బాగుందండి . మీ నానమ్మ కబుర్లు :)

నేను మా బామ్మకి చుక్కలు చూపించా అది ఒక పోస్ట్ రాయాలి అనుకుంటున్నా :) ఇంకా రాసేస్తా

Tarak said...

I really agree with u......... it is really nice one...:) Keep going

గిరీష్ said...

Thanks to all..

buddhamurali said...

baagundandi

గిరీష్ said...

@బుద్దా మురళి గారు,
ధన్యవాదములు.

రాజ్ కుమార్ said...

మా అన్నకి ఏమో మా వదిన, నాకేమో మా నానమ్మ. అందరూ మా పెయిరే బాగుంది అన్నారు.. >>>> హాహ కెవ్వ్వ్.. భళ్ళున నవ్వేశా ఇక్కడ

నాకొక డౌట్..
సీల్ రాకాసి అంటే ఏమిటండీ.. చాలా సార్లు విన్నాను కానీ అర్దం తెలీదు.. ;(

చాలా బావుందండీ.. నాకు బాగా నచ్చిందీ పోస్ట్..

గిరీష్ said...

@రాజ్ కుమార్ గారు,
ధన్యవాదములు పోస్ట్ నచ్చినందుకు.
సీల్ రాకాసి: ఏమో, మహేష్ వాడాడు మురారిలో, సో యాజ్ ఎ ఫ్యాన్‌గా నేను.. :)
భీబత్స భయానకానికి కామిడీ పంన్చ్‌తో చెప్పే పదమనుకోండి :)

రాజ్ కుమార్ said...

హ్మ్మ్.. మీదీ మురారీ నాలేడ్జేనా..?
అన్నట్టూ.. మీ బ్లాగ్ ఫాలో అవ్వటం ఎటుల?? గాడ్జెట్ పెట్టుకుంటే బెటరేమో కదా? ;)

గిరీష్ said...

@రాజ్ గారు,
మరంతేగా..ఇంట్లో వాళ్ళనో లేక బయట వాళ్ళనో సీల్ రాకాసి అంటే ఊరుకుంటారా, సొ అది రీల్ నాలెడ్జే రియల్ కాదు :).
గాడ్జెట్ పెడతాను ఫాలో అయిపోండి :). Thank You!.

Madhuri said...

మా అన్నకి ఏమో మా వదిన, నాకేమో మా నానమ్మ. అందరూ మా పెయిరే బాగుంది అన్నారు.. :)... superr ...

గిరీష్ said...

@మాధురి గారు,
థ్యాంక్స్ అండీ మీ వాఖ్యకి.. :)