Friday, April 8, 2011

స్నేహితులు


          తెలుగు నూతన సంవత్సరం సందర్భంగా సోమవారం సెలవు అవడంతో, శుక్రవారం కూడ సెలవుపెట్టి పెద్ద వారాంతంతో ఇంటికెళ్ళా..
ఉగాది రోజున పొద్దున్నే నిద్రలేచి స్నానమాచరించి గుడికెళ్ళా. అక్కడ కలిశాడో స్నేహితుడు, ఎలా ఉన్నావు, ఉగాది శుభాకాంక్షలు.. తర్వాత గుడిలో ఉగాది పచ్చడి.
బయటకొచ్చాక మా సంభాషణ..
నేను: ఇంక ఏంటి ఊర్లో విశేషాలు.
మల్లి: ఏమున్నాయ్, అన్నీ మామూలే, కాకపోతే ఎండలే కాస్త ఎక్కవ.
నేను: అవును, మా ఊర్లో ఇంతలేదు.
మల్లి: మీఊరా, సారి నీకి మాంచి హైక్ ఇచ్చినట్టు ఉన్నారు, ఎప్పుడుకొన్నావ్?
నేను: :), అదే బెంగళూరులో.
మల్లి: అన్నట్టు నాకు పెళ్ళి ఫిక్స్ అయింది..
నేను: పెళ్ళా, మీ ఇంట్లో వాళ్ళే చేస్తున్నార?
మల్లి: పెళ్ళి కూతురు వాళ్ళు కదా చేసేది.
నేను: నేను ఇంకా T.V 9 వాళ్ళు అనుకున్నాలే.. :)
మల్లి: అదేంటి?
నేణు: ఉన్నట్టుండి పెళ్ళంటే..సందేహమొచ్చి ఎక్కడైనా T.V 9 వాళ్ళకి దొరికిపోయావేమో అని.. :))
మల్లి: మరి సంవత్సరం ముందు చెప్పాల, పెళ్ళంటే అలాగే ఉంటుంది. కళ్యాణం వచ్చినా కక్కు వచ్చినా ఆగదనింది అందుకే.
నేను: సామెత ఎవడు కనిపెట్టాడో కాని చండాలంగా కక్కుతో పోల్చాడు.
నేను: శీను యెక్కడున్నాడు.?
మల్లి: మనోడు ఇంట్లోనే దేవునికి ధూప దీప నైవేద్యాలు చేసేస్తున్నాడు.. :)
నేను: సరేలే సాయంకాలం సినేమాకి వెళ్దాం.
మల్లి: ఏం సినేమా, శక్తా, నేను రాను.
నేను: ఏం?
మల్లి: సినేమాకెళ్తే, మన శక్తి పోతుందటగా..
నేను: :) సరేలే, వేరే ఏదైనా..శీనుని కూడ పిలువ్.
**** సాయంకాలం *****
నేను, మల్లి, శీను చోట కలిశాం.
శీను: నమస్తే సార్
నేను: నమస్తే, ఉగాది శుభాకాంక్షలు సీనయ్యా(with respect)..
శీను: నీకు కూడ.
నేను: ఏంటి విశేషాలు?
శీను: నువ్వే చెప్పాలి, ఇక్కడేం ఉంటాయి, ఎండలు తప్ప..
నేను: అక్కడ కూడ ఏంలేవులే కాలుష్యం తప్ప :)
మల్లి: ఛా..
శీను: మల్లి, కిశోర్ కి కూడ కాల్ చెయ్, వస్తాడేమో అడుగు.
(తను కూడ వచ్చాడు)
నేను: హ్యాప్పి ఉగాది.
కిశోర్: ఖర నామ సంవత్సర శుభాకాంక్షలు.. :)
నేను: వెల్దామా, హాల్ కి.
కిశోర్: చిరుకి కూడ ఫోన్ చెయ్, నీతో ఏమో మాట్లాడాలంట.
నేను: నాతోన..?
కిశోర్: హా..
(తను కూడ వచ్చాడు, మొత్తం ఐదు మంది:), సినేమాకి వెళ్ళే దారిలో )
నేను: సీనయ్యా ఏంటి ఈరోజంతా ఇంట్లోనే ఉన్నావంట?
శీను: లేదే..
నేను: పొద్దున గుడికి కూడ రాలేదు.
శీను: ఓహ్.. అదా ఇంట్లో పూజ చేశా అమ్మ చెబితే.
నేను: ఏమ్ కోరుకున్నావ్ ఏటి..
మల్లి: ఇంకేముంది, పెళ్ళే :)
చిరు: కరెక్ట్, మనోడిని వాళ్ళింట్లో వాళ్ళు బరించలేకుండ ఉన్నారు..
నేను: అయితే మల్లి తర్వాత నీకే నా.. :)
శీను: ఏమో పుట్టలో ఏముందో ఎవరికి తెలుసు.
       అందంరం సారి హాయి గా నవ్వుకొని సినేమాకి వెళ్ళాం. It was a beautiful evening for me after a long time.. రోజుళ్ళో ఇలాంటి సాయంత్రాలు చాలా అరుదు.. అందరికి శ్రీ ఖరనామ నూతన సంవత్సర శుభాకాంక్షలు (కాస్త ఆలశ్యంగా :) )* Lets Join Hands at Freedom Park (Near Anand rao circle or Old Race course Road Bangalore) on this weekend to Support Mr. Anna Hazare(72) who is fighting against corruption.

7 comments:

Indian Minerva said...

Well bro... what does it mean by a week end? Sat or Sun?

Thanks for the idea "Friends" :D.

గిరీష్ said...

Its already started and going on from past 2-3 days itseems..so any day is fine.

గిరీష్ said...

No need to go to F.Park..they have agreed.. :) (source: 2day's paper)

Bhaskar said...

"శీను: నువ్వే చెప్పాలి, ఇక్కడేం ఉంటాయి, ఎండలు తప్ప..
నేను: అక్కడ కూడ ఏంలేవులే కాలుష్యం తప్ప "
బాగుంది

గిరీష్ said...

భాస్కర్,
ఈ ఫ్లై ఓవర్ల పుణ్యమా అని అవుటర్ రింగ్ రోడ్లో దూల తీరిపోతుంది..భయంకరమైన దుమ్ము. ఎప్పుడు పూర్తవుతుందో ఏమో.. :)

kiran said...

మంచిదే కదా..అప్పుడప్పుడు ఇలాంటి సాయంత్రాలు అందరికి అవసరం..:)
అవును..ఈ ఫ్ల్య్ ఓవర్ పనులు ఎప్పుడైపోతాయో కానీ..దుమ్మంత మన మీదే.. :(

గిరీష్ said...

కిరణ్ గారు,
ధన్యవాదములు వాఖ్యకి.. :)