Wednesday, December 28, 2011

2011

ముందుగా అందరికి ముందస్తుగ నూతన సంవత్సర శుభాకాంక్షలు ఒక సారి..

నూతన సంవత్సర ఆగమన సంధర్భముగ మీ అందరికీ శుభాకాంక్షలు తెలుపుదామని మరియు నా విషేషాలు కొన్ని నెమరు వేసుకుందామని ఇలా వచ్చా. ఇక పోతే రెండువేల పదకొండులో మనం అంటే నేను పెద్దగ చేసింది ఏమీ లేదనిపిస్తుంది.. ఎందుకంటారు..?
1.
సాఫ్టువేరు జాబు వలన..
2.
నెలకు రెండు సార్లు ఇంటికి వెళ్ళడం వలన..
3.
బెంగళూరులో/ఒకే కంపెనీలో ఉండటం వలన..
4.
పైవన్నియు..
5.
ఏవీకావు..
          
          మొన్నొకసారి మా ఊరు వెళ్ళినప్పుడు నా పదవతరగతి మిత్రులు ఇద్దరు కలిశారు. ఆశ్యర్యం అందులో ఒకడు నాలాగే ఐ.టి. వీరుడు.. :) ఇంకొకడు ప్రభుత్వ ఉద్యోగి. చాలా రోజుల తర్వాత కలిశాం కదా అవి ఇవీ చాలా సేపే మాట్లాడుకొన్నాం. ఇంతలో ఒకడు ఏంది మామ జీవితం మీద విరక్తేస్తుంది; మనం చదువుకునే రోజుల్లో ఎవడైనా ఏదైనా అంటే చాలు వాడి మీద తిరగబడే వాళ్ళం, కుదిరితే కొట్లాటకు దిగే వాళ్ళం, ఇంట్లో మనకి ఇష్టం లేదినిది ఏం చేసినా ఒప్పుకునే వాళ్ళం కాదు.. ఇప్పుడేమో ఎవడేమన్నా పట్టించుకోవట్లేదు, ఇంట్లో బయటా ఏం మాట్లాడినా ఎన్ని అరిచినా గమ్మునుంటున్నాం. అసలేం జరుగుతోదో అర్ధం కావట్లేదు అని ఫీల్ అయ్యాడు. నిజమే కదా అని మిగిలిన ఇద్దరం ఆలోచనలో పడ్డాం. ఇంతలో మా వాడు ఉన్నట్టుండి బహుశా మెట్యూరిటీ అంటే ఇదేనేమో మామ అన్నాడు. అంతే ముగ్గరం ఒక్కసారిగ... (ఇంక చేసేది ఏం లేక :-) ). సరే అని నేను మా ఐ.టి వీరుడు కలసి వాసన్ ఐ కేర్ కి వెళ్ళాం అద్దాలు చూపించుకుందాం అని.. :) వెళ్ళగానే అక్కడ ఒకావిడ ప్లీస్ కం సార్ అంది.. ఇంతలో మా వాడు ఉండబట్టలేక "మేమున్నాం రండి అనరా మీరు" అన్నాడు. ఆమె ఒక సూపర్ స్మైల్ పెట్టడంతో లోపలికి వెళ్ళాం :-). లోపల డాక్టరు సైట్ చెక్ చేస్తుంటే వీడేమో నాతోటి ఏంట్రా ఈసారన్నా మంచి హైక్ వస్తుందా లేకపోతే డిడి లో హైదరాబాదు ప్రోగామేనా జీవితం అన్నాడు. డాక్టరు వెంటనే మీరిద్దరు సాఫ్టువేరు ఇంజనీర్ళా అని అడిగాడు, అంతే ఇంక మేము మళ్ళీ ఏం మాట్లాడలా సిగ్గుతో..
 
     మరుసటి రోజు పొద్దున్నే ఏడింటికి ఆఫీసుకెళ్ళా సాయంత్రం తొందరగా వెళ్దాం రూం కని. ముందర దారిలో యాక్సెస్ కార్డ్‌ పెడితే స్వైప్ కోసం, అదేమో డోర్ ఓపన్ అవ్వట్లేదు. ఎంతకీ రాకపోయేసరికి ఎవరో పక్కన కలీగ్ ఉంటే స్వైప్ చేస్తే లోపలికి వెళ్ళా. తీరా ఏమైందని మా టీమ్మేటుని అడిగిగే నీ యాక్సెస్ కార్డ్‌ నంబరునే టెస్ట్‌కి పెట్టా మామా నిన్న, మేబి అందుకే ఏమో అన్నాడు. అందుకే ఏమో ఏంట్రా అని ఓ రెండు బూతులు తిట్టి వెళ్ళి నా స్థలంలో కూర్చుని ఏదో ఆలోచిస్తుంటే మా డ్యామేజరు పిలిచి మనకి రియాక్టర్ మెంటైనె‌న్స్ ప్రాజెక్ట్ వచ్చింది. ఒకవారం లోపల నువ్వు ఒక ప్రోటోటైప్ కోడ్ రాయి అన్నాడు. మరీ ఒక వారం అంటే కొద్దిగ కష్టం అన్నాను. సరేలే అని నేను నాబాధలు ఏవో పడుతుంటే, ఒక గంట తర్వాత వచ్చి ఎంతవరకు వచ్చింది అని అడిగి నేను రాసే కోడ్ చూశాడు..

while(reactor_status == working)
{
   
}
if(reactor_status == blast)
{
       /* Write some code to do nothing */
       printf("Do Nothing");     
 }

మావాడు ఏదో షాక్‌కి గురైనట్లు ఒక ఫేస్ పెట్టి ఏం మాట్లాడకుండా వెళ్ళిపోయాడు.
 
     అప్పుడే kung fu panda - 2 విడుదల అవ్వటం వలనో లేక మా ఆఫీసులో టార్చరు ఎక్కువ అవటం వలనో తెలియదు కాని వెళ్ళి మా ఆఫీసులో యోగ క్లాసులు హాజరయ్యాను. ట్రైనీ చూడ్డానికి బాగుండటంతో రోజూ మా బ్యాచ్ అంతా వెళ్ళి ముందర కూర్చునే వాళ్ళం. ఆమె ఏవేవో చెప్తోంది. ఆసనాలని, నాడీ శోధన అని, చక్రాస్ అని. మచ్చుకకి ఒకటి ఇక్కడ.. పద్మాసనం వేసుకొని కళ్ళు మూసుకొని ఒక సారి గట్టిగా ఊపిరి పీల్చండి అండి. నేను చెప్పేంతవరకు అలాగే ఉండండి అంది. నాకేమో నవ్వాగట్లేదు జల్సా డైలాగ్ గుర్తొచ్చి. ట్రైనర్ నాముందుకొచ్చి తట్టి ఒక నవ్వు ఫేస్ పెట్టి వై ఆర్ యూ లాఫింగ్ అంది.. నతింగ్ అన్నా.. :-). ఇంకొకటి పడుకొని ఒక కాలు పైకెత్తండి అంది..అలాగే నేచెప్పేంతవరకు ఉంచండి అంది. రక్తం అంతా అరికాలులోంచి పొట్టలోకి వచ్చినట్టు అయింది. ఇంకి ఇది మనకు సూట్ అవదులే అని తర్వాతి రోజు నుంచి అది కూడ డ్రాప్.
 
     ఇవి కాక మా స్నేహితులంతా మామా మనమంతా ఎలాగైనా వచ్చే సంవత్సరం పూర్తయ్యేలోగా కుటుంబరావులు అయిపోవాలిరా లేకపోతే యుగాంతం వస్తుంది పెళ్ళి కాకుండానే పోతాం అని భయపెట్టడాలు, అన్నకి పెళ్ళైపోయిందిగ నీకు లైన్ క్లియర్ అని అని ఇంగ్లీషులో మా ఆఫీసులో జనాలు, తెలుగులో ఇంట్లో మా డార్లింగ్ (నానమ్మ :-) ). సెటైర్ వేస్తున్నారో లేక రిటైర్ అయ్యిపోతున్నావు అంటున్నారో అర్ధం కాక నేను.

                                                              

     

     ఏది ఏమైతేనేం 2011 పెద్దగ ఏమి బాధలు లేవు..సో హ్యాప్పీ. ఇకపోతే పోయిన సంవత్సరం లాగ ఈ సంవత్సరం ఏమి రెజల్యూషన్స్ తీసుకోదలచుకోలేదు ఎందుకంటే మా వాళ్ళు అన్నట్టు మెట్యూర్ అయ్యాను కదా :-) (అసలు విషయం, అనుకున్నవి ఏవి జరగట్లేదు మరియు డిసెంబరు నెలలో అనుకున్నవి మళ్ళీ డిసెంబరు వచ్చే వరకు గుర్తు రావట్లేదు.. :) ). నాలాగే మీకు కూడ 2011 లో అంతా మంచే జరిగుండాలని కోరుకుంటూ మరియూ నూతన సంవత్సర శుభాకాంక్షలు ఇంకొక సారి తెలియచేస్తూ...

Take Care and All the very best for the New Year 2012... :-), Maza maadi.


14 comments:

రాజ్ కుమార్ said...

అబ్బో.. చాలా కాలానికి పోస్టు.. నిజంగానే ప్రళయం వచ్చేస్తదేమో.. ;)

పోస్ట్ అరిపించావు. నీ రియాక్టర్ కోడ్ అరాచకం.
సాటి బెమ్మీ గా నీ పోస్ట్ కి బింగో..బింగో.. ;)

నూతన సంవత్సర శుభాకాంక్షలు...

tarakreddy said...

Good....

Bedadala Rajasekhar Reddy said...

nuvvu keka bava...nee creativity ki joharlu...BTW happy new year 2012 :)

వేణూ శ్రీకాంత్ said...

బాగుందండీ.. మీకుకూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు..

శ్రీనివాస్ పప్పు said...

మీకు కూడా న్యూ ఇయర్ శుభాకాంక్షలు,కొత్త సంవత్సరంలో మీ అభీష్టాలనీ సిద్ధించాలని కోరుకుంటున్నా

బులుసు సుబ్రహ్మణ్యం said...

మిగతా కోరికలు ఏమిటో తెలియదు కానీ మీ ముఖ్యమైన కోరిక తీరాలని కోరుకుంటూ

నూతన సంవత్సర శుభాకాంక్షలు.

శోభ said...

గిరీష్‌గారూ..

నూతన సంవత్సర శుభాకాంక్షలండీ. చాన్నాళ్ల తరువాత మీ పోస్టు చూస్తున్నందుకు సంతోషంగా ఉంది. ఈ కొత్త సంవత్సరంలోనైనా అప్పుడప్పుడూ కాకుండా కంటిన్యూగా రాస్తుండండి :)

శిశిర said...

అంతా మంచే జరగాలని కోరుకుంటూనూతన సంవత్సర శుభాకాంక్షలు.

గిరీష్ said...

Happy... New year 
To all my Blog, Buzz and Online friends, a wonderful year ahead.... Enjoy

గిరీష్ said...

@రాజ్,
Thank You!
నావళ్ళ ప్రళయాలేమి రావులే..:)

@Tarak,
Thanks Mama..

@Rajasekhar,
Happy New year to u 2 ra.. :)

గిరీష్ said...

@వేణు గారు,
ధన్యవాదములు..

@పప్పు సార్,
Thank You So Much! :)

@బులుసు గారు,
అందుకేనండీ మీరు మాష్టారు.. భళే కనిపెడతారు.. ధన్యవాదములు.. :)

గిరీష్ said...

@శోభ గారు,
మీ అభిమానానికి ధన్యవాదములు..రాస్తానండీ, కాస్త పని వత్తిడి ఇన్నిరోజులు అంతే.. :)

@శిశిర గారు,
థ్యాంక్స్ అండీ.. మీకు కూడ నూతన సంవత్సర శుభాకాంక్షలు :)

kiran said...

:D :D
Happy new year girish :))))

గిరీష్ said...

Thank you Kiran and wish u the same :)