ఆ విధంగా ఘోరంగా అవమానింపబడిన సంగతి మా స్కూల్ అంతా ప్రచారం అయిపొయింది. అందరూ నన్నో చార్లెస్ శోభరాజు (అప్పటికి ఇంకా మన లాడెన్ కి అంత పేరు రాలేదు లెండి) చిన్న తమ్ముడిలాగా చూడటం మొదలుపెట్టారు. జీవితం దుర్భరం అంటే ఏంటో తెలిసి రావడం మొదలు పెట్టింది. అలా రోజులు గడుస్తుండగా ఒక రోజు అద్భుతం జరిగింది, మామూలుగ వారాంతంలో ఒక్కడినే బజారుకి వెళ్ళా ఇంతలో అక్కడ జాతర జరుగుతోంది, ఒక మూలగా ఒక గడ్డపోడు ఏదోపాడుకొంటున్నాడు. నన్ను చూడగానే దగ్గరకు రమ్మని పిలిచాడు నాకెందుకో, బాబూ నువ్వు కష్టాలలో ఉన్నట్టున్నావు నీకో మార్గం చెప్తా దెబ్బకు నీ కష్టాలన్నీ తీరిపొతాయి అన్నట్టు అనిపించింది. అతను నాకు మారువేషంలో వచ్చిన దేవుడిలా కనిపించాడు, వెంటనే అతని కాళ్ళ మీదపడ్డా, అతనేమీ మాట్లాడలేదు ఒక పొట్లం చేతిలో పెట్టాడు. వెనక్కి తిరిగిచూడకు, ఎక్కడైనా కొండ కనిపిస్తే మోకాళ్ళ మీద నడు, నీ నివాసానికి వెళ్ళి ఆ విభూతి పెట్టుకొని ఆ కాగితంలో మంత్రం 3 సార్లు పఠించు అన్నాడు.
హమయ్య అనుకొని ఆ పొట్లం పట్టుకొని బయలుదేరా వెనక్కి తిరిగి చూడకుండా నా పాఠశాల ఉన్న కొండ మీదకి రహస్యంగా మోకాళ్ళ మీద నదిచి పైకి చేరుకొన్నా, అప్పుడు పొట్లం తెరిచా విభూతి చూసి ఏదో అనుమానం వచ్చింది ఐనా పట్టించుకోకుండా నుదిటికిపెట్టుకొన్నా. మంత్రం చదువుదాము అని కాగితం తెరిచా అప్పుడు తగిలింది ఒక భయంకరమైన ఝలక్, అది రాజేంద్ర ప్రసాద్ నటించిన జయమ్ము నిశ్చయమ్మురా వాల్పోస్టర్, అప్పటికి వెలిగింది నేను విభూతి పెట్టుకొనేటప్పుడు నాకు అనుమానం ఎందుకు వచ్చిందో. అది విభూతి కాదు పొయ్యిలో పిడకలు కాల్చాక మిగిలే బూడిద.
ఒక్కసారిగా నాకు పిచ్చకోపం వచ్చింది వాడిని జాతరలో దొరికితే పట్టుకొని ఉతికేద్దాం అని బయలుదేరా. ఇంతలో మా జూనియర్ ఒకడు ఎదురయ్యాడు ఆ ఊపులో పొరపాటున వాడిని గుద్దేసా వాడి చేతిలో పుస్తకాలు ఎగిరిపడ్డాయి, వాటితో పాటే కొన్ని ఫొటోలు కూడా. ఏంటి రా అవి అని అడిగా, అసలే మనకి అంత మంచి పేరు ఉండటంతో వాడు భయపడూతూ, అన్నా! అవి మొన్న మా స్నేహితుడి పుట్టినరోజుకి ఫొటోలు తీసుకొన్నాము అన్నాడు, చూస్తారా అన్నా అని చేతిలోపెట్టాడు, కానీ శంకమీద ఉన్నా నేను విసిరేద్దాం అనుకొని ఏదో కళ నుండి ఇవ్వరా అని చూసా అప్పుడే మెరుపులా ఆ ఫొటొలలో ఒక ఆసక్తి కరమైన విషయం కనిపించింది. అదేంటంటే మా శ్రీకాంతి అండ్ కో ఆ ఫొటొలో వెనకాల మా మేడం స్కూటీ దగ్గర ఉన్నారు. తర్వాత ఫొటొలలో పరిసీలనగా చూస్తే వాళ్ళు ఆ స్కూటీని ఏదో చేస్తున్నట్టు కనిపించింది. వెంటనే వాడిని అడిగా రేయ్! మీ స్నేహితుడి పుట్టిన రోజే మీరు ఈ ఫొటొలు తీసుకొన్నారా అని, వాడు అవునన్నా అన్నాడు. అది ఏ రోజో కనుకొన్నా అంతే ఒక్కసారిగా నడిసంద్రంలో ఉన్నవాడికి 5-నక్షత్రాల క్రూజ్ నౌక రక్షించిన భావం కలిగింది.
వెంటనే ఆ ఫొటొస్ పట్టుకొని (మన ఇమేజి దెబ్బకి వాడూ ఫొటోలు ఇమ్మని అడగలేదు) మా గురివిణి గారి దగ్గరకు బయలుదేరా. ఆవిడ ఇంటికి వెళ్ళేటప్పతికి హోరుగాలి ఎక్కడో నక్క ఊళలు పెడుతున్నాయి, ఆవిడ ఇంటి గుమ్మంలో బల్బు గాలికి ఊగుతుంది అనుకొంటున్నారా ఏమీలేదు అంతా మాములుగా ఉంది. నేను తలుపు తట్టా ఆవిడ తలుపు తెరిచారు. తెరిచి ఏదో జైలు నుండి పారిపోయిన రాజనాల వీళ్ళ ఇంటికి ఆశ్రయానికి వచ్చినట్టు చూసారు. కానీ నేను తగ్గలేదు ఎందుకంటే మేరే పాస్స్ "కుటో (అదే ఫుటో హై)". ఆ ఫుటో ఆవిడ ముందుపెట్టా, అసలు ఆ సమయంలో అత్యుత్తమ తెలుగు సామెతల న్యాయనిర్ణేతగా నన్ను కూర్చోపెడితే డబ్బింగ్ సామెతైనా "ఒక చిత్రం వెయ్యి మాటల పెట్టూ" అనే సామెతకే ఇచ్చేవాడిని :) .
కావున అద్దెచ్చ్హా ఆ ఫుటో చూసేటప్పటికి మా గురివిణి గారికి విషయం అర్ధం అయ్యింది. తరవాతెమయ్యింది మా వీధిలోకి ఐశ్వర్య రాలేదు కాని, ఒక పావుగంట తరువాత మేమందరం (నేను,మా గురివిణి గారు మరియు శ్రీకాంతి అండ్ కో) మా ప్ర.ఉ గారి ఇంటిలో ఉన్నాము. విచారణ మొదలైంది
ప్ర.ఉ: విషయం అర్ధమయ్యింది, వీళ్ళ మాటలు విని అనవసరంగా ఒక అమాయకుడిని నిందించవలసి వచ్చింది.
నేను(మనసులో): నాకు అర్ధం అయ్యింది. మీకు బుర్రలేదని. పైకి మాత్రం ఏమి మాట్లాదకుండా చూస్తున్నా.
లోపల మాత్రం పోకిరి(మైనుస్ 1 నడుస్తుంది) -1 ఎందుకంటే ఈ విషయం పోకిరి కన్నా చాల ముందు జరిగింది ;))నడుస్తుంది. మాస్టారూ ఈ తొక్కలో మీటింగులెంటో నాకు అర్ధం కావడంలేదు నలుగురున్నారు. మొత్తం అందరికి టి.సి ఇచ్చేస్తే సరిపోతుంది కదా అనుకొన్న. కాని టి.సి అనేది మన చేతుల్లో లేని విషయం కబట్టీ ఏమి చెప్తారా అని ఉత్కంఠతో ఎదురు చూస్తున్నా. అప్పుడు మా ప్ర.ఉ గారు నోరు విప్పారు. తప్పు చెయ్యడమే కాకుండా అది ఒక అమాయకుడి మీద నెట్టాలని చూశారు కాబట్టి రేపు పాఠశాలలో అందరి ముందు బహిరంగంగా తప్పు ఒప్పుకొని క్షమాపణ చెప్పండి అన్నారు. ఇంతలో నన్ను ఒక మహాత్ముడు ఆవహించాడు దానితో, అయ్యా తప్పు చేసారు కానీ దానికి ఇంత శిక్ష అవసరంలేదేమో. మా తరగతి వాళ్ళ ముందు క్షమాపణ చెప్పించండి చాలు అన్నా. వెంటనే మా ప్ర.ఉ గారి మొహంలో మెరుపు, అలాగేనమ్మా అని నాతో చెప్పి, వాళ్ళ వైపు తిరిగారు, చూసారా తన మనసు ఇప్పటికైనా బుద్ది తెచ్చుకొండి అని వారికి హితోపదేశం చేసి పంపారు.
నేను(మనసులో): నాకు అర్ధం అయ్యింది. మీకు బుర్రలేదని. పైకి మాత్రం ఏమి మాట్లాదకుండా చూస్తున్నా.
లోపల మాత్రం పోకిరి(మైనుస్ 1 నడుస్తుంది) -1 ఎందుకంటే ఈ విషయం పోకిరి కన్నా చాల ముందు జరిగింది ;))నడుస్తుంది. మాస్టారూ ఈ తొక్కలో మీటింగులెంటో నాకు అర్ధం కావడంలేదు నలుగురున్నారు. మొత్తం అందరికి టి.సి ఇచ్చేస్తే సరిపోతుంది కదా అనుకొన్న. కాని టి.సి అనేది మన చేతుల్లో లేని విషయం కబట్టీ ఏమి చెప్తారా అని ఉత్కంఠతో ఎదురు చూస్తున్నా. అప్పుడు మా ప్ర.ఉ గారు నోరు విప్పారు. తప్పు చెయ్యడమే కాకుండా అది ఒక అమాయకుడి మీద నెట్టాలని చూశారు కాబట్టి రేపు పాఠశాలలో అందరి ముందు బహిరంగంగా తప్పు ఒప్పుకొని క్షమాపణ చెప్పండి అన్నారు. ఇంతలో నన్ను ఒక మహాత్ముడు ఆవహించాడు దానితో, అయ్యా తప్పు చేసారు కానీ దానికి ఇంత శిక్ష అవసరంలేదేమో. మా తరగతి వాళ్ళ ముందు క్షమాపణ చెప్పించండి చాలు అన్నా. వెంటనే మా ప్ర.ఉ గారి మొహంలో మెరుపు, అలాగేనమ్మా అని నాతో చెప్పి, వాళ్ళ వైపు తిరిగారు, చూసారా తన మనసు ఇప్పటికైనా బుద్ది తెచ్చుకొండి అని వారికి హితోపదేశం చేసి పంపారు.
బయటకు వస్తుంటే వెనక నేలలో (బాక్ గ్రౌండ్లో) "ఎంత ఎదిగిపోయవయ్యా ...ఎదను పెంచుకొన్నావయ్యా"(పాట మూలం విజేత చలనచిత్రం నుండి పాడింది ఎవరో తెలియదు, నటించింది చిరంజీవి) అని పాట వస్తుండగా మా గురివిణి గారు నా దగ్గరకు వచ్చి బాబూ నువ్వు అల్లరి వాడివేకాని చెడ్డవాడివి కాదు ఆ సంగతి నాకు తెలుసు. కాని అప్పటి పరిస్థితుల వలన నేను అలా చెయ్యవలసి వచ్చింది. ఇందుకు గాను నీకు పరిహారంగా నీకు ఇష్టమైన సంగీత పరికరం నేర్పిస్తా అని అన్నారు. అహా!వ్రతం చెడ్డా ఫలం దక్కింది అనుకొన్నా. కానీ కథ ఇప్పుడే ఐపోలేదు. ఊహించని మలుపులు మొదలయ్యాయి. మధ్య మెరుపు (కొసమెరుపు కాదు ఎందుకంటే మనం ఇంకా కథ చివరికి రాలేదు కదా!) ఆ గడ్డపోడు మా పాఠశాల దగ్గర కనిపిస్తే ఆహా ఈయన నా పాలిటి దేవుడు అని మొక్కుదాం అని బయలుదేరా. దారిలో మావాడొకడు అడ్డు తగిలాడు, ఎక్కడికి రా అన్నాడు నేను ఏమి మాట్లాడకుండా ఆ గడ్డపోడివైపు చూపించా , అప్పుడు చెప్పాడు "రేయ్! వాడు మా వీధిలోనే ఉండే వాడు తనకి కొంచం మతి స్తిమితం లేదు" ఆ మధ్యన పిచ్చాసుపత్రిలో వైద్యం కూడ చెయ్యించారు, నేను చిన్నపటినుండి తనను చూస్తున్నా, ఎప్పుడైనా కనిపిస్తే పిలిచి వాళ్ళ పొయ్యిలో బూడిద తీసి పొట్లం కట్టిచ్చి "వెనక్కి తిరిగిచూడకు, ఎక్కడైనా కొండ కనిపిస్తే మోకాళ్ళ మీద నడు, నీ నివాసానికి వెళ్ళి ఆ విభూతి పెట్టుకొని ఆ కాగితంలో మంత్రం 3 సార్లు పఠించు" అని చెప్తాడు అన్నాడు. నాకు మంచి సంగీతసాధనలో గిటారు తీగ తెగిన భావన. హ!హ!హ ఇప్పుడు విషయం అర్ధమయ్యింది కదా. ప్రతి గడ్డపోడూ దేవుడు కాదు.