నెలల్లో నాకు నచ్చని నెల మార్చి ఎందుకంటే..చిన్నప్పటినుంచి ఈ నెలలోనే ఎక్కువగా పరీక్షలు రాసాను, ప్రిపేర్ అయ్యాను కాబట్టి. ఎన్ని నిద్ర లేని రాత్రులు గడిపానో, ఎన్ని సార్లు అల్పాహారం, అధికాహారాలు చెయ్యలేదో, ఎన్ని పుస్తకాలు చదివానో, ఎంత టెన్షనో మీకేం తెలుసు వంకాయ పులుసు. బడ్జెట్ అంటూ మనోళ్ళు చేసే సిత్రాలు చూడలేకుండా. ఇన్ని కష్టాలు, టెన్షన్లు పెడుతున్న మార్చి మనకవసరమా.. ఏంటి అవసరం లేదా..ఏంటి అవసరమా..ఏదో ఒకటి చెప్పండి..పరిక్షలైతే అవసరం లేదు..హైక్ ఐతే అవసరమా.. ఇలా కాదు కాని అవసరం అన్నవాళ్ళంతా ఒక పక్క నిలబడండి, అవసరం లేని వాళ్ళంతా ఒక పక్క నిలబడండి. మార్చి కావాలి అన్నవాళ్ళే ఎక్కువ ఉన్నారే హత విధి. ఉండక ఏమవుతుంది లే.. వీధికి వందమంది మనోళ్ళే మరి. ఏది ఏమైనా మార్చి నెలని తీసేయాలసిందే యువర్ హానర్ ఎందుకంటే ఇప్పటికి నా భయం మార్చి లోనే ఉంది, హైక్ సమయం కదా
2 comments:
నా భయం మార్చి లోనే ఉంది, హైక్ సమయం కదా
prasanth thanks for ur comment..
Post a Comment