Tuesday, March 15, 2011

అజ్ఞాత

        నేను ట్రైనీగ ఉన్నరోజుల్లో ప్రతి వారాంతం ఇంటికెళ్ళడం అలవాటు. అలా ఒక సోమవారం(సుమారు మూడేళ్ళ ముందు) పొద్దున్నే ఉదయం ఐదు గంటల సమయంలో కెంపెగౌడ బస్ స్టాప్ దగ్గర తిరుపతి బస్ దిగి బి.ఎమ్.టి.సి ఎక్కడానికి నడుచుకుంటూ వస్తూన్న. అందరు మనలాగే అనుకుంట పది మంది ఉన్నారు నడుస్తూనా ముందు అమ్మాయి నడుస్తుంది. బస్ దిగి చాల సేపు ఐన కూడ, పాపం ఇంకా నిద్రపోతూ ఉందనుకుంటా, తూగుతూ ఊగుతూ నడుస్తుంది :). రోడ్ దాటేటప్పుడు చూసుకోలేదేమో ఒకడు బస్తో టర్నింగ్ తీసుకోబోతుండగా తింగరిది దాటేస్తుంది. వెనక ఉన్న నేను చెయ్యిపట్టి లాగా తనని.
        నాకు సౌండ్ లేదు, ఎక్కడ నలుగుగు కలసి నన్ను కుమ్మేస్తారో అని నేను ఏమి మాట్లాడకుండ తనని దాటుకొని నా బస్ ఆగే ఫ్లాట్ఫాం వైపు నడవడానికి తనని దాటుకొని వెళ్ళాను. తనూ ఏం మాట్లాడకుండ నా వెనక కొంత దూరం నడిచి తర్వాత ఎటో వెళ్ళింది, మే బి తన బస్ స్టాప్ దగ్గరకనుకుంటా, నేను గమనించలా. నా భయం నాది మరి :). ట్విస్ట్ ఏంటంటే మేం ఒకళ్ళ మొహం ఒకళ్ళు చూసుకోలా. నేను తనని వెనక్కి లాగేసి, నేనేంటి అమ్మాయి చెయ్యి పట్టి లాగటమేందని భయపడి అలా ముందుకెళిపోయా. తనకి మాత్రమే తెలుసు అది యాక్సిడెంటల్ అని, మిగతా జనాలకి తెలియదు ఎందుకంటే అది టర్నింగ్ కాబట్టి.     

సో మిస్ అజ్ఞాత నీవు టపా చదవగలిగితే లెట్ మి నో ఎందుకంటే నువ్వు నాకొక త్యాంక్స్ బాకీ కనుక. తింగరి అన్నానని మనసులో ఏం పెట్టుకోకండి :).. నాకు సంఘటన గుర్తొచ్చినప్పుడల్లా నవ్వొస్తుంది, అసలెలా నేను అమ్మాయి చెయ్యి పట్టి లాగాను, ఒక వేళ అమ్మాయి తప్పుగా అనుకొని ఉంటే నా పరిస్థితి ఏంటా అని. సిట్చ్యువేషన్ డిమ్యాండ్ చేయడం వళ్ళ అనుకుంటా. మే బి మానవత్వం అంటే ఇదేనేమో, మా నానమ్మ అప్పుడప్పుడూ చెబుతూ ఉంటుంది :). మరీ పెద్ద పదం వాడేశానంటంరా.. :P
  

8 comments:

Anonymous said...

:) Thanks

Anonymous said...

ఓహో అదిమీరేనా.... నేనుమీకోసం కన్నడబ్లాగుల్లో వెదుకుతున్నాను. any how... thank you. Thank you very much.

Anonymous said...

ఆ incident నీకు ఒక sweet memory గా వుండిపొయింది!. అదే జీవితము అంటే!.

sneha said...

baagundi post .. kaani konchem 'ఈ తింగరిది ఎగేసుకొని దాటేస్తుంది' baaledemo :D

గిరీష్ said...

Thanks to all of u..
@Anonymous1,
అది మీరేన, ఇప్పటికి అజ్ఞాతేన.. :)

@Anonymous2,
ఇంక వెతకవలసిన అవసరం లేదులే మిత్రమా.. :)

@Anonymous3,
మీరు చెప్పింది నిజమే, that is life, thank you.

@స్నేహ గారు,
టపా నచ్చినందుకు ధన్యవాదములు..అలా చూసుకోకుండా రోడ్ దాటడానికి ప్రయత్నించింది కదా అని తింగరి అని రాసా సరదాగా..:)

గిరీష్ said...

కొంతమంది మిత్రుల కోరిక మేరకు ’ఎగేసుకొని’ అన్న పదం రికార్డు నుండి తొలగింపబడింది.. :)

Unknown said...

హహ నిజం చెప్పండి .. ఇప్పటికైనా .. :) .. అమ్మాయి చెయ్యి పట్టేస్కుని మానవత్వం అంటారా .. మహిళా సంఘాలకి చెప్తా ఈ విషయం

గిరీష్ said...

@కావ్య గారు,
అదే నిజం అద్యక్షా.. నేను పట్టుకోక పోయుంటే ఆ అమ్మాయికి యాక్సిడెంట్ అయ్యేది మరి.. ఇప్పుడు చెప్పండి మహిళా సంఘాలకి.. :)