మిలమిలలా మిణుగురులే తల తల తారళ్ళా మారినవే
మదినదిలో అలజడులే ఇపుడిక మాయం అయ్యనులే
మిలమిలలా మిణుగురులే తల తల తారళ్ళా మారినవే
మదినదిలో అలజడులే ఇపుడిక మాయం అయ్యనులే
ఎన్నో ఎన్నో ఆశలు ఇన్నాళ్ళుగ.. చెప్పేవీలే లేక వేచాయిగా
నాలో దాగే మౌనం నేడో రేపో.. మాటైపోదా తొలిగా
నీకై నా హృదయం వేచే ప్రతినిమిషం
తీయని బాధే అయిన ఆనందంగా ఉంటోందే
రోజూ తొలి ఉదయం నిన్నే నా నయనం
చూడాలంటూ ఎంతో ఎంతో ఆరాటంగా కళగంటోందే
నీకిక అన్నీ నేనే నీలో వెచ్చని శ్వానై కలిసుంటాగా కడదాక కనుమూసే దాక
నాకోసం నేనెపుడు ఆలోచించి ఎరుగనులే
తరచూ నీ ఊహలలో విహరిస్తున్నానే
నీతో ఈ సంగతులు చెప్పాలనిపిస్తుంటుందే
తరుణం ఇది కాదంటూ వొద్దొందంటూ మనసే ఆపిందే..
మిలమిలలా మిణుగురులే తల తల తారళ్ళా మారినవే
మదినదిలో అలజడులే ఇపుడిక మాయం అయ్యనులే
చిత్రం: తకిట తకిట
రాసింది: భాస్కరభట్ల రవికుమార్
పాడింది: సత్యం
సంగీతం: బోబో శషి
ఆన్ లైన్‍లో ఇక్కడ వినండి
నాకు నచ్చింది మరి మీకు?
No comments:
Post a Comment