పెదవే పలికిన మాటల్లోని తీయని మాటే అమ్మ..
కానీ నాకు మటుకు అన్ని మా నానమ్మే.. తనే మమ్ములను పెంచి పెద్ద చేసింది కాబట్టి..
అవును, రెండు తరాలను పెంచిన మాతృమూర్తి మా నానమ్మ..
చిన్నప్పుడే అమ్మ చనిపోవడంతో.. నానమ్మే అన్ని చూసుకునేది.. తన కొడుకు, కూతుర్ల కన్నా ఎక్కువగా.. తల్లి లేని బిడ్డలని సరిగ్గా చూసుకోవటం లేదు అని ఎక్కడ మాటవస్తుందో అని మా అన్నదమ్ములు ముగ్గురిని కసితో పెంచి చదివించింది.. తను పస్తులుండి మాకు అన్నం పెట్టేది.. తను ఇస్తరాకులు కుట్టి మా కాలేజి ఫీజులు కట్టేది..
విహార యాత్రలంటే చాల ఇష్టం మా నానమ్మకి, మాకోసం అన్నీ మానేసింది.. మేమేదైనా సాధించామంటే గర్వంగా చెప్పుకునేది ఊరంతా..ఇప్పటికీ..
ఎన్ని కష్టాలొచ్చినా, ఎంతటి నష్టమొచ్చినా, సంకల్పంతో మా ముగ్గురికి ఓ దారి చూపిన మా నానమ్మకి జోహార్.. తనే నాకు ఆదర్శం.. సో అవ్వ నీకు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు.. I Love You
(Happy Women's Day to all Women's :) )
6 comments:
అదృష్టవంతులు మీరూ, మీ నాన్నమ్మ గారు కూడా. మీకోసం ఆవిడ కష్టపడితే, ఆవిడ కష్టాన్ని మీరు గుర్తుంచుకుని ఆమె కోరుకున్నట్లుగా వృద్ధిలోకి వచ్చారు.
>>>>>తల్లి లేని బిడ్డలని సరిగ్గా చూసుకోవటం లేదు అని ఎక్కడ మాటవస్తుందో అని>>>
తల్లిలేని బిడ్డలకి ఆ లోటు తెలియనివ్వకూడదని ఆవిడ కష్టపడ్డారు అనిపిస్తూందండి. నా తరపున కూడా నాన్నమ్మగారికి శుభాకాంక్షలు.
@sisira garu,
thank you..
శిశిర అన్నట్లు మీరు అదృష్టవంతులు. మీ అవ్వగారికి నా హృదయపూర్వక మహిళా దినోత్సవ శుభాకాంక్షలు.
@Jaya garu,
yes, u guys r right, i am lucky..thank you for ur wishes :)
U are very lucky guy............
@Jyothi garu,
Thank You..
Post a Comment