Thursday, December 30, 2010

1024 X 768

              మీ న్యూ ఇయర్ రెజల్యుషన్ ఏంటి ?అదేనండి కొత్త సంవత్సరం లో ఎం చెయ్యకూడదు..ఎం చెయ్యాలి ఇలాంటివి ఏమైన లిస్టు ఉన్నాయా. ఉంటే ఇక్కడ పడేయండి..నాకు ఎం చెయ్యాలో అర్థం కావట్లేదు. నాకు ఏమైనా సరిపోతే ఐ విల్ యాడ్ టు మై లిస్ట్. లాస్ట్ ఇయర్ నేను ఒక లిస్ట్ చేసుకున్న..ఒకటో రెండో తప్పిస్తే ఏవి వర్కౌట్ కాలేదు :-(. ఇప్పుడు నాకనిపిస్తుంది నేను మరి నాట్ ఫీసిబుల్ లిస్ట్ పెట్టుకున్ననేమో అని. ఆ లిస్ట్ లో కొన్ని..
     - ఏం.బి.ఏ కి ప్రిపేర్ అవ్వటం (అదే నండి పిల్లి పరీక్ష.. పుస్తకం తాకితే ఒట్టు  )
     - పొద్దున్నే లేయడం..రోజు వ్యయమ స్యాల కి వెళ్ళటం (ఒక రెండు నెలలు వెళ్ళ అంతే..  )
     - కంపెని మారిపోదాం(శ్యాలరి సరిపోవటం లేదు )
     - నావెల్స్ చదవటం( ఒక 20 % పాస్ ఇందులో )  
     - ఇంక కొన్ని సిల్లీ సిల్లీ వి ఉన్నాయ్ .
సో మీరు అందరికి కామన్ గ ఉండేటివి ఏమైనా ఉంటే ఇక్కడ కామెంట్ చెయ్యండి.
నూతన సంవత్సర శుభాకాంక్షలు మీ అందరికి ముందుగ :-)

Monday, December 27, 2010

ఎందుకిలా?

                 మీరు ఖాళీ సమయం లో ఎం చేస్తారు?నేనైతే కాసేపు సినిమా చూస్తా..కాసేపు ఫోన్ మాట్లడుత..ఇంకా..నెట్ లో బ్లాగులు చదువుతా. ఒక్కోసారి నాకనిపిస్తుంది ఇవన్ని నేనెందుకు చేస్తున్నాన అని, అసలు ఇవన్ని నా లైఫ్ కి ఎలా ఉపయోగ పడతాయి అని. నేను ఒంటరిగా ఉన్నప్పుడు నాకెందుకో చాల హ్యాపీగా అనిపిస్తుంది.. రూము లో ఎం.జె పాటలు ఫుల్ వాల్యూం లో పెట్టి బాగా ఎంజాయ్ చేస్తా. కాని ఇదంతా నేను ఎందుకు చేస్తున్నాను అనేదే నా ప్రశ్న. ఒక్కోసారి ఎవరిని కలవాలని అనిపించదు.. ఒక్కోసారి అందరితో కలసి ఉండాలి అని అనిపిస్తుంది.. స్నేహితులతో మాట్లాడుతున్నప్పుడు ఉన్నట్టుండి మౌనం పాటిస్తాను. వాళ్లకి అర్ధం కాదు నాకు అర్ధం కాదు వై ఐ యామ్ బిహేవింగ్ లైక్ దట్. ఒక అరగంట తర్వాత మళ్ళీ మామూలే.     
                 ఒకటి మాత్రం నేను చెప్పగలను ఎక్కువ సేపు ఖాళీగా ఉంటె ఇలాంటి ఆలోచనలే వస్తాయని . సినిమాల ప్రభావం కూడా కొంతవరకు నామీద ఉందనే చెప్పాలి.. అదేనండి ఈ మధ్యే వచ్చిన కొన్ని సినిమాలు.. కొంచెం అర్ధం కాక కొంచెం తల నొప్పిగా ఉన్నాయ్ నాకు. మీరేమంటారు.. ?

నేను-మా ఆఫీసు-బెంగుళూరు-2

       ఇది నేను-మా ఆఫీసు-బెంగుళూరు టపా కి తరువాయి:
       నేను ఇంతక ముందు చెప్పినట్టు మొదట్లో నాకు ఆఫీసు, బెంగళూరు కొత్తగా అనిపించేవి. ఒక మూడు నెలలు ఐతే గాని సెట్ అవ్వలేదు..ఇంక అప్పటినుంచి ప్రతి వారంతరం నేను మా స్నేహితులతో కలసి  బయంకరం గ బయట తిరిగే వాళ్ళం. అప్పుడే నాకు పరిచయం ఐంది షాపింగ్ మాల్స్. బ్రాండ్ ఫ్యాక్టరీ, సెంట్రల్, మెగా మార్ట్, టోటల్, రీబోక్, రిలయన్స్ మార్ట్.. ఇలా ప్రతి వీకెండ్ పిచ్చ పిచ్చగా తిరిగేవాళ్ళం.. ప్రతి నెల ఏదో ఒక డ్రెస్ కొనేవాడిని. ఒక సంవత్సరం లో నా రూం లో ఆల్మోస్ట్ అన్ని బ్రాండ్ బట్టలు వచేసాయ్. ఒక చిన్న అంగడి పెట్టుకోవచ్చు. ఇలా వచ్చిన వేతనం అంత బట్టలకే తగలెట్టే వాడిని..ఇప్పుడు కొంచెం పిచ్చి తగ్గిందనుకోండి. ఎందుకంటె..తిరిగే ఓపిక లేదు..కొనే మూడ్ లేదు..దానికి తోడు ఆఫీసు లో సావకొడుతున్నారు.
       ఇంక మా ఆఫీసు విషయానికి వస్తే..పొద్దున్నే సూర్యుడు బయటకి రాక ముందు వస్తా..తర్వాత ఆయన వెళ్ళిపోయాక చాల సేపటికి రూం కి వెళ్ళేవాడిని ఎంప్లయ్ ఐన మొదట్లో. ఇంక అంతే మన లైఫు ఐపోయింది అనుకున్న అప్పట్లో..తర్వాత కొంచెం తగ్గినట్లు అనిపించింది..ఎందుకంటే అలవాటై పోయింది. ఇప్పుడు ఓకే.. :-). కొన్నిసార్లు అనిపిస్తూవుంటుంది మనకిదంతా అవసరమా అని, తర్వాత అనిపిస్తుంది నెల తర్వాత శ్యాలరి కోసమే ఇదంతా అని :-). ఒక్కోసారి నాకు పి.హెచ్.డి కి వెళ్దాం అనిపిస్తుంది, ఒక్కోసారి ఎం.బి.ఏ. కి వెళ్ళాలి అనిపిస్తుంది. తర్వాత అనిపిస్తుంది అక్కడ శ్యాలరి ఇవ్వరు కదా అని.పైగా సాఫ్ట్వేర్ ఇంజనీర్ అంటే పెద్ద బిల్డప్ అప్పట్లో సో అల కంటిన్యూ చేస్తున్న..
      బెంగళూరు కొచ్చి నేను నేర్చుకున్నవి : విండో షాపింగ్, కొద్దిగా ఇంగ్లిషు, హిందీ, కన్నడ, సి, సి++, తెలుగు కొద్దిగా మరచి పోవటం, ఒక సెంటన్సు లో నాలుగు ఐదు బాషల పదాలు పెట్టడం(కూని చెయ్యడం అన్నమాట).

Wednesday, December 1, 2010

నెక్స్ట్ నేనే

            ఎవరు చెప్పారో ఏమో తెలియదు కానీ మా ఆఫీసులో బ్లాగులు బ్లాక్ చేసారు. చాల విధాల ట్రై చేశా కానీ కుదరలే. బహుశా నేను ఇంకో కొత్త లాంగ్వేజ్( తెలుగు ) నేర్చుకుంటున్నానని ఏమో మా వాళ్ళు బయపడ్డట్టున్నారు, నా రెసుమే కి బరువు పెరుగుతుందని. అసలు విషయం లోకి వస్తే మా అన్నయ్యకి పెళ్ళి కుదిరింది. అందుకే పనుల్లో కొద్దిగా బిజీగ కూడా ఉన్నాను. అందుకే లేట్ అయింది నా నెక్స్ట్ టపాకి.
            పెళ్ళంటే రెండు అక్షరాలు, మూడు ముళ్ళు, నాలుగు అక్షింతలు అని ఏదో సినిమాలో చెప్తే ఓస్ అంతేనా అనుకున్నాను. కానీ ఇప్పుడు మా అన్న పెళ్ళి పనులు చూస్తుంటే వామ్మో అనిపిస్తుంది. పెళ్ళి మండపం బుక్ చేయాలి, ఇంటిని డెకరేట్ చేయాలి (అదేనండి పెఇంట్లు కొట్టడాలు గట్ర ఉంటాయ్ కదా ), పెళ్ళి కార్డులు కొట్టించాలి, వాటిని పంచాలి, బట్టలు కొనుక్కోవాలి.. అబ్బో చాల పెద్ద లిస్టు. పోనీ ఒక్కోపని హ్యాపీ చేద్దాం అంటే కుదరదు.. మనదేమైన గవర్నమెంట్ జాబా ఎప్పుడు పడితే అప్పుడు ఆఫీసుకి డుమ్మా కొట్టి వెళ్ళిపోవడానికి. కాదే. సో, శని-ఆది వరాలే మనకు గతి. ప్రతి వీకెండు నేను బెంగలూరు నుంచి తిరుపతి వెళ్ళడం మల్లి ఆదివారం రాత్రి అక్కడ బస్సు ఎక్కడం సోమవారం ఆఫీసు లో నిద్రపోవటం :).
            నేను నువ్వంటూ వేరై ఉన్న.. నాకీవేల నీలో నేనున్నట్టుగ.. అనిపిస్తూ ఉందే వింతగా..నాకోసం నేనే వెతికేంతగా.. మద్య నేను సమయానికి చేస్తున్న పనికి సంబంధం లేకుంట నాలో నేనే పడుకుంటున్న పాట ఇది..ఇక్కడ కూడా వచ్చేసింది..సో లయిట్ తీసుకొండి.మనం విషయంలోకి వస్తే పెళ్లి అనే టాపిక్ పైన ఒక అబ్బాయ్ ఎలా ప్రవర్తిస్తాడు అనే అంశం పై నేనో ఆర్టికల్ రాయాలనుకుంటున్నాను(మా అన్న సహాయంతో లెండి)..ఎందుకంటే మధ్య మా అన్న అదోల ప్రవర్తిస్తున్నాడు..  ఫోన్ వదలట్లేదు.. ఇంక రాత్రిల్లో నిద్రపోవట్లేదు..ఏమైనా మాట్లాడుదాం అంటే ఎప్పుడు బిజీ ఆయె..బహుశా నేను కూడా ఫోన్ చేసి చెప్పాలేమో(అప్పుడు కూడా బిజీ వస్తుంది కదా, కష్టమే :) ).మొత్తానికి బానే ఎంజాయ్ చేస్తున్నాడు. (బ్రదరూ టపా నువ్వు చదవకు ప్లీజ్ :) ).
            పెళ్ళి పనులు చేస్తుండటం ఒక ఎత్తయితే, జనాల ఈగో ని మేనేజ్ చెయ్యటం ఇంకో ఎత్తు. పెళ్లి కార్డు నుంచి, బట్టలైతే ఏమి, బంగారమైతే ఏమి..అన్ని వాళ్లకి తగ్గట్టుగానే చెయ్యాలి.. పిచ్చి పీక్ స్టేట్స్ కి వెళ్తుంది వాళ్లకి అప్పుడు చేసిన/చెయ్యక పోయిన(పిచ్చి మాత్రం కామన్ అన్నమాట :) ). ఇవన్ని చూసాక నాకు రిజిస్టర్ మ్యారేజి మంచిది అనిపిస్తుంది అప్పుడప్పుడు. బాదలు ఉండవు..డబ్బులు కూడా మిగులుతాయ్ (ఏమంటారు?). ఏమైతేనేమి నా లైన్ క్లియర్ అవుతుంది. డట్ ఈజ్ వై సెడ్ నెక్స్ట్ నేనే :). ఇదే నా పర్సనల్ ఇన్విట్యేషన్ అనుకొని అందరు మా అన్న-వదినని ఆశీర్వదించండి. మళ్ళీ కలుద్దాం.    

Wednesday, November 3, 2010

పచ్చ వెల్లం - చూడ వెల్లం

                2006, ఆగస్టు 1st : నేను ఎం.టెక్ జాయిన్ ఐన రోజు. ఎక్కడ అనుకున్నారు, కాలికట్, కేరళ. నేను బి.టెక్ వరకు ఇంట్లో ఉండే చదువుకోవటం వళ్ళనో లేక బయటకి వెళ్ళి చదువుకోవటం ఇష్టం లేకనో నాకు తెలియదు కానీ, చాల బాధ పడ్డాను జాయిన్ అయ్యే టైం లో. మా అన్నని బాగా తిట్టుకున్నాను (చేర్పించింది ఆయనే కాబట్టి). మన ఊర్లో ఎండ, కాలికట్లో ఏమో భయంకరమైన వాన, అస్సలు పోలికుండేది కాదు. ఏదో కొత్త లోకంకి వెళ్ళి పడ్డట్టు అనిపించింది. హాస్టల్ కి  వెళ్ళి లగేజ్ పడేసి త్వరగా రెడి అయ్యి కాలేజి కి వెళ్ళాం మొదటిరోజు.
                సూపరుగ ఉంది కాలేజి. కేరళ కుట్టీలు అధిరారు. నా గుండె ఒకే రోజు అంత మందిని ఇష్టపడటం రోజు నుంచే మొదలైంది (పోయే కాలం మొదలైంది అని :) ). మా కాలేజీకి స్పెషలు ఉంది. పొద్దునంతా క్లాసు, మధ్యాహ్నం నుంచి ల్యాబు. సంవత్సరం అంతా అంతే. ఏముందిలే మధ్యాహ్నం త్వరగా జంపు ఐపోవచ్చు అనుకున్నాం మొదట్లో. మొదటిరోజు మధ్యాహ్నం ల్యాబు కెళ్తే తెలిసింది అసలు విషయం. అక్కడ ఐదు మందికి పది మందికి కలిపి ఒక బ్యాచ్చులా కాదు. ఒక్కొక్కడికి ఒక కిట్. అవుట్ పుట్ వస్తే కానీ వెళ్ళే దానికి లేదు. మొదటి ప్రోగ్రాం ఎల్..డి వెలిగించడం మైక్రో కంట్రోలర్ లో. ఎంత సేపు మాకు లైట్లు వెలుగుతున్నాయి కానీ, అక్కడ మాత్రం వెలగట్లేదు. మన బాషలో చుక్కలు కనపడ్డాయి అన్నమాట. ఇంక చేసేది ఏమి లేక మా ఆంధ్ర వాళ్ళంతా ఒకరి మొహాలు ఒకళ్ళం చూసుకుంటూ ఉండిపోయాం(అబ్బాలమే సుమీ). మా క్లాసు మొత్తం 18 మంది(అందులో ఐదు మంది ఎక్స్పిరిఎన్సుడు అంటే ఫ్రం ఇండస్ట్రీ అన్నమాట). అందులో ఐదు మంది ఫ్రం ఆంధ్ర (ఇందాక చెప్పినట్టు అందరం అబ్బాయిలమే :( ). నా పిచ్చి కాకపోతే మన ఊరు వదిలి అంత దూరం ఎందుకు వస్తారు అమ్మాయిలు. ఒకడు తమిలోడు. మిగతా వాళ్ళంతా మలయాళీలు. రెండో రోజు ల్యాబులో అందరు ఒక ఆయన దగ్గర గుంపు కట్టారు. ప్రోగ్రాం రాక మేము ఏడుస్తుంటే గ్రూప్ డిష్కషన్ ఏంట్రా అని వెళ్లి చూసాం. విషయమ ఏంటంటే అక్కడున్న ఆయనకి ఎల్..డి ప్రోగ్రాం వచ్చింది, అంతే మరో అరగంటలో మిగిలిన పదిహేడు మందికి వచ్చింది.(వండర్ కదా :D ) . ఇంక అంతే ప్రతి ప్రోగ్రాం ఆయనకొస్తే మాకు వచ్చినట్టే(ఎక్స్పిరిఎన్సా మజాకా అన్న సినిమా తీయాలనిపించింది నాకు అప్పుడు). మాకు అయన దేవుడు కంటే ఎక్కువగా కనిపించే వాడు అప్పట్లో. ఇప్పుడు ఖలేజ సినిమా అప్పుడు రిలీజు అయుంటే నేను ఆయనకు అల్లూరి సీతా రామ రాజు అని పేరు పెట్టుండే వాడినేమో :). 
               సీత కష్టాలు సీతవి - పీత కష్టాలు పీతవి అన్నట్టు కాకుండా కాలేజు కష్టాలు మాకే - కాలేజు బయట కష్టాలు కూడా మాకే అన్నట్టుండేది మాకు. బయట అన్నం మనం తినే ఉప్పుడు బియ్యం కన్న ఐదిన్తలు ఉంటుంది. మా ఇంట్లో ఉప్పుడు బియ్యంతో అన్నం చేస్తే నేను అస్సలు తినే వాడిని కాదు రోజు, ఇప్పుడో తప్పదు మరి. అప్పుడనిపించిది నాకు దేవుడున్నాడని. ఇంక సాంబార్, చెట్నీ, రసం చివరికి మజ్జిగ లో కూడా అప్పుడప్పుడు టెంకాయ నూనె ఉండేది. తిన్న కొత్తలో ఒక వారం రోజులు రెస్ట్ రూం ని వదల లేదు అంటే అర్ధం చేసుకోండి. అక్కడి ఫుడ్ కి అలవాటు పడటానికి ఒక నెల పట్టింది మాకు.మంచి నీళ్ళు ఇవ్వర బాబు అంటే చూడ వెల్లమా పచ్చ వెల్లమా అని అడిగేవాడు. పచ్చ బెల్లమేందిరా అనుకునే వాళ్ళం :) . తర్వాత అర్ధమైంది వాడు అడిగేది వేడి నీళ్ళా లేక చల్ల నీళ్ళా అని. అక్కడ ఏమి చెప్పక పోతే వేడి నీళ్ళలో అదేదో అవుషదమంట, అది వేసి తీసుకొచ్చి పెడతాడు. ఒక గ్లాసు లో మందు పోసుకొని వచ్చి పెట్టినట్టు ఉంటుంది కలరు. మొదట్లో బయపడ్దాం  ఏదైనా బార్ కి వచ్చామ అనుకొని. నీళ్ళని ఒక ఫోటో తీసి ఇంటికి పంపిస్తే చాలు నేను తాగుబోతు అయిపోయానని తప్పకుండ అనుకుంటారు మా ఇంట్లో(మా ఫ్రెండ్స్ ని మేము ఇలా బెదిరించే వాళ్ళం అప్పుడప్పుడు :) ). కానీ నీళ్ళు హేల్తుకి మంచిదని దాన్నే తాగే వాళ్ళం మేము. మొత్తానికి ఒక సంవత్సరం అంత అలాగే గడిపెసం. గుడ్ న్యూస్ ఏంటంటే నాన్ వెజ్ మాత్రం బాగానే చేస్తారు అక్కడ సో మాకు వారం లో రెండు మూడు రోజులు సండే అక్కడ :P.
               క్లాసులో మాకు మిడ్ పరీక్షలు ఉండేటివి ప్రతి సెమిస్టరుకి. మార్కులు చూడాలి నా సామిరంగా పదిన్నర, పదమూడు ముక్కాల్, పదనాలుగుoకాల్.. ఇలా వచ్చేవి ఇరవై ఐదుకి. 1/4 , 1/2 , 3/4 మార్కులు చూడటం అదే మొదటిసారి. హాఫ్ మార్క్ కి కూడా ఎంతో కష్టపడిన రోజులవి. 70% రావడానికి తల ప్రాణం అరికాళ్ళోకి వచ్చింది. మాకున్న ఒకే ఒక్క కాలక్షేపం మా కాలేజి పక్కన ఎన్.ఐ.టి. ఉండటం.. అందులో తెలుగోళ్ళు చదువుతుండటం మరియు మా కాలేజికి శనివారం కూడా హాలిడే అవ్వడం :). ఒక సంవత్సరం మొత్తం లో నేను ఇంటికి వెళ్ళింది రెండు లేక మూడు సార్లే :(. ఫస్ట్ టైం ఇల్లు విడిచి రావటం కదా చాల కష్టపడ్డాను నేనైతే. రూంలో ఉండటం మనకు కొత్త కదా, మా రూంమేట్ కి చాల ఓపిక, నన్ను భరించాడు. మొత్తానికి ఒక సంవత్సరం అక్కడ సినిమా కష్టాలు భరించి రెండో సంవత్సరం బెంగలూరుకి వచ్చా ప్రాజెక్ట్ ట్రైనీ గ :). ఇంక మళ్ళీ రాస్తాలే..సెలవ్