ఎవరు చెప్పారో ఏమో తెలియదు కానీ మా ఆఫీసులో బ్లాగులు బ్లాక్ చేసారు. చాల విధాల ట్రై చేశా కానీ కుదరలే. బహుశా నేను ఇంకో కొత్త లాంగ్వేజ్( తెలుగు ) నేర్చుకుంటున్నానని ఏమో మా వాళ్ళు బయపడ్డట్టున్నారు, నా రెసుమే కి బరువు పెరుగుతుందని. అసలు విషయం లోకి వస్తే మా అన్నయ్యకి పెళ్ళి కుదిరింది. అందుకే పనుల్లో కొద్దిగా బిజీగ కూడా ఉన్నాను. అందుకే లేట్ అయింది నా నెక్స్ట్ టపాకి.
పెళ్ళంటే రెండు అక్షరాలు, మూడు ముళ్ళు, నాలుగు అక్షింతలు అని ఏదో సినిమాలో చెప్తే ఓస్ అంతేనా అనుకున్నాను. కానీ ఇప్పుడు మా అన్న పెళ్ళి పనులు చూస్తుంటే వామ్మో అనిపిస్తుంది. పెళ్ళి మండపం బుక్ చేయాలి, ఇంటిని డెకరేట్ చేయాలి (అదేనండి పెఇంట్లు కొట్టడాలు గట్ర ఉంటాయ్ కదా ), పెళ్ళి కార్డులు కొట్టించాలి, వాటిని పంచాలి, బట్టలు కొనుక్కోవాలి.. అబ్బో చాల పెద్ద లిస్టు. పోనీ ఒక్కోపని హ్యాపీ గ చేద్దాం అంటే కుదరదు.. మనదేమైన గవర్నమెంట్ జాబా ఎప్పుడు పడితే అప్పుడు ఆఫీసుకి డుమ్మా కొట్టి వెళ్ళిపోవడానికి. కాదే. సో, శని-ఆది వరాలే మనకు గతి. ప్రతి వీకెండు నేను బెంగలూరు నుంచి తిరుపతి వెళ్ళడం మల్లి ఆదివారం రాత్రి అక్కడ బస్సు ఎక్కడం సోమవారం ఆఫీసు లో నిద్రపోవటం :).
నేను నువ్వంటూ వేరై ఉన్న.. నాకీవేల నీలో నేనున్నట్టుగ.. అనిపిస్తూ ఉందే వింతగా..నాకోసం నేనే వెతికేంతగా..ఈ మద్య నేను సమయానికి చేస్తున్న పనికి సంబంధం లేకుంట నాలో నేనే పడుకుంటున్న పాట ఇది..ఇక్కడ కూడా వచ్చేసింది..సో లయిట్ తీసుకొండి.మనం విషయంలోకి వస్తే పెళ్లి అనే టాపిక్ పైన ఒక అబ్బాయ్ ఎలా ప్రవర్తిస్తాడు అనే అంశం పై నేనో ఆర్టికల్ రాయాలనుకుంటున్నాను(మా అన్న సహాయంతో లెండి)..ఎందుకంటే ఈ మధ్య మా అన్న అదోల ప్రవర్తిస్తున్నాడు.. ఫోన్ వదలట్లేదు.. ఇంక రాత్రిల్లో నిద్రపోవట్లేదు..ఏమైనా మాట్లాడుదాం అంటే ఎప్పుడు బిజీ ఆయె..బహుశా నేను కూడా ఫోన్ చేసి చెప్పాలేమో(అప్పుడు కూడా బిజీ వస్తుంది కదా, కష్టమే :) ).మొత్తానికి బానే ఎంజాయ్ చేస్తున్నాడు. (బ్రదరూ ఈ టపా నువ్వు చదవకు ప్లీజ్ :) ).
పెళ్ళి పనులు చేస్తుండటం ఒక ఎత్తయితే, జనాల ఈగో ని మేనేజ్ చెయ్యటం ఇంకో ఎత్తు. పెళ్లి కార్డు నుంచి, బట్టలైతే ఏమి, బంగారమైతే ఏమి..అన్ని వాళ్లకి తగ్గట్టుగానే చెయ్యాలి.. పిచ్చి పీక్ స్టేట్స్ కి వెళ్తుంది వాళ్లకి అప్పుడు చేసిన/చెయ్యక పోయిన(పిచ్చి మాత్రం కామన్ అన్నమాట :) ). ఇవన్ని చూసాక నాకు రిజిస్టర్ మ్యారేజి మంచిది అనిపిస్తుంది అప్పుడప్పుడు. ఏ బాదలు ఉండవు..డబ్బులు కూడా మిగులుతాయ్ (ఏమంటారు?). ఏమైతేనేమి నా లైన్ క్లియర్ అవుతుంది. డట్ ఈజ్ వై ఐ సెడ్ నెక్స్ట్ నేనే :). ఇదే నా పర్సనల్ ఇన్విట్యేషన్ అనుకొని అందరు మా అన్న-వదినని ఆశీర్వదించండి. మళ్ళీ కలుద్దాం.