ఒకటవ తరగతి నుంచి పదవ తరగతి వరకు మనము ఏఏ సబ్జెక్టులు( తెలుగు పదం గుర్తుకు రావటం లేదు, మా రూంమేటుని అడుగుదాము అంటే చెవిలో హెడ్సెట్ పెట్టుకొని చానా సీరియస్గా గోలీమార్ సినెమా చూస్తున్నాడు ) చదివామో ఓ సారి గుర్తుచేసుకోడి. తెలుగు, హిందీ, ఇంగ్లీషు, లెక్కలు, సైన్సు మరియు సోషియల్. దాదాపుగ అందరు ఇవే అనుకుంటా లేకపోతే ఇంకొంత మంది సంస్కృతం చదివుంటారు తెలుగికి బదులు. తెలుగులో ఐతే పద్యాలు, సంధర్భాలు, ప్రతి పదార్ధాలు, గద్య భాగంలో అనేక విషయాలు మరియు నాన్డిటెయిల్ (తెలుగు పేరేంటి?) పుస్తకం. హిందీ, ఇంగ్లీషులలో కూడ అన్నే విభాగాలు. ఇక లెక్కలు(నా ప్రియం :) )కి వస్తే కూడికలు, తీసివేతలతో మొదలుపెట్టి ఎన్ని సూత్రాలో, ఎన్ని రకాల లెక్కలో, అంకెలతో ఓ ఆట ఆడుకున్నాం. కెవ్వసలు.. సైన్స్లో భౌతిక శాస్రం, రసాయనిక శాస్రం మరియు జీవ శాస్రం చాలా నేర్పింది మనకి. ఇకపోతే సోషియల్ భాగోళ శాస్రమని, చరిత్రని, పౌర శాస్రమని మరియు ఆర్ధిక శాస్రమని మన భూమి గురించి, చరిత్ర సృష్టించిన మహనీయుల గురించి, రాజకీయ విభజన మరియు పాలన గురించి, డబ్బు యొక్క విలువ గురించి నేర్పాయి.
పదవ తరగతి అయ్యాక కొంత మంది ఇంటర్మీడియట్లో ఇంకొంత మంది డిప్లోమా అని మరికొంత మంది ఐ.టి.ఐ అని విడిపోతారు. ఇంటర్లో కూడ మళ్ళీ లెక్కలు ఇష్టమైన వాళ్ళు ఎమ్.పి.సి అని, సైన్స్ ఇష్టమైన వాళ్ళు బై.పి.సి అని, ఇవేమి లేకుండ సోషియల్ ఇష్టమైన వాళ్ళు సి.ఈ.సి నో లేక హెచ్.ఈ.సి లోనో చేరుతారు. సైన్స్ గ్రూపులో చేరిన వాళ్ళు ఆర్ట్స్ని మరచిపోతారు అలాగే ఆర్ట్స్లో చేరిన వాళ్ళు సైన్స్ని మరుస్తారు అట్లీస్ట్ టెచ్ పోతుంది.
తర్వాత డిగ్రీ. దీన్ని మళ్ళా రెండుగా విడగొట్టి టెక్నికలు మరుయు నాన్-టెక్నికలు అని చదువుతాం. టెక్నికల్ అయితే ఇంజనీరింగ్ నాన్-టెక్నికల్ అయితే బి.ఎస్సీ (ఇంకా కొన్ని ఉన్నాయి, గుర్తు లేదు )అని చదువుతాం. పన్నెండు లేద పదమూడవ తరగతి వరకు సబ్జెక్టులను విడగొట్టి చదువుతాము, డిగ్రీలో ఏకంగా మనుషులలే విడగొట్టి టెక్నికలు, నాన్-టెక్నికలు అని చదివిపిస్తారు. అందుకే మనిషి చదువులో డిగ్రీకి చాలా ప్రాముఖ్యత ఉంది అని నా ఉద్దేశం. సరేలేండి విషయానికి వచ్చేద్దాం. ఇంక ఇంజనీరింగ్లో ఎన్నెన్ని విభాగాలున్నాయో మనందరికి తెలిసిందే. మాటకి కరెంట్ గురించి చదివేవారికి ఎలక్ట్రికల్, నిర్మాణాల గురించి చదివేవారికి సివిల్, పనిముట్ల గురించి చదివే వారికి మెకానికల్. తర్వాత వీటి నుండి ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్స్, బయో టెక్నాలజీ, షుగర్ టెక్నాలజీ, మైనింగ్, కెమికల్ మొదలగునవి వచ్చాయి. నాన్-టెక్నికల్ వాళ్ళు లెక్కలమీదో, సైన్స్ మీదో లేక అడ్మినిస్ట్రేషన్ లోనో వాళ్ళ ప్రతాపాలు చూపిస్తుంటారు ఇంకో పక్క. ఇక్కడ మనం చేసేది ఏంటంటే ఒక ఏరియా ఆఫ్ సబ్జెక్ట్స్ మీద పట్టు సాధించడం అన్నమాట. అంటే మిగతా వాటి మీద.. ఏమోలే.
ఇంకిది కాకుండ ఇంకా ఏదో పొడిచేయాలి అని కొంతమంది పీజీలు కూడ చేస్తుంటారు. దాంట్లో ఏంటంటే మనం డిగ్రీలో చదివిని దానిని ఇంకా స్క్యూజ్ చెయ్యడం అన్నమాట అంటే ఎన్నుకున్న ఏరియాని కూడ ముక్కలుగా చేసి అప్లికేషన్ వైజ్లో చదవటం. ఇంకా ఓపిక తీరిక కోరిక ఇంకేదో క :) ఉన్నవాళ్ళు పి.హెచ్.డి లని, రీసెర్స్లని వెళ్ళి ఒకే ఒక పేపర్ మీద పట్టు సాధిస్తారు. వాళ్ళని తర్వాత ఏమడిగినా ఆవు కథ లాగ దాన్నే చెప్తారు. ఆవు కథ తెలియని వాళ్ళు కింద చూడవచ్చు.
*************************************************
ఒకానొక ఊరిలో ఒకానొక బడిలో గిరీష్ అనే బాలుడు తరగతిలో చానా చురుగ్గా ఉండేవాడు. ఒక రోజు పాటశాలలో ఉపాధ్యాయురాలు గిరీష్ ని లేపి ఆవు గురించి చెప్పమంటే గిరీష్ ఇట్లనెను.. "ఆవు, ఆవుకి నాలుగు కాళ్ళుండును, రెండు కళ్ళుండును, రెండు చెవులు, ఒక ముక్కు, ఒక నోరు, దాని లోపల నాలుక ఉండును..ఇంకా ఏవేవో ఉండును. ఆవు పాలిచ్చును, దానితో పెరుగు, వెన్న, జున్ను తయారు చెయ్యొచ్చును. ఆవు గడ్డి మేయును. ఆవు పొలంలో పనులు చేయును..". అప్పుడు ఆ ఉపాధ్యాయురాలు గిరీష్ ని శభాష్ అని మెచ్చుకొని నా ప్రియ శిష్యుడు వీడే అని మెచ్చుకొని ఇల్లు గురించి చెప్పమనెను. అప్పుడు గిరీష్ ఇట్లు చెప్పెను. "ఇల్లు, ఇంట్లో అమ్మ, నాన్న మరియు నేను ఉంటాను. ఇంటి బయట ఆవులుండును. (హా..ఆవు..) ఆవు, ఆవుకి నాలుగు కాళ్ళుండును, రెండు కళ్ళుండును, రెండు చెవులు, ఒక ముక్కు, ఒక నోరు, దాని లోపల నాలుక ఉండును..ఇంకా ఏవేవో ఉండును. ఆవు పాలిచ్చును, దానితో పెరుగు, వెన్న, జున్ను తయారు చెయ్యొచ్చును. ఆవు గడ్డి మేయును. ఆవు పొలంలో పనులు చేయును.. ". ఈ సారి ఉపాధ్యాయురాలికి గిరీష్ మీద లైట్ గా జాలి కలిగి ఇలాగ కాదని చంద్ర మండలం గురించి చెప్పు అని అడగగా, గిరీష్ ఇలా సమాధానమిచ్చెను.."చంద్ర మండలం ఆకాశంలో ఉండును. చంద్ర మండలంలో చందమామ ఉండును. నాకంతగా తెలియదు చంద్ర మడలంలో ఒక వేళ ఆవులుంటే.. ఆవు, ఆవుకి నాలుగు కాళ్ళుండును, రెండు కళ్ళుండును, రెండు చెవులు, ఒక ముక్కు, ఒక నోరు, దాని లోపల నాలుక ఉండును..ఇంకా ఏవేవో ఉండును. ఆవు పాలిచ్చును, దానితో పెరుగు, వెన్న, జున్ను తయారు చెయ్యొచ్చును. ఆవు గడ్డి మేయును. ఆవు పొలంలో పనులు చేయును..". ఉపాధ్యాయురాలు గిరీష్ కి టి.సి ఇచ్చి పంపెను :).
*************************************************
ఇలా అందరూ పెద్ద పెద్ద చదువులు చదివి నాలెడ్జ్ని తగ్గించు కొంటున్నారు అన్నమాట. మరదే కదా జరిగేది ఎక్కడ పదవ తరగతి లో అన్నీ సబ్జెక్ట్స్, ఎక్కడ పి.హెచ్.డి పేపర్. విశాలమైన ప్రదేశంతో మొదలయ్యి, చివరికి ఒక చుక్కతో మిగిలిపోతున్నాం. ఇక ఈ ఐ.టి పుణ్యమా అని చదువొకటి, సంధ్య ఒకటి లాగా ఐపోతుంది జీవితం. నేను చాలా మందిని కలిశాను మా ఆఫీసులో, బయట. వాళ్ళు చదివింది సివిల్, మెకానికల్, కెమికల్, షుగర్ టెక్నాలజీలు. చేస్తుంది సి లేద .నెట్ కోడింగ్. యేమిరా అంటే డబ్బులు బాగ ఇచ్చేది ఐ.టి ఫీల్డ్లోనే కదన్నా అంటారు. మేము చదివిన వాటిళ్ళో ఇంతింత జీతాలు ఇవ్వరు అంటారు. నిజమే మరి. కాని.. జీవితంలో చదువొక భాగం అవ్వాలికాని జీవితమే చదువు కాకూడదు అనుకొని గమ్మనుండిపోతా..
(పై టపా ఎవరిని నొప్పిచాలని కాదు, ఎవరిని ఉద్దేశించింది కాదు, నా మనసులోని భావం మాత్రమే. ఆవు కథ సరదాకి మాత్రమే.. పెద్ద చదువులు చదివిన వారిని కించ పరచాలని మాత్రం కాదు అని అర్ధం చేసుకోగలరు)
9 comments:
అవును. చాలా బాగుంది.
నాకైతే ఇలా అనిపించేది. పదవతరగతి తరువాతే(మరీ ముందంటే మిగతా విషయాల్లో కనీసజ్ఞానం కొరవడుతుంది కాబట్టి) విద్యార్ధులకు తమకిష్టమైన సబ్జెక్ట్స్‌ని ఎన్నుకోమని కేవలం వాటిల్లోనే విద్యాబోదన జరిగేలా చూడాలి అని. అందువల్ల విధ్యార్ధికి ఆసక్తిలేని విభాగాలను చదవడానికి శ్రమించాల్సిన అవసరం వుండదు దానివల్ల శక్తియుక్తులను తమకిష్టమైన రంగాల్లో పెట్టి ఆయారంగాల్లో నిష్ణాతులవ్వడం సులభంగా వుంటుంది. మీరే యూనివర్సిటీనో తెలీదుకానీ. మెమైతే(B. Tech. C.S.I.T.) J.N.T.U వారి సిలబస్ ప్రకారం Induction Motors గురించి, Managerial Economics గురించీ, Evolues, Envelops (Mathematics) గురించి, Analog To Digital filters గురించి, అంతరించిపోయిన COBOL నీ చదువుతాం. వాటిని ఎక్కడా మేం వుపయోగించమని తెలుసు. కానీ మనవి ఖిచిడీ సిలబస్‌లయిపోయె.
ఇహ పదవతరగతి వరకైతే చెప్పఖ్ఖర్లేదు. పొటాషియంపర్మాంగనేటును వేడిచేసి ఆక్సిజన్‌ను సంగ్రహించడం లాంటి భీభత్స భయానక విషయాలన్నీ ఆ వయసులోనే బట్టిపట్టేస్తాం. అవన్నీ ఆ తరువాతి సంవత్సరం flush చేసి సరికొత్త చెత్త బుర్రకెక్కించుకుంటాం. ఇలా "తరువాత ఎందుకూ పనికిరాని" విషయాలన్నీ నేర్చుకోవడంలో మనం దాదాపు ఓ పదేళ్ళు వృధాచేస్తాం. ఇదంతా Technical digree వరకూ కొనసాగి ఎక్కడో M. Tech దాకానో, P.G. దాకానో పూర్తిగా మనకిష్టమైనవాటిమీద మాత్రమే దృష్టిసారించే అవకాశం మనకు రాకపోవడం మన దౌర్భాగ్యం.
కాబట్టి నే చెప్పొచ్చేదేమిటంటే అవన్నీ మనమీద రుద్దబడినవేగానీ మనకు పిచ్చపిచ్చగా నచ్చేసి చదివినవికావు. కాబట్టి వాటిమీద ప్రేమ అనవసరం. ఇలాంటి చెత్త చదువులు చదివినాక్కూడా మనకింకా చదవడమంటే విరక్తి కలగకపోతే ఇప్పుడు.... ఇప్పుడు మనకు నచ్చిన సబ్జెక్ట్స్ చదువుకోవచ్చు సమయమూ, డబ్బూ రెండూ వున్నాయికాబట్టి.
nijaalu matrame chepparu daanilo okarini noppinchedem ledu lendi anni nijaale kadaa.....Nice post..-:)
సబ్జెక్ట్ అంటే పాఠ్యాంశం అనుకుంటా(నాకు తెలియదు :D) నాన్‍డిటెయిల్ అంటే ఉప వాచకం (ఇది కరెక్ట్)
బాగా రాసావు. నిజాలు కూడా అప్పుడప్పుడు బాగుంటాయి అన్నమాట :p
nice Girish,annitikante Avu story bagundi,endukante maa school book lo avu kadha chala peddadi, edi chala simple ga undi kani essay question ki ee answer sari podu emo :)
@రాణి గారు,
ధన్యవాదములు టపా నచ్చినందుకు.
@చెప్పాలంటే,
జనాల ఇగోలను హర్ట్ చెయ్యడం ఎందుకని అలా రాస్తుంటాను..:) , ధన్యవాదములు.
@స్నేహ గారు,
హా..ఉప వాచకం, గుర్తొచ్చింది :).
పాఠ్యాంశం కూడ రైటే నేమో, ఎవరైన ఇన్టెలిజెంట్ పీపుల్స్ జవాబు చెప్తే బాగున్ను..:) , ధన్యవాదములు.
@ భాస్కర్,
నిజాలేనంటావ..:) త్యాంక్యూ.
@మనోజు,
ఈ జవాబు చెప్పావనుకో నాలాగ నీకు కూడ టి.సి వస్తుంది :) , త్యాంక్స్.
హ్మ్న్న్..మీరు చెప్పింది..అక్షరాల నిజమే కదండీ..!! :)
సాఫ్ట్వేర్ వల్ల ఇంకో చిక్కు కూడా ఉంది..దీన్ని వదిలేస్తే..ఎటు వెళ్ళాలో కూడా అర్థం కానీ పరిస్థితి..!!
@Indian Minerva,
బాగా చెప్పారు.. కనీస జ్ఞానం కోసమే పదవ తరగతి వరకు అన్నీ చదివినా అన్నేళ్ళు అనేది కొద్దిగా చింతించాల్సిన విషయమే. త్యాంక్స్ మిత్రమా :)
@కిరన్ గారు,
నిజమే..పొరపాటున సాఫ్ట్వేర్ మూసేశారు అనుకుంటే మన పరిస్థితి ఏంటి చెప్మా.. :), thanks.
Post a Comment