"ఇంతకి నీకేమొచ్చు..మ్యూజిక్ అంటే ఇంట్రస్ట్ సర్..హార్మోనియం, మ్రుదంగం వాయిస్తాను..ఇక్కడికి గాని తెచ్చావ?..లేదండి" ఈ లైన్ నా లైఫ్ లో మోస్ట్ ఇంపార్టెంట్ రోల్. నేను నవ్వని టైం అంటు లేదు ఈ లైన్ కి..త్రివిక్రం డైలాగో, వెంకటేష్ టైమింగో, ప్రకాష్ రాజ్ అడిగిన విధానమొ లేక ఇంకొకటో తెలియదు కాని సూపరు అసలిది..సినెమా కూడ అలానే ఉంటుంది.సరే విషయానికి వస్తే..నా దగ్గర ఓ సూపరు టాలెంటుందండోయ్..నాకు కూడ తెలియదు..పక్కన్నోల్లు చెప్పేవరకు..అదేనండి..నోటితోనె మ్యూజిక్ వేసెయ్యడం :-).
చిన్నప్పుడు కరెంట్ పోయినప్పుడు ఇంటి బయట ఉంటే అదేదొ ఆట..ఏంటది..ఆ..డియండల్ (అర్దం ఎవరినైన చిన్నపిల్లవాడిని అడగండి..నాకు తెలియదు :) ).అదేనండి..ఒకడు కల్లుమూసుకొని ఒకటి నుండి యాభైయ్యొ, వందో లెక్కెడతాడు..గుంపులో మిగతా వాల్లు వెల్లి దాక్కొంటారు.లెక్కెట్టిన వాడు వచ్చి దాక్కున్న వాల్లని కనిపెట్టాలి.అందరిని కనిపెట్టిన తర్వాత..మొదట ఎవరిని పట్టుకుంటాడో వాడు దొంగ అన్నమాట..మల్లి వాడు లెక్కపెడతాడు కల్లుమూసుకుని..మిగతావాల్లు దాక్కుంటారు..ద గేం రిపీట్స్ అన్నమాట :-)
మరి ఇంట్లో ఉంటే..ఏంచేస్తాం..డిఫాల్ట్ గేం..అంత్యాక్షరి..అప్పుడు మా ఇంట్లో అందరం సుప్రీం హీరో(మన మెగా స్టార్)ఫ్యాన్స్ లేండి..మ్యాగ్జిమం అందరం ఆయన సినెమా పాటలె అన్నమాట..కాదు కాదు ఉన్నమాటె:-)..నేనైతే మద్యలో మ్యూజిక్ తో సహా పాడేసే వాడిని పాటని మద్యలో ఆపడం ఇస్టం లేక..అదేంటో అప్పుడు పాటలు సూపరసలు..పాపం మావాల్లు..అరె ఇది పాడుతా తీయగ(అప్పటికి ఉందా ఈ సాఫ్ట్వేర్ అదే అదే ఈ ప్రోగ్రాం?) కాదుర మొత్తం పాడెసేదానికి..ఇక్కడ మ్యూజిక్ పోటీలు ఏం జరగట్లేదు రా బాబు..నాయన గంట నీ మంట ఆపుతావ ఇంక..ఇలా అన్నమాట నా మీద ఫీలింగ్..(ఏంటో ఈ ఫ్యాంన్స్ :-))..ఈ గేం లోనె నా మ్యూజిక్ ట్యాలెంట్(ట్యాలంటే అనుకుంటున్న..మీరు కూడ ఈ సారికి ఇలా కానిచ్చేండి :-)) బయటపడింది. ఏది ఏమైన చిన్నితనం కేక అసలు..మనం ఏమ్ పని చెయ్యనవసరం లేదు..స్కూల్ కి వెల్లామా.. వచ్చామ.. తిన్నామ.. ఎగిరామ.. తొంగున్నామ.. దట్సిట్. మరిప్పుడు..ఆఫీసు, ఇగోలు, టార్చర్లు, పగ, ఈర్ష్య..ఇ.టి.సి..మరియు మహేష్ బాబు అన్నట్టు(నాని సినెమా లో) పెద్దోల్లకి మనం పెద్దయ్యెకొద్ది మనమీద లవ్ తగ్గిపోద్ది :-(.
సరేలె నేను మరి పర్సనల్ విషయాలు మాట్లాడేస్తున్నాను..పాయుంట్ కి వచ్చేద్దాం. ఇక అప్పటినుంచి ఎప్పుడైన నేను పాటతో పాటు మ్యూజిక్ కూడ స్టార్ట్ చేసానంటె మావాల్లు అక్కడికి కట్ చేసి నెక్స్ట్ అనేవాల్లు..:-)మరి నేను ఊరుకుంటాన తిరిగి నా చాన్స్ వచ్చెవరకు సేమ్ సాంగ్ ని హమ్ చేసెవాడిని. అలా అలా ఎందుకో తెలియదు కాని మ్యూజిక్ అంటే ఒ పిచ్చి నాకు..ఆఫిసు లో, జర్ని టైం లో, పడుకునేటప్పుడు..ఇల అన్ని చోట్ల ఓ వ్యసనం లా మారింది. పాట అర్దం కాకపొయిన కూడ నేను మ్యూజిక్ బాగుంటె వింట. నేను పూర్తిగా నేర్చుకున్న మొదటి ఇంగ్లీష్ పాట బ్రిట్నీ ది హిట్ మి బేబి ఒన్ మోర్ టైం..అప్పుడదె దొరికింది మా ఎమ్.టెక్ రూం లో...ఇంక ఆ తర్వాత మైకెల్. మైకెల్ సాంగ్స్ లో రెండు టైప్స్ ఉంటాయ్..స్లో సాంగ్స్ అండ్ ఫాస్ట్ సాంగ్స్. స్లొ సాంగ్స్ మనకర్దం కావ్. అంటె ఫాస్ట్ బీట్ లు మనకి అర్దం ఐతాయని కాదు బీట్ బాగుంటుంది..ముక్యంగా బీట్ ఇట్, స్మూత్ క్రిమినల్ సాంగ్స్. ఇంక తెలుగు మెలోడిస్ నాకు బాగా నచ్చుత్తాయి.తమిళ్ ఐతే నాటు పాటలు సూపరసాలు.హిందీ పాటలు ఎందుకో అంతగా ఎక్కావ్..బాష అంతగా రాదు..అండ్ మరి స్లో గ ఉంటాయ్. రిసెంట్ గ మా ఆఫిసులో అందరికి హెడ్సెట్స్ ఇచ్చారు అవేవొ ట్రైనింగ్ క్లాసెస్ వినేందు..ఇంక చూస్కొ..రోజు ట్రైనింగే మనకి :-).ఇదండి నా మ్యూజిక్ ప్రయానం..సాగుతూనే ఉంటుంది నా ఈ టపా లాగ. దిస్ ఈజ్ ఇట్.
**** దిస్ టపా ఈజ్ డెడికేటెడ్ టు ఆల్ మూజిక్ లవర్స్ ****
(నా బ్లాగు.. నా టపా.. నా డెడికేషన్.. నా ఇష్టం..)