Friday, January 21, 2011

క్యాంపస్ కబుర్లు

            ఏం కనపడట్ లేదు ఈ మధ్య..అని అడిగా నేను మా ఫ్రెండ్ ఒకడిని ఈ మధ్య కలసినప్పుడు..దానికి మావాడు ఆన్ సైట్ వెల్లున్న అన్నాడు..ఏ ఊరు అని నేను అడిగా..ఒలైతా..అన్నాడు..ఏంటి అని అర్ధం కాక నేను మల్లి అడిగా..ఒలైతాన్ అన్నాడు మల్లి..తెలుగులో చెప్పయ్య అని అన్న..మా వాడు ఓ సీరియస్ లుక్ ఇచ్చి వెళ్ళిపోయాడు.
           అసలు ఈ మధ్య నాకు పని ఉన్న కూడా చెయ్యబుద్ది కావట్లేదు ఎందుకో..ఇంఫ్యాక్ట్ ఏం పనిలేదు.. ఇలా నా టెన్షన్ లో నేనుంటే నా లంచ్ ఫ్రెండ్ ఎందుకల టెన్షన్ గ ఉన్నావ్ అన్నాడు..ఏం చెప్పాలో తెలియక సాఫ్ట్వేర్ స్టైల్ లో వర్క్ టెన్షన్ అన్న..చ అన్నాడు వాడు..ఎందుకంటే వాడికి నాకు పని లేదని తెలుసు..ఇంతలో మూడోవాడు..ఓహో..వర్క్ టెన్షన..అంటే వెయిటింగ్ ఫర్ వర్క్ అన్నమాట..బ్రమ్హానందం చెప్పినదాని కంటే బాగా చెప్పడు కదా..వర్క్ టెన్షన్ అంటే వెయిటింగ్ ఫర్ వర్క్ అని.
         మా ఫ్రెండ్ ఒకడు వచ్చి మామ బ్లాగ్ చాల బాగా రాస్తున్నావ్ ర అని చెప్పాడు..నేను అడిగా ఏం నచ్చింది ర అని బయంకరమైన ఉత్సాహం తో :-).చదవటానికి ట్రై చేశా కాని నావల్ల కాలేదు ర అన్నాడు..ఏం పాపం అన్న..అదే మామ నాకు తెలుగు చదవటం అంతగా రాదు అని అసలు విషయం మెల్లగా చెప్పడు..నేను పైకి ఒక వెదవ నవ్వు నవ్వి లోపల తిట్టుకున్నా..కోపం ఆపుకోలేక ఇంక మీదట నీది ఏ రాష్రం అని ఎవడైనా అడిగితే A.P. అనే చెప్పు ఆంధ్ర అని మాత్రం చెప్పకు అన్న..అదే అరుణాచల్ ప్రదేశ్.
       కంపెని మారాలంటే చాల కష్టం గ ఉంది మామ అని అన్నాడు మా ఫ్రెండ్..అవును మామ ఇన్ని రోజులుగా పనిచేస్తున్నది కదా, బాగా అలవాటు ఐన కంపెని కదా..కొద్దిగా బాధ గానే ఉంటాది అని అన్న..దానికి మావాడు ఏమన్నాడో తెలుసా..బాధ నా బొక్క నా..చదవటానికి (ప్రిపరేషన్ కి ) కష్టం గ ఉంది మామ :-)
        ఈ మధ్య మా ఫ్రెండ్ ని ఇంటర్వ్యూ పానెల్ కి పంపారు..వాడు C#, పానెల్ ఏమో c /c ++. మొదట వాడు చెప్పాడు మేనేజర్ కి నాకు సి రాదు అని..కాని వాళ్ళ మేనేజర్ యు కెన్ అని అంటే అని చేయిఎత్తేసాడు. ఇంకేం చెయ్యాలి అని నన్ను కొన్ని సి ప్రశ్నలు (మనకంత లేదు.. గూగుల్ ఉంది గ ) అడిగి తెలుసుకొని వెళ్లి మల్లి నా దగ్గరికి వచ్చి ఆన్సర్స్ ఎవరిస్తారు అని నాకొక షాక్ ఇచ్చి అవి కూడా గూగుల్ నుంచి పట్టుకెళ్ళాడు. వెళ్లేసరికి వాళ్ళ మేనేజర్ వాడి సీట్ లో ఉన్నాడు..ఎక్కడికెల్లావ్ అని అడిగితే..మనోడు సి సమాధానాలు తెలుసుకోవడానికి వెళ్ళాను అని చెప్పాడు. సమాధానాలు అంటావేంటి..?అని అన్నాడు. ఆ అంటే అది మరి..* * *.
        ఇంకోడి బాధ చూడాలి..పొద్దూన్నె మేనేజర్ వచ్చి..యు ఆర్ డన్ ఎ గుడ్ జాబ్..మనకి ఇంక ఈ ప్రాజెక్ట్ లో పెద్దగ పనిలేదు..సో నిన్ను పక్క ప్రాజెక్ట్ కి మూవ్ చేస్తున్నాం.. యు హావ్ టు ప్రూవ్ అగైన్ అని అన్నాడంట..మనోడు అన్నాడు ఎన్ని సార్లు ప్రూవ్ చేసుకోవాలి అని(మనసులో లెండి జల్సా సినిమాలో పవన్ లాగా). నువ్వు పనిచెయ్యకపోతే ఆ ప్రాజెక్ట్ షేప్ మారిపోతుంది అని చెప్పాడంట..అలాటప్పుడు నన్నెదుకు పంపించడం..మల్లి పవన్.. :-).
       ఇవండీ మా ఆఫీసు కబుర్లు..మిగతావి మల్లీ రాస్తా.. 

4 comments:

Manoj said...

work tension bagundi girish,nice blog:)

Bhaskar said...

బాగుంది గిరీష్.కూడలి లో నీ బ్లాగు మొదటిసారి చూసా.ఇంక కుమ్ము

devendra said...

re mama iragadeesuthunnav........

గిరీష్ said...

@manoj : thanks manoju..
@bhaskar : koodalilo nenu nuvvu cheppina modatlone enroll ayya..thanks :)
@dev: thanks mama..