Monday, February 14, 2011

ప్రేమ

ప్రేమ..రెండక్షరాల మహా కావ్యం. దాదాపుగా అన్ని వయస్సుల వారికి పరిచయమైన పదం. మాట్లాడిన, తిట్టుకున్న, కొట్టుకున్న చివరికి మౌనం గా ఉన్న కూడ ప్రేమే అవుతుంది. ఖచ్చితమైన నిర్వచనం ఎవరు చెప్పలేరు మరియు ఒకరి నిర్వచనం మరొకరికి సరిపోకపోవచ్చు. ఒక ఓదార్పు, ఒక ఆదరన, ఒక సముదాయింపు, ఒక ఆప్యాయత, ఒక ఇష్టం.... ఇలా ఎన్నైన చెప్పచ్చు ప్రేమ ని పొందడానికి మరియు పంచడానికి అంతేకాని ఎవరు ఒక ప్రేమ అని చెప్పరు. మిగతా గ్రహాల గురించి నాకు తెలియదుగాని, భూగ్రహం మాత్రం ప్రేమకి అంకితం.
          చిన్నపిల్లల విషయంలో ప్రేమ అనేది ఒక భాద్యత, ఒక ఇష్టం. ఎందుకంటే పిల్లలని బాగ చూసుకొవాలి, పెంచాలి కాబట్టి. పెద్దోళ్ళ విషయంలో ప్రేమ అనేది ఒక గౌరవం. మరి వయసులో ఉన్న ఒక మగ ఆడ విషయంలో.. ఎన్నైన చెప్పొచ్చు. ఇష్టం, వ్యామోహం, అవసరం, తోడు, మనస్సు, కోరిక, గౌరవం ఇలా అన్నమాట. ఒక అబ్బాయికి ఒక అమ్మాయు మీద లేక ఒక అమ్మాయికి ఒక అబ్బాయి మీద ప్రేమ అన్నపదం నడుస్తుందంటే దానిని నిర్వచించడం చాల చాల కష్టం. ఎందుకంటే వాళ్ళకే ఖచ్చితమైన నిర్వచనం తెలియదు. ఇందాక చెప్పినట్టు కొంతమంది ఇష్టం అంటారు, మరికొంత మంది తను నా భాగస్వామి ఐతే నా జీవితం ఇంకా బాగుంటుంది అంటారు, ఇంకొంత మంది నువ్వు లేకుండా నేను ఉండలేను అంటారు.
          ఈరోజుల్లో ప్రేమ కి పాత రోజుల్లో ప్రేమ అన్నపదానికి మాత్రం బోల్డంత తేడ ఉంది. పాత రొజుల్లో సామాన్యంగా వయసులో ఉన్న ఒక అబ్బాయి ఒక అమ్మాయి ప్రేమించుకోరు(పెళ్ళి కాక ముందులెండి). ఎందుకంటే ఇంట్లో పెద్దలను బెదిరించకూడదని. అప్పట్లో పిల్లలకి తల్లిదండ్రుల మీద భయం తో కూడిన గౌరవం, గౌరవం ఉండేది. ప్రేమ అంటే కుటుంబం, స్నేహితులు, బంధువులు..అంతే. మరి కాలంలో, మనం కుటుంబం, స్నేహితులు, బంధువులతో పాటు ప్రియిరాలు/ప్రియుడు అన్న దానిని కూడ చేర్చేశాము ప్రీమలోఒకప్పుడు ఒక అబ్బాయికి/అమ్మాయికి ఎవరైన ప్రియురాలు/ప్రియుడు ఉందంటే వాల్లు తప్పు చేసినట్టు గా పరిగణించే వారు, ఇప్పుడు అలా లేకపొతేనే తప్పుగా చెబుతున్నారు చుట్టుపక్కల వాల్లు. దానికి తోడు ఇంకా చాల చెడ్డ పదాలున్నాయి వద్దులెండి. అంతగా మారింది కాలం. స్వచ్ఛమైన ప్రేమ అన్నపదానికి విలువ రోజురోజుకి తగ్గిపోతుంది, పొయింది. ఇందుకు ఒక కారణం సినెమాలు, రెండోది మన పాశ్చాత్య సంస్కృతి.
          స్వచ్ఛమైన ప్రేమ పొందాలంటే ఒక జీవిత కాలం సరిపోదు. ఎందుకంటే ఇంకొంత మిగిలి ఉంటుంది ఎప్పటికి. అదే నిజమైన ప్రేమ.HAPPY VALENTINE'S DAY




2 comments:

రాజ్యలక్ష్మి.N said...

"స్వచ్ఛమైన ప్రేమ పొందాలంటే ఒక జీవిత కాలం సరిపోదు. ఎందుకంటే ఇంకొంత మిగిలి ఉంటుంది ఎప్పటికి."
గిరీష్ గారు ప్రేమ గురించి చాలా బాగా చెప్పారండీ...

గిరీష్ said...

@రాజి గారు,
ధన్యవాదములు మీ వాఖ్యకి..