Friday, March 11, 2011

హైక్

హైకు హైకు అని ఎగిరాం, ఏమైంది.. ఏమి కాలేదు..no change.. సారన్నా మంచి హైక్ కొట్టాలి అని మనం అనుకుంటాం.. సంవత్సరం కూడా వీన్ని ఇక్కడే ఉండనివ్వాలి అని మన మేనేజరు అనుకుంటాడు..
పని చెప్పేటప్పుడు ఒక విధంగా మాట్లాడుతాడు..హైకిచ్చేటప్పుడు  ఒక విధంగా మాట్లాడుతాడు..
పని చేసేటప్పుడు నువ్వు కెవ్వు, కేక, కత్తి, కొడవలి, నాగలి అంటాడు..
హైకిచ్చేటప్పుడు  నువ్వు గడ్డి, కసువు, తౌడు, మట్టి అని అనడు, కాని మనకి అర్ధం అయిపోతాయి..
అప్పుడు అలా ఫీల్ అయ్యాం కాబట్టి ఇపుడు ఇలా ఫీల్ అవ్వమంటాడు..
ఎక్కువగా జ్ఞాన సరఫరా, నవ కల్పన చెయ్యాలి అంటాడు..కొత్త సినెమా పేర్లు కాదండోయ్ జ్ఞాన సరఫరా అంటే కె.టి (నాలెడ్జ్ ట్రాన్స్ఫర్), నవ కల్పన అంటే ఇన్నోవేషన్ అన్నమాట..
పోనీ వెళ్ళిపోదామా అంటే.. నువ్వు ప్రాజెక్ట్ లో ముఖ్యమైన వ్యక్తివి, కీ ప్లేయర్, క్రికెటర్, సచిన్ అంటారు..
అవన్నీ  నిజమేనేమో అనుకున్నామంటే ఇంక అంతే.. మళ్ళీ ఇంకో సంవత్సరం బలి.
కేటి నా అనుకుంటూ దాని గురించే ఆలోచిస్తున్న..
సరేలే ఎలాగైనా సెమినార్ ఇద్దాం అని అనుకొని, ప్రిపేర్ అయ్యి మరుసటి రోజు ఆఫీసుకి వెళ్ళా..ఆఫీసు ముందు 30X40 సైజు లో పెద్ద కట్అవుట్.. మందే.. "గిరీష్ చే గొప్ప కార్యక్రమం..తప్పక విచ్చేయండి అని". మనం కేటి ఇస్తున్నాం అని ఆఫీసంతా తెలిసిపోయింది అనుకుంటా, అందరు దాని గురించే మాట్లాడుకుంటున్నారు.. కాన్ఫెరెన్స్ రూం కి వెళ్ళగానే నా సహ ఉద్యోగి ఒకడు లేచి కత్తితో వేలుని కోసుకొని వీర తిలకం దిద్దాడు, జయహో అంటూ నినాదాలు చేస్తున్నాడు, ఆపరా బాబు అంటే వినిపించుకోడే, మొత్తానికి కేటి ఐపోయింది, నేను కూడ నిద్ర లేచాను.. :). అప్పుడు నాకర్ధమైంది నేను మా ఊర్లో గంగమ్మ జాతర ఉత్సవాలకి వెల్లడం తగ్గించాలని.. కట్అవుట్ ఏంది, వీర తిలకం ఏంది, నా పిచ్చ..
ఈ కేటిలు గీటిలు మనవల్ల కాదులే అని నా కాన్షన్ట్రేషన్ ఇన్నోవేషన్ మీద పెడదాము అనుకొని, మా స్నేహితులని అడిగా మామా ఏందిర ఈ గొడవ అని. మీ మేనేజరుకి తెలియంది నువ్వుతెలుసుకొని అయనకు చెప్పటమే ఇన్నోవేషన్ అని ఐన్‍స్టీన్ లెవల్లో చెప్పాడు. ఇదేదో బగుందే అని..ఐతే మా మేనేజరుకి సినేమా జ్ఞానం తక్కువ, సినెమాల గురించి చెప్పన్నా అంటే, వాడు అదో రకమైన బ్రంహానందం టైపు ముఖం పెట్టి పనుంది అని వెళ్ళిపోయాడు. ఏంటో ఎవరు నా ప్రతిభని గుర్తించరు అని నేనూ లైట్ తీసుకున్నా.. :)
రీసెంట్ నాకు హైక్ వచ్చిన తర్వాత కలిగిన కోపము, చికాకు, frustration.. మొదలగునవి, ఎవరిమీద చూపించాలో తెలియక ఇదిగో ఇలా రాసుకుంటున్న ఇంక చేసేది ఏమి లేక.. :)
         
(సరదాకి రాసినది మాత్రమే, ఎవరిని నొప్పించటానికి కాదు.)


 
*****************************************
దేవుడా, జపాన్ ప్రజలను కాపాడు..
దేవుడా, సునామి నుండి జపాన్ వాసులను కాపాడు..
దేవుడా, వాళ్ళకి నాకు ఏమి సంబంధం లేదు అయినా నా మొర ఆలకించి వాళ్ళని కాపాడు Pls
*****************************************

7 comments:

Anonymous said...

Babu girish .... flow bagundi.

keep it up....


Are you happy with hike or not

చెప్పాలంటే...... said...

mi haiku kaburlu baagunnayi.... nijamenandi manato pani aipoyaaka ante chestaaru...:)

గిరీష్ said...

@Anonymous,
thanks bro..
manishi asha jeevi kada, vallenticchina anthe :)

@Cheppalante,
thanks andi.. :)

Indian Minerva said...

సోదరా... మహమ్మదుగారి వద్దకు కొండరానప్పుడు మహమ్మదుగారేంచేశారు?

గిరీష్ said...

@Indian Minerva,
mithramaa..aa mahammadu garu evaro nakanta paricayam ledu..evaratanu?

Indian Minerva said...

ఆ మహమ్మదు ఎవరో కాదు ప్రవక్త మహమ్మదే. ఆయన సఫా పర్వతాన్ని రమ్మని పిలిచినప్పుడు అది రాలేదట. మరింకేం ఆయనే కదిలి కొండవద్దకు వెళ్ళారు. అటులనే మన వద్దకు హైకు రానప్పుడు హైకువద్దకే మనము వెళ్ళవలయును I mean హైకునిచ్చు కంపెనీల వద్దకు మనము వెళ్ళవలయును.

గిరీష్ said...

@Indian minerva,
:), well said..thanks, i will think..