Monday, March 14, 2011

ప్రేమ - పెళ్ళి (నా కథ)


ముందు మాట: టపా కేవలం సరదాగా అందరినీ నవ్వించాలి అని రాసాను. అక్కడక్కడా కొందరి/కొన్ని ప్రదేశాల పేర్లు ఉపయోగించినా అది సరదాకే గాని ఎవరిని నొప్పించాలని కాదు.ఇది అర్దం చేసుకొంటే ముందుకు వెళ్ళి టపా చదవండి లేకపోతే చదవకుండా వదిలెయ్యండి.అంతే కాని వద్దన్నా చదివి నన్ను తిట్టుకోవద్దు.
ఇక విషయానికి వస్తే:
నాకు మామూలుగా కొన్ని ప్రశ్నలు అంటే ఇష్టం ఉండదు. అవి ఎలాంటివి అంటే మీకు వాటికి సమాధానం తెలియక పోయినా చచ్చినట్టు సమాధానాలు చెప్పాలన్నమాట. ఉదా: 1) మా వాడికి ఫలానా చోట ఉద్యోగం వచ్చింది , నీకు ఇంకా ఎక్కడా రాలేదా?
2) మా వాడు వచ్చే నెల విదేశాలకు(ఆన్సైటు)వెళ్తున్నాడు , మరి నువ్వెప్పుడు వెళ్తున్నావు?
3) ఇంతకూ నీ పెళ్ళెప్పుడు?
అసలు ఆఖరి ప్రశ్న ఉందే, దాని అంత ప్రమాదకరమైన ప్రశ్న ఇంకొకటి ఉండదు అని నాకు చాలా గట్టి నమ్మకం.
అసలు పైన చెప్పిన ప్రశ్నలు నన్ను ఎవడైనా అడిగితే అగ్గి పిడుగులా, అగ్గి మీద గుగ్గిలం లా, పెనం మీద నీటి చుక్కలా గంతేసి, చిందేసి సుత్తి వీరభద్ర రావు లాగ తిట్టాలి ఇంకా వీలైతే సరదాగా అడిగిన వాళ్ళ చర్మం వలిచి చెప్పులు కుట్టించుకోవాలి అని అనిపిస్తుంది.
అసలు నేనే రాజునైతే ప్రశ్న అడిగిన వాడిని కొరత వేసి ,వంద కొరడా దెబ్బలు కొట్టించి,వెయ్యి తెలుగు ప్రేమ కధా చిత్రాలు చూడమని శిక్ష విధిస్తా.
కాని మధ్యన కొత్త సంవత్సర(ఉగాది అన్న మాట)నిర్ణయాలలో భాగంగా ఆవేశాన్ని అదుపులో ఉంచుకోవాలి అనుకోవడం వల్ల అసలు ఆఖరి ప్రశ్నకు నాకు అంత కోపం ఎందుకు వస్తుంది అని మూల కారణ పరిశోధన(Root cause analysis) చేసా.నా పరిశోధన వల్ల తెలిసింది ఏంటీ అంటే నా జీవితం లో జరిగిన వివిధ సంఘటనల వల్ల పెళ్ళి/ప్రేమా అంతే నాకు వైముఖ్యం వచ్చింది అని. హి..హి..హి. ఇప్పుడు పరిశోధనావివరాలు(అంటే నా అనుభవాలను) మీతో పంచుకోవాలి అని అనుకొంటున్నాను.  
       నా అనుభవాలు మీకు ఎందుకు అంటారా? ఉంది, ప్రశ్నకు నా దగ్గర సమాధానం ఉంది."మాములు మనుషులు వాళ్ళ వాళ్ళ అనుభవాల నుండి నేర్చుకొంటారు. కాని తెలివైన వాళ్ళు పక్క వాళ్ళ అనుభవాల నుండి కూడా పాఠాలు  నేర్చుకొంటారు". ఇప్పుడు మీరు వర్గమో మీరే ఆలోచించుకొని టపా చదవాలా వద్దా అని నిర్ణయించుకోండి.హి..హి..హి..హి..హి.
       ఇప్పుడు మీరు ఏమి నిర్ణయించుకొన్నారో...... అర్ధం అయ్యింది మీ తొందర చూస్తే అర్దం అయ్యింది. మరీ అంత ఖంగారు ఐతే ఎలాగండి.ఇప్పుడు అందరూ మీ మీ ఇళ్ళకు వెళ్ళి,చాప, దుప్పటి, మర చెంబులో నీళ్ళు పట్టుకొని వచ్చేయండి.అవి ఎందుకు అంటారా నేను చిన్నపుడు మా ఊరిలొ హరికధలకు, తెర మీద వేసే చలన చిత్రాలకు అలాగే వెళ్ళేవాడిని.
అందరూ వచ్చేసారా.ఏమిటీ కొంత మంది దగ్గర మూడూ లేవా, ఏమి ఫరవాలేదు. మా దగ్గర అవి దొరుకుతాయి. ఒక 1116/- ఇచ్చి వాటిని తీసుకొండి.. మరి జ్ఞానాన్నీ ఉచితంగా ఇచ్చి ఇవి కూడా ఉచితంగా కావాలి అంటే ఏలా? చెప్పండి.
సరే సరే...ఇప్పుడు మొదలుపెడదామా? అందరూ మనసులో మీకు నచ్చిన ప్రార్ధన చేసుకొండి.....మంచిది ఇప్పుడు అందరు బాగా గట్టిగా ప్రార్ధించారా.ఇప్పుడు మనం మన పాఠాలని మొదలుపెడడాం. ఎవరికైనా నా అనుభవం ఉపయోగపడలేదు లేదా అర్ధం కాలేదూ అంటే, వాళ్ళు సరిగ్గా ప్రార్ధించలేదు అన్న మాట :) కోస్తే(cut chestae).
ఒక వేసవి ఉదయం .ఎండా కొండా తెలియకుండా తోటల్లో, గుట్టల వెంబడి పరిగెత్తుతున్న పిల్లలు.అరుగుల మీద వడియాలను ఆరబెట్టడానికి సిద్ధం అవుతున్నా ఆడవారు. పొలం నుండి వస్తున్న, పొలానికి వెళ్తున్న మగవారు.కాలవలో బల్లకట్టు మీద పనులకు వెళ్ళడానికి సిద్ధంగా ఉన్న జనాలతో ఊరిలో ఒక పక్క సండడిగా ఉంది.వేరో పక్క కాలవ అవతల సందడి మా కరణం గారి కొడుకు పెళ్ళి. అదే పక్కన మేము అంటే మా పిల్ల రాక్షసులు అందరం ఒక పక్క చేరి కాలవను మా ఈతలతో ఆటలతో పావనం చేస్తున్నాం.
లోపు ఒక ఊరేగింపు మా దగ్గరకు వచ్చింది. అది మా కరణం గారి అబ్బాయి తెప్ప ఊరేగింపు. అబ్బాయి చెరువులో తెప్ప వదులుతూ ఉంటే తెప్పని , దానికి అంటించిన జెండాలని. అందులో దీపాన్ని అలా చూస్తూ ఉన్నాము. లోపు మా సత్తి గాడికి ఒక సందేహం వచ్చింది.అదేంటి అంటే, పెళ్ళంటే ఏంటి రా? అని, వాడి సందేహానికి సమాధానం చెప్పే అంత తెలివి మనకు లేకపొవడం తో నా సైకిల్ టైరు(ఈత కొట్టడానికి ఇది మంచి సాధనం లెండి) తో పాటు సందేహన్ని మోసుకొంటూ ఇంటికి చేరాను.
ఎసరు దించుతున్న మా అమ్మ దగ్గరకు చేరి మెల్లగా అమ్మా! పెళ్ళి అంటే ఏమిటి అని అడిగా.
అమ్మ సమాధానం: ఇప్పుడు తమరు చదువు మాని ఈతలు కొట్టి వచ్చారు అని తెలిసిందనుకో నాన్న చేస్తారు కదా అదే పెళ్ళి అని చెప్పింది.
నేను(పైకి) :! నాన్నగారా..హి.హి..హి ఇప్పుడు ఆయన వరకు ఎందుకమ్మా. నేను చదువుకోవాలి. నా పరీక్షలు దగ్గర పడ్డాయి కదా అని అక్కడ నుండి జారుకొన్నా.
నేను(మనసులో):ఇంత అర్ధమయ్యేలా చెబితే ఇంకేమి అడుగుతాము.ఐనా పెద్దోళ్ళున్నారే ఇలా మా ఉత్సాహన్ని నీరు కారిస్తే, ఒక ప్లేటో, ఒక జిడ్డు క్రిష్ణమూర్తి ఎలా తయారవుతారు అని ప్రశ్నిస్తూ...నాలోని అర్.నారాయణమూర్తి నిద్రలేవబోతూండగా, బయట మా నాన్న గారి సైకిల్ చప్పుడు వినిపించింది.
   వెంటనే మా నారాయణమూర్తికి ఒక నల్ల కంబళి ఇచ్చి బజ్జోపెట్టా..అదిగో అదే మరి నారాయణమూర్తి కి వేసవి కాలం కంబళి కప్పితే ఉక్క పొయ్యదా అని అడగకండి.మా నాన్న ముందు నిలబడ్డప్పుడు కారే చెమటతో పోలిస్తే ఉక్క ఒక లెఖ్హా(హి హి హి నాలోనూ ఒక త్రివిక్రం ఉన్నాడన్న మాట).
    ఇక పోతే నాన్నని చూసి hibernation (దీనికి తెలుగు పదం నాకు తెలియదు)లోకి వెళ్ళిన మా నారాయణమూర్తి. తర్వాత నాకు వార్షిక పరిక్షలు కావడంతో ఎక్కడికో వెళ్ళిపోయాడు.కాని ప్రశ్నకు మా అమ్మ నన్ను భయపెట్టిన విధానం తో నా చిన్ని హ్రుదయం గాయపడింది. ఆదిలోనే హంసపాదు అంటే ఎలా అని భయపడింది. విధంగా నాకు పెళ్ళి అంటే భయానికి తొలి బీజం పడింది. తరువాత మాకు వార్షిక పరీక్షలు అయ్యకా మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి ప్రయణం. ఐతే అసలు కధ ఇక్కడే మొదలైంది.అదేమిటి అనేది వచ్చే టపాలో చూడండి.
అనుభవం నుండి మీకు తెలిసిన నీతి ఏమిటి? పెళ్ళి గురించి పిల్లలు అడిగినప్పుడు వారిని కసురుకొంటే మీరు తర్వాత ఒక తత్వవేత్తను కోల్పోవచ్చు.
 

P.S: ఈ కథ నాది కాదు, మా స్నేహితుడిది, తనే రాస్తున్నాడు.

12 comments:

నాగప్రసాద్ said...

:-))
waiting for next part.

Padmarpita said...

Nice...What next:)

Prasanth said...

Next post plsssss

Prasanth said...

Very hilarious.Next post pls

Anonymous said...

hibernation = స్తుప్తచేతానావస్థ

interesting post BTW, wish to read from the philosopher ASAP :)

గిరీష్ said...

thanks to everybody..
@NoName,
ma vadiki telugulo ardham teliyakapovadaniki manchi karanam cheppav.., aa padam chusara ela undo..:), ny ways thanks for the meaning..

sneha said...

nice post

గిరీష్ said...

@Sneha garu,
Thank you..

Unknown said...

ఓహ్ మీ ఫ్రెండ్ రాసాడా .. :) అయితే అతనికి హాయ్ చెప్పండి

గిరీష్ said...

కావ్య గారు,
చెప్పేసా.. :)

రసజ్ఞ said...

మేమే వర్గమో తెల్చుకోవాలా? ఎంత తెలివండీ అసలు! చాప, దుప్పటీ, మరచేమ్బులో నీళ్ళు, విసనకర్ర కూడా తెచ్చేసుకున్నా! చాలా బాగా వ్రాస్తున్నారండీ మీ మిత్రుడు!

గిరీష్ said...

@రసజ్ఞ గారు,
ధన్యవాదాలండి మీ వాఖ్యకు.. :)