Thursday, March 24, 2011

చదువు సంధ్యలు : ద ట్రూత్

          ముందుటపా లో చెప్పిన్నట్టు "విశాలమైన ప్రదేశంతో మొదలయ్యి, చివరికి ఒక చుక్కతో మిగిలిపోతున్నాం" అన్న వాఖ్యానికి చాలా అర్ధాలున్నాయి. ఆ చుక్క పేరు ఇన్వెంషన్ లేద డిస్కవరి అవ్వాలి. రీసెర్చ్ అంటే అదే మరి. మనం చదువుకున్న సూత్రాలు, నియమాలు, ప్రతీదీ వారి పుణ్యమే మరి. నిజానికి మనం చదివిన దానికి అందరూ శాస్త్రవేత్తలు అయిపోవాలి. అందరూ రీసెర్చ్ సెంటర్లలో పనిచేస్తూ ఇప్పటికి కూడ ఏదో ఒక కొత్త విషయాన్ని కనిపెడుతూ ఉండాలి. కాని..ఏం జరుగుతుంది ఇక్కడ. వాస్తవానికి వస్తే పదవ తరగతి తప్పి పోయిన వాళ్ళు పూటకి ఇంత చొప్పున పనిచేస్తున్నారు. ఇంటర్, డిప్లొమా, ఐ.టి.ఐ తప్పిన వాళ్ళు మెకానిక్ పని చేసుకుంటూ, లేకపోతే చిన్న చిన్న ప్రైవేటు సంస్థళ్ళో అసిస్టెంట్‍లుగా పని చేస్తున్నారు. డిగ్రీ పోయిన వాళ్ళు వీళ్ళని బెదిరించి పనులు చేయించుకుంటున్నారు. ఇవన్నీ పాస్ అయిన వాళ్ళు ఏమి చేస్తున్నారో మనకందరికీ తెలిసిందే (మరి ఎక్కువ ఆలోచించకండి ఇంకేమి చేస్తారు సి లేక .నెట్ కోడింగ్ :) ). బాగా బలిసిన వాళ్ళకి పై విభజన వర్తించక పోవచ్చు. లైట్ తీసుకోండి. (అందరికీ వర్తించాలని కూడ లేదు)

          *********************************************************************
          నాకనుకో ఆ చుక్క సి అన్నమాట. ఎలాగంటే, నేను చదివింది బి.టెక్ ఎలక్ట్రికల్. మరి గమ్యం సి ఎలా అవుతుంది ఏ ట్రాన్స్‍ఫార్మరో, లేక ఏ ఇండక్షన్ మోటరో అవ్వాలి గాని అంటారా.. ఆగండాగండి, పిక్చ్యర్ అభీ భాఖీ హై దోస్త్ :). బ్లాగ్మిత్రుడు ఇండియన్ మినర్వా ఇండక్షన్ మోటర్ చదివినట్టు నేను కూడ మైక్రోప్రోసర్స్ చదవాల్సి వచ్చింది (వేరే వేరే కాలేజీలు లేండి). తను పాస్ నేను ఫెయిల్ :( (జె.ఎన్.టి.యు, 2006 పాస్డ్ అవుట్, మాడవ సంవత్సరం రెండవ సెమిస్టర్ మైక్రో ప్రోసెసర్స్ అండ్ ఇంటర్‍ఫేసింగ్ సెట్ బి పేపర్ రాసిన వాళ్ళు ఎవరైన ఉన్నారా?ఉంటే చేతులెత్తండి త్వరగా, అదిగో అక్కడెవరో ఎత్తట్లేదు మరి :) ). అది ట్విస్ట్ నాకు. నేను డిప్లమా విద్యార్ధిని. అక్కడ మూడు సంవత్సరాలు ఎలక్ట్రికల్ చదివి మళ్ళీ అంతే ఉత్సాహంతో బి.టెక్‍కి వచ్చా. కాని ఈ పేపర్ పోవడంతో అప్పటిదాక ఉన్న నా కళ చెదిరిపోయింది. చాలా చాలా భాధ పడ్డాను మొదటి సారి తప్పడం వళ్ళ. అప్పటి వరకు ఎమ్.టెక్ చేయాలనే కోరికే లేదు నాలో. కాని కోపం, కసి దా_మ్మా ఆ మైక్రోపోసెసర్ మీద :). అందుకే గేట్ రాసా. నా స్కోర్‍కి ఐ.ఐ.టి లో ఎలక్ట్రానిక్స్ సబ్జెక్ట్ (ఎమ్‍బెడ్డెడ్) రాదన్నారు. ఎన్.ఐ.టి లో పవర్ సిస్టమ్స్, పవర్ ఎలక్ట్రానిక్స్ వచ్చినా కూడ కావాలనే కేరళా లో ఓ రీసెర్చ్ కళాశాలలో ఎమ్.టెక్ ఇన్ ఎమ్‍బెడ్డెడ్ సిస్టమ్స్ జాయిన్ అయ్యా (ఆ విశేషాలు ఇక్కడ చూడొచ్చు). అందుకే సి అయ్యింది నా చుక్క. కన్వర్షన్ కి బానే కష్ట పడాల్సి వచ్చింది. డిప్లమాలో సి లేదు కదా ఫోట్రాన్ ఉనింది :). బి.టెక్‍లో నేను నేరుగా రెండవ సంవత్సరంలోకి (లేట్రల్ ఎంట్రీ) వచ్చి పడ్డాను. మొదటి సంవత్సరంలోనే సి అయిపోయింది అంట. అయిన పవర్ గ్రిడ్ లో /ఏ.ఈ/ జె.టి.వో (ఇవే నా గోల్స్ అప్పట్లో  :) ) గానో పనిచేసే వాడికి సి ఎందుకులే అని నేను తర్వాత నేర్చుకోలేదు. కాని లైఫ్ కదా అన్నీ మనం అనుకున్నట్టే జరిగితే ఇంకేముంది నేను దేవున్ని అనే సినేమా నేనే తీసే వాడిని :). త్రి టూ సెలవుళ్ళో బయట సి నేర్చుకున్నా :). అప్పుడు నేర్చుకున్నదే ఇప్పటి వరకు నాకు అన్నం పెడుతుంది (త్యాంక్స్ టు షబ్బీర్ సర్ - మై సి గురు).
          ********************************************************************
          సో అందరికీ అన్నీ అనుకూలించవు కాబట్టి మరియు చుట్టూ ఉన్న రిరాల ప్రభావం వళ్ళ, పరిస్థితుల వళ్ళ అందరూ శాస్త్రవేత్తలు కాలేరన్నమాట. డాక్టర్లు, లాయర్లు, సినీ హీరోలు, ఇంజనీర్లు ఇలా.. ఐ.టి లో ఉన్న కొంత మందికి .నెట్, మరి కొంత మందికి జావ, ఇంకొంత మందికి ఇంకేదో ఉంటుంది చుక్క. కాని ఏ చుక్క మన గమ్యం అయినా అందులో అన్నీ ఉంటేనే అందం ఆనందం. కావాలంటే గమనించి చూడండి లెక్కలు, సైన్స్ మరియు సొషియల్ ప్రతి చోట ఉపయోగ పడతాయి. మనం వాడే గణన యంత్రపు భాషళ్ళో కూడ. వృత్తి రీత్యానే కాదు మన రోజువారీ జీవితంలో కూడ.  That's how it is and it should be. అయిన చదువు అనేది ఒక టైం వరకే ముఖ్యంగా ఉంటుంది తరవాత ప్రాధాన్యతలు మారిపోతాయ్ కదా :).. మజా మాడి.

5 comments:

Anonymous said...

I learned .net from shabbir sir..is both are same..he is from hyd.

గిరీష్ said...

@Anonymous,
కాదండి, అతనిది మా ఊరే.

శోభ said...

మంచి పోస్టు.. బాగుందండీ..

గిరీష్ గారూ.. ఏమయ్యారు? ఇవ్వాళే ఓ కొత్త పోస్టు పెట్టాను.. అందరికంటే ముందుగా మీరే కామెంట్ పెడతారు అలాంటిది సాయంత్రం అవుతున్నా మీరు చూసినా జాడే తెలియటం లేదు... బాగున్నారు కదూ?

kiran said...

గిరీష్ గారు...నా చుక్క దగ్గర నేను ఉన్నాను అంటే నాకే ఆశ్చర్యం..
ఏదేదో చదివి..ఏదేదో చేసేస్తున్నా.. :D ...
B సెట్ గుర్తుపెట్టేస్కున్నర..కెవ్వ్....:)....:)...బాగుంది మీ పోస్ట్...:)

గిరీష్ said...

@శోభా రాజు గారు,
నేను బాగున్నాను అండీ. ధన్యవాదములు. మీ పోస్టు చూసాను, అంటే ఆఫీసులో కొద్దిగా బిజీగ ఉండి కామెంటు పెట్టలేదు. పూర్తిగా చదివి పెడదామని..
టపా నచ్చినందుకు నెనర్లు.

@కిరణ్ గారు,
ఆశ్యర్యం ఎందుకండీ మంచిదేగా :). ఎలా మరచి పోతాను ఆ పేపర్ ని నేను. మలుపు కదా నాకు అది. కొంపతీసి మీరు కూడా అదే పేపర్ రాసార ఏంటి?. టపా నచ్చినందుకు ధన్యవాదములు.