Friday, June 17, 2011

Iam Yet to Born!



ఈ సందర్భంగా నేను వ్రాసుకున్న ఓ విన్నపం..


దేవుడా..
నేను
రేపు పుట్టబోతున్న..
నన్ను
నువ్వు బాగ చూసుకోవాలి..
నా
ఆరోగ్యం బాగుండాలి.. నేను సంతోషంగ ఉండాలి..నా చుట్టూ ఉన్నవాళ్ళంతా బాగుండాలి..
నిష్కల్మషమైన
మనసుని నాకు ప్రసాదించు.. నా వల్ల ఎవ్వరూ బాధ పడకూడదు..
బాధకలగని
జీవితాన్ని నాకివ్వు..
కోపము
కలగని పరిస్థితులలో నన్ను పెంచు..
ప్రేమను పంచే మనుషుల మధ్య నన్ను ఉంచు..
స్వార్ధం
ఎరుగని మనసుని నాకివ్వు..
చివరగా
ఒకటి అసలు రెడ్చిప్పే లేని జీవితాన్ని నాకివ్వు..
 


 *****************************************
మనిషి పుట్టీనప్పటినుంచి ఏదో ఒక ఆశతోనే బ్రతుకుతాడు. ఎవడి పిచ్చి వాడిది అనే కాన్సెప్ట్ ఎలా వస్తుంది అంటారు? ఆశ వల్లనే అని నా అభిప్రాయం. అంతేగ కొన్ని ఆశలు సమయానికి తీరక, వాటిపైన మోజు ఏర్పడి అవి కోరికలు, ఆశయాలు తయారవుతాయ్..ఇప్పుడిదంతా ఎందుకంటార..చెప్తా..చెప్తా..వినండి ముందు అదే చదవండి.
చిన్నప్పటినుండి మనం ఎలా పెరుగుతాం, ఏది మంచి ఏది చెడు, ఏది చెయ్యాలి, ఏది చెయ్యకూడదు..ఇలాంటివి మన తల్లిదండ్రుల ద్వారానో లేక మన తాతయ్య/నానమ్మల ద్వారానో తెలుసుకుంటాం. కాస్త వయసొచ్చాక.. స్నేహితులు, బంధువులు, ఉపాధ్యాయులు.. ఇలా ఉంటుంది సర్కిల్. తర్వాత కొద్ది మంది మాత్రమే ఉంటారు, లైక్ సన్నిహిత మిత్రులు, తల్లిదండ్రులు. ఇంత మందితో మనం కలసి ఉన్నప్పటికి మనసేం చెబితే అదిమాత్రమే చేస్తూ ఉంటాం చాలా సార్లు. దీని వల్ల కొంతమంది బాధ పడుతుంటారు. కొంత మంది వీడి ఖర్మలే అని లైట్ తీసుకుంటారు. ఏది ఏమైనా ఒకసారి మనం చేసిన పనిని సరిదిద్దంలేం ఎందుకంటే మనమేమైన ఘటోఘ్కచులమా కృష్ణారెడ్డి సినెమాలో లాగ కాలాన్ని వెనక్కి తిప్పడానికి. ఒక వయసొచ్చాక..మనం సొంత తెలివితేటలు వాడటం ప్రారంభింస్తాం. మొదట్లో తప్పులు జరిగినా తర్వాత తర్వాత ఎలాగో ఒకలా నెగ్గుకొస్తాం..పడుతాం, లేస్తాం కాని చివరికి గెలుస్తాం. ఇదంతా చివరికి అనుభవం/ఇగోలాగ మారి ఇతరులకి మన ట్యాలెంట్ చూపించడం జరుగుతుంది. ఇంతచేసి చివరికి ఎవరైనా కోరుకునేది ఏంటి జీవితంలో.. ఎస్.. మనశ్శాంతి. రెండురకాలుగ వస్తుంది అని నా అభిమతం. మొదటిది నీ మనస్సులో  ఆనందం కలిగినప్పుడు. రెండోది పక్కోడి మొహంలో చిరునవ్వు చూసినప్పుడు మేబి మూడోది మంచి పని చేసినప్పుడు.. 

మొదటిసారి మహాసముద్రం చూసినప్పుడు, చిన్నారి నవ్వు చూసినప్పుడు, పండుముసలి మొహంలో ఆనందం చూసినప్పుడు, పరీక్షలో పాసైనప్పుడు కలిగే ఆనందం, మొదటిసారి ప్రియురాలు/భార్య ఐ లవ్ యూ అన్నప్పుడు, మనవల్ల ఇంకొకరికి ఆనందం/మంచి కలిగినప్పుడు.. ఇవన్నీ జీవితంలో మనకు ఎదురయ్యే ఆనంద క్షణాలు. అలాగే బాధ కలిగించే విషయాలు కూడా ఉంటాయి. అందుకే భాస్కర్ అన్నాడేమో ఆరెంజ్‌లో 'ఓ సముద్రం చూడాలి బాస్' అని.
(ఇన్ని సంవత్సరాలలో నాకర్ధమైంది ఇంతే.. చూద్దాం ఇంకెలా ఉంటుందో..)






















  


( Happy Birthday to Me..  :-) )







 

14 comments:

బులుసు సుబ్రహ్మణ్యం said...

మంచిని కోరుకుంటే మంచే జరుగుతుంది.

ముందస్తు గా పుట్టిన రోజు శుభాకాంక్షలు.

రాజ్ కుమార్ said...

యెస్.. మీరు చెప్పినదానితో నూరు శాతం అంగీకరిస్తున్నా..

"ఒక సముద్రం చూడాలి బాస్.."... BINGO...

మీకు హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు.. ఆనందంగా సంతోషంగా...రేపొక్కరోజే కాదు ప్రతీరోజు గడపాలని కోరుకుంటున్నా.. ;)

రత్న మాల said...

ముందుగా పుట్టినరోజు శుభాకాంక్షలు. చాలా బాగా రాసారు . ప్రతి మనిషికి ఆశలు , కోరికలు సహజం అవి సాదించడానికి కొందరు మంచి మార్గంలో పయనిస్తే కొందరు చెడు మార్గంలో పనిస్తున్నారు.తృప్తి కి మించినది వేరేమి లేదు కదా.

గిరీష్ said...

@బులుసు గారికి,
మాష్టారు కోట్ అదిరింది.. ముందుగ తెలిపినందులు ధన్యుడను. ధన్యవాదములు.

@వేణూరాం గారికి,
బోలెడు థ్యాంక్యూలు.. :)

@రత్న మాల గారికి,
చాలా థ్యాంక్స్ అండి నాటపా నచ్చినందుకు.. :), శుభాకాంక్షలు తెలిపినందుకు ధన్యవాదములు.

ఆ.సౌమ్య said...

బావుంది మీ అవలోకనం...కొంచం ఆలశ్యంగా చెబుతున్నా

హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు గిరీష్!

గిరీష్ said...

@సౌమ్య గారికి,
చాల థ్యాంక్స్ అండి మీ వాఖ్యకి, మీ శుభాకాంక్షలకి కూడ :)..ఇదే మీ మొదటి చూపనుకుంట నా బ్లాగుపై..స్వాగతం. :)

kiran said...

మీరు ఇంత చిన్న వయసులో చాల గమనించేసారు...
ఇక సముద్రం చూస్తే...???ఎన్ని భావాలూ బయటకి వస్తాయో..!!
Belated happy birthday girish గారు ..:)

గిరీష్ said...

Thanks Kiran.. :)

Bujji-Smiley said...

జన్మ దిన శుభాకాంక్షలు గిరీష్ గారు ..... మీ లైఫ్ అంత ఇలాగె కలర్ఫుల్ గ ఉండాలని ఆ దేవుణ్ణి ప్రార్ధిస్తున్నాను :)

గిరీష్ said...

ధన్యవాదాలు బుజ్జి గారు.. :)

నేస్తం said...

కొంచెం లేట్ గా శుభాకాంక్షలు ఏమనుకోకండేం ఇప్పుడే చూసాను మీ బ్లాగ్ ..కాని మీరు రాసుకున్న విన్నపం నాకు చాలా నచ్చింది

గిరీష్ said...

నేస్తం గారు,
నా బ్లాగుకి స్వాగతం.. :),
Thank you for your wishes.

శిశిర said...

పుట్టినరోజు శుభాకాంక్షలు. (ఐదు రోజులు ఆలస్యంగా)..
తిట్టుకోకండే.. టపా చాలా బగుంది.

గిరీష్ said...

@శిశిర గారు,
Thank you very much for your wishes..
wishes చెప్పారుగ ఇంక తిట్టుకోనులెండి.. :), ధన్యవాదములు టపా నచ్చినందుకు.