చాల రోజుల తర్వాత నేను చూసిన ఓ పాత సినేమానే ఈ దక్ష యజ్ఞం. సినెమా రివ్యూ కాదు కాని, నాకేమి అర్దమైందో రాస్తున్నాను, అంతే. ఈ రోజుల్లో ఒక చిన్న పాయింట్ ని తీసుకొని సినెమా చేసెస్తారు కాని పాత రోజుల్లో కథే సినెమా, తర్వాతే నటీనటులు. నేను ధైర్యంగా, సాహసంగా, నమ్మకంగా (కాన్ఫిడెంట్ కి తెలుగు అర్ధం :) ) చెప్పగలను ఇప్పటి మన సినీ హీరోలు చెయ్యలేరు పాత వాల్లు చేసినట్టు. ఒక వేళ సాహసించినా అంతలా చెయ్యలేరు. వామ్మో ఒక్కొక్కరు తిన్నారు నటనని, నా అర్ధం నటించలా జీవించేసారు.
కథ లోకి వెల్తే, దక్ష ప్రజాపతి కి ఎవరికైన శాపం ఇవ్వగల శక్తి ఉంటుంది. వరం ఇవ్వగల శక్తి కూడ ఉందేమో మరి సినెమాలో ఎక్కడ ఎవ్వరికి ఆయన వరం ఇచ్చినట్టు నాకు కనపడలే :). అంత కోపిష్టి, అహంకారి అన్నమాట. నారదుని సలహా మేరకు సన్యాసం పుచ్చుకోవాలని తన దగ్గరకు వచ్చిన తన ఇద్దరు కుమారులను నేర్చుకున్న విద్యలన్ని పొవాలని శపిస్తాడు. కన్న కుమారులను ఎందుకు శపిస్తావు అని అడిగిన నారదుని కాలు ఒక చోట నిలవకుండ త్రిలోక సంచారం చేస్తూ తిరగమని శపిస్తాడు. దక్షుని కూతురు సతీ దేవి (దాక్షాయని) మహాశివుని భక్తురాలు. తన తండ్రి దగ్గరనుంచే అంత శివ భక్తి వస్తుంది అమెకు. ఇక పోతే దక్షుడు కి ఈ ముగ్గురి సంతానంతో పాటు మరో ఇరవై ఏడు మంది దత్తపుత్రికలు కూడ ఉంటారు. వారి పేర్లు అశ్విని, రోహిని..ఇంక నాకు తెలియదు (27 నక్షత్రాలు). రోహిని కోరిక మేరకు చంద్రునికి ఇచ్చి పెళ్ళి చేస్తాడు దక్షుడు. దత్త పుత్రికలని అందరిని ఒక్కరికే ఇవ్వాలని బ్రహ్మ ఆజ్ఞ. కనుక మిగతా ఇరవై ఆరు మందిని కుడా చంద్రుడే వివాహమాడుతాడు (లక్కీ ఫెలో :-) )
దత్తపుత్రికలకు పెళ్ళిళ్ళు చేస్తావు కాని మాకు చెయ్యవా అని తన తండ్రిని అడగలేక మన భార్యలని మనమే వెతుకుందాం అని దేశాటనకి వెల్లిపోతారు దక్షుని కుమారులు. రోహిని అందగత్తె, కనుక చంద్రుడు మనల్ని పట్టించుకోవట్లేదని తల్లిదండ్రుల దగ్గర వచ్చి మొర పెట్టుకుంటారు మిగిలిన ఇరవై ఆరు మంది పుత్రికలు. నచ్చచెప్పి వస్తాను అని చెప్పి కుష్టు వ్యాధితో నశించి కృశించాలని అళ్ళుడైన చంద్రుడిని శపిస్తాడు దక్షుడు. ఏం చెయ్యాలో తెలియక చద్రుడు మహాశివునికి వెల్లి మొరపెట్టుకుంటాడు. దక్షుని శాపానికి నాదగ్గర విమోచన లేదు గాని, నీవు ఈ కైలాసములో ఉన్నంతవరకు నీకేం కాదు అంటే చంద్రుడు అక్కడే ఉంటాడు. ఇది విన్న దక్షుడు కోపంతో కైలాసానికి వచ్చి శివునితో గొడవపడుతుంటే బ్రహ్మ వచ్చి చంద్రుడిని రెండుగా చేసి (రెండు చంద్రుల్లమాట) ఒకరిని శివుని పాదాల చెంత, మరొకరి శాపం అనుభవిస్తూ ఉండమంటాడు. నీవు ఉండవలసినది పాదాల దగ్గర కాదు అని నెలవంక రూపంలో తలమేద పెట్టుకుంటాడు చంద్రుడిని శివుడు.
సతీదేవి పెళ్ళి నిశ్చయిస్తాడు దక్షుడు, నేను మహా శివుని తప్ప మరెవ్వరిని వవాహమాడను అంటుందామె. దానికి దక్షుడు ససేమిరా అని స్వయంవరం ప్రకటించి, శివుని ప్రతిమని ద్వారపాలకుడుగా నియమిస్తాడు. సతీదేవి వెల్లి విగ్రహానికి పూలమాల వెయ్యడంతో, ఆమె శివుని అర్ధాంగి అవుతుంది. తనమాట వినని సతీదేవి ని శివునితో సహా వెల్లగొడతాడు దక్షుడు. మామ అళ్ళుళ్ళైన దక్షుడు-శివుడు ని కలపాలని సత్ర యాగానికి పూనుకుంటారు మహాఋషులందరూ. నాకు ఎటువంటి అవమానం జరగదని మాట ఇస్తేనే నేను యాగానికి వస్తానని దక్షుడు ఋషులకు చెప్తాడు. సరే నని ఋషులందరూ అనటంతో యాగానికి వెల్లిన దక్షునికి త్రిమూర్తుల స్థానంలో కూర్చొని ఉన్న శివుని చూచి మామ వచ్చినప్పుడు అళ్ళుడు నమస్కరించలేదని వాదనకు దిగుతాడు. అతను లేచి వెల్లిపొతే గాని నేను యాగాన్ని కొనసాగివ్వను అంటాడు. దానికి ఎవరు ఒప్పుకోకపోవటంతో సరే ఇతే నేనే నిర్వీశ్వర యాగాన్ని తలపెడతానని అక్కడనుంచి వెల్లిపోతాడు దక్షుడు. యాగానికి రానివారిని శపిస్తానంటూ భయపెడతాడు. ఇంకోపక్క దక్షుని కుమారులు ఇద్దరి కన్యెలని వలచి పెళ్ళికి సిద్దపడతారు. ఈ సన్నివేశాలు హాస్యాన్ని పండిస్తాయు.
నాన్న మనసుని ఎలాగైనా గెలవాలని పిలుపు రాకున్నను, సతీదేవి శివుని ఆజ్ఞతో వెల్తుంది యాగానికి. ఇది తెలుసుకున్న దక్షుడు సతీదేవితో మాట్లాడరాదని చెప్తాడు. పుట్టినింట తనతో ఎవరు మాట్లాడటం లేదని సతీదేవి అగ్నికి ఆహుతి అవుతుంది. ఇది విన్న శివడు ప్రళయతాండవం చేసి వీరభద్రుడ్ని పంపి దక్షుడిని హతమారుస్తాడు అతని తలని వేరుచేసి. తన భర్తని బతికించకపొతే పతివ్రతనైన నేను లోకాలన్నిటిని సర్వనాశనం చెస్తానంటుంది దక్షుని సతి (ఆమె పేరు..ఏంటబ్బా..వైరాగి అనుకుంటా, ఖచ్చితంగా తెలియదు). అప్పుడు త్రిమూర్తులు ప్రత్యక్షమయ్యి, మహాశివుడు దక్షునికి మేక తలని పెట్టి ప్రాణం పోస్తాడు. తర్వాత దక్షుని సతి కోరికతో అతనిని మామూలు మానవునిగా మారుస్తాడు శివుడు. తన తప్పు తెలుసుకున్న దక్షుడు తన అజ్ఞానానికి, అహంకారానికి మన్నిచమని కోరి, త్రిమూర్తూలు సహాయంతో యాగాన్ని పూర్తిచేస్తాడు. దక్షుడు చేపట్టిన ఆ యాగస్థలానికి దాక్షారామం అని ప్రసిద్ధి.
ఇకపోతే సినేమాలో నాకు కళ్ళుతిరిగిన విషయమేమిటంటే, ఇంద్రుడు రంభ, ఊర్వశి లలో ఎవరు గొప్ప నాట్యగత్యనో తెలుసుకోవాలని, వారిరువురికి పోటీ పెడతాడు. అందులో రంభనో ఊర్వశో నాకు తెలియదు గాని, ఒకావిడ వీణ నృత్యం చేస్తుంది. చిరంజీవిని మించిపోయింది అంటే నమ్మండి. బహుశా లారెన్స్, ఈ సినెమా చూసే చిరంజీవి చేత ఆ స్టెప్ వేయించాడేమో ఇంద్రలో :-). ఇదండీ నా టపా, మరీ బోర్ కొట్టింది అనుకోకండి, ఇందులో నా స్వార్ధం కూడ ఉంది. ఇలాంటి నీతి కథలని గుర్తుంచుకోవడం మంచిది. అది కూడ మన దేవుల్ల కథ కదా, మరచిపోతానేమోనని ఇక్కడ రాసుకున్నా :-). శివుని పాత్ర చేసింది ఎన్. టి. ఆర్, దక్షుని పాత్రని ఇరగదీసింది ఎస్. వి. రంగారావు. సతీదేవి గా దేవిక, దక్షుని భార్యగా కన్నాంబ, దర్శకత్వం: కె. వి. నాగభూషణం. కన్నాంబ సమర్పించు వరలక్ష్మీ పిక్చర్సు.
9 comments:
very good review. meeru cheppindi correct. ippati pillalaki krishna, ganesh, hanuman (cartoons punyama ani) thappa evaru teliyadam ledu. ee generation ki avasaram.
@Geetha_yasasvi gaaru,
thank you somuch for ur comment.
కథ సంక్షిప్తంగా ఓపిగ్గా చాలా బాగా రాశారు. కాన్ఫిడెంట్ కి తెలుగు పదం వెదకడం కూడా నచ్చింది :) మీ బ్లాగు ఇంతకు ముందు చూశానో లేదో గుర్తు లేదు కాని ఇప్పుడూ మీ వ్యాఖ్యద్వారా ఇలా వచ్చాను. చాలా సంతోషం. ఈ సినిమాలో నంది మొదలైన ప్రమథ గణాలు శివుని స్తోత్రం చేసే దృశ్యం చాలా గొప్పగా ఉంటుంది. మీరు ఇప్పటిదాకా చూసి ఉండకపోతే మిగిలిన పాత పౌరాణిక సినిమాలు కూడా చూడండి.
@కొత్త పాళీ గారికి,
ధన్యవాధాలు మీ వాక్య కి.
ఈ మధ్యన టపాల్లో ఇంగ్లిష్ పదాలు ఎక్కువ వాడుతున్నానని మన ఆకాశరామన్న స్నేహితులు చెబితే ఇదిగో ఇలా తెలుగు పదాలు వెతకడం మొదలెట్టా.. :)
కొత్త సినిమాలు ఏమి లేకపోతే పాట సినిమాలు చూడటం అలవాటు అండి నాకు. మీరు చెప్పారు కాబట్టి అప్పుడప్పుడు చూస్తాను తప్పకుండ.
మరి 18 ఖండాలూ శక్తి కేంద్రాలు అవో? actually నాకా information కావాలి. అలాగే మీరు smilies ఎలా వాడుతున్నారో కూడా తెలియజేస్తారా?
@Minerva,
ఆ సినెమాలో ఇవేం లేవు మరి.. :). తెలియదు మిత్రమా..
for smilies:
http://mltan100.blogspot.com/2008/02/use-emoticon-on-blogger-blog.html
Thank you. I am able to display the emoticons.
@Indian Minerva
18 శక్తి పీఠాల వివరాలు కావాలంటే మీరు ఒక అద్భుత, మహత్తర, అపూర్వ చలన చిత్ర రాజం చూడాల్సి ఉంటుంది. ఆ చలన చిత్రపు నామధేయం "శక్తి". మీకు సినిమాలో చూపించిన అష్టాదశ శక్తి పీఠాల గురించి అర్ధమయినా కాకపోయినా సినిమా చూసినందుకు మాత్రం మోక్షం గ్యారెంటీ. (దేవుడు కళ్ళ ముందు కనిపిస్తాడు. నాది గ్యారెంటీ)
@Minerva,
WC
@Shankar,
శంకర్ గారు మినర్వా గారు ఆ మహత్తర సినేమా చూసి ఇంకా ఏదో తెలుసుకోవాలనే ఇలా వచ్చారు లేండి.. :)
Post a Comment