Tuesday, February 22, 2011

నేను తప్పిపోయాను

         అవి నేను మూడవ తరగతి చదువుతున్న రోజులు. పక్క ఊర్లో మా పిన్ని పెళ్ళి ఉంటే, మా ఇంట్లో అందరం వెళ్ళాం. ఇప్పుడంటే పెద్దున్నే పెళ్ళికి ఎక్కడవెళ్తాం, సాయంకాలం రిసెప్షన్ కి వెళ్ళే రోజులు కాని అప్పట్లో రెండు మూడు రోజుల ముందే.. :). పిల్ల రాక్షసులు అందరం ఒకచోట కలిశామంటే సందడే సందడి. మా నాన్న కి ఇద్దరు చెల్లెల్లు, అంటే నాకు ఇద్దరు అత్తలన్నమాట. మేము ముగ్గరం, మా మేనత్తల పిల్లలు ఏడు మంది. మొత్తం పది మంది ఎక్కడైన కలిశామో రచ్చ రచ్చ ఇంక. భలే ఉండేదిలే అప్పట్లో. అప్పట్లో మా అందరికి సైకిల్ అంటే మోజు. అందరం ఒక సైకిలు అద్దెకు తీసుకునేది, రౌండ్ రాబిన్ పద్దతిలో రోజంతా తొక్కేది, అన్నం కూడ లేకుండ. సాయంకాలం అందరం ఇంటికి రాగానే రెస్పెక్ట్డ్ తల్లుల దగ్గరనుంచి తిట్లు అన్నాలు కూడ తినకుండ ఎక్కడ తిరుగుతున్నారు అందరు అని :). సైకిల్ తొక్కేది ఒకడైతే మిగతావాల్లు దానెనకాల పరిగెత్తడం మన వంతు ఎప్పుడొస్తుందా అని.
          మా పిన్ని పెళ్ళప్పుడు కలసిన మేమందరం పొద్దున్నే బయటకొచ్చేశాం సర్వసాధారణం గా సైకిల్ అద్దెకుతీసుకొని. మొత్తం ఐదుమంది అబ్బాయిలం, నేనె అందరిలో కన్న చిన్నవాడిని గ్రూప్ లో. అందరం ఒకరి తర్వాత ఒకల్లం తొక్కుతున్నాం. ఇంతలో నాకు మా ఇల్లు కనపడింది. బాగ దాహం వేస్తుంది వెళ్ళి నీల్లు తాగొద్దాం అని దారి మార్చా ఇంటి వైపుకి. ఇంటి దగ్గరకొచ్చాక అర్ధమైంది అది మా ఇల్లు కాదని, తర్వాతర్వాత అర్ధమైంది అసలు నేను మన ఊర్లో లేనుకదా అని. సరేలే మనది కాని ఇంటికి వెల్లలేం కదా అని మా వాళ్ళతో కలసిపోవడానికి వెనక్కి తిరిగా. ఏరి, ఉంటేగా. ఎవరి బిజీలో వాల్లు సైకిల్ వెనక ఉండునుంటారు. అప్పడర్ధమైంది నాకు నేను తప్పిపోయానని. ఒక సారి ఊహించుకోడి, అయ్యబాబోయ్. మెల్లగా ఏడుపు మొదలైంది నాకు. తర్వాత భయం. అటుగా వెళ్తున్న ఒక ఆయనకి నా బాధంతా చెప్పా, ఇలా మేమందరం సైకిలేసుకొని వచ్చాం, నేను తప్పిపోయాను అని. ఆయన మీ ఇల్లెక్కడ బాబు అని అడిగాడు. నేను మా అత్తా వాల్లింటికి వచ్చానండి, వాళిల్లు నాకు తెలియదు అన్నా. వాళ్ళింటి పక్కనే మా పిన్ని వాళ్ళ ఇల్లు, రోజు మా పిన్ని పెల్లి, దానికి ఎదురుగా పచ్చ ఇల్లు అని ఏవేవో గుర్తులు చెప్పా నా శక్తి సామర్ధ్యాలకి. అయనకి ఏమి చెయ్యాలో తెలియక పాపం వెళ్ళిపోయాడు. ఇలా అందరిని అడుగుతూ కనీసం రెండు గంటలు తిరిగా.
          ఈలోగ మా సైకిల్ బ్యాచ్కి అర్ధమైంది నేను కనపడట్లేదని. వెతికారు వెతికారు నాకోసం. కనపడకపోయే సరికి ఇంటికెళ్ళి చెప్పేసారు. ఇంక చూస్కో నా సామిరంగా అందరు గూగుల్ సెర్చ్ మొదలెట్టారు. మా అమ్మకి కాళ్ళు చేతులు ఆడటం లేదు. మా మామలు, బాబాయిలు, పిలకాయలు అందరు మేము సైకిల్ తొక్కిన చోటుకొచ్చి వెతికారంట. మనం అక్కడెక్కడుంటాం, ఎందుకుంటాం :).
          చివరికి నాకు ఒక పోలీసు బాబాయి కనపడితే వెళ్ళి జరిగింది చెప్పా. ఆయన చివరికి ఒక ప్రశ్న వేశాడు, "నిన్ను మీఊరి బస్ స్టాండ్ లో వదిలేస్తే మీ ఇంటికి వెళ్తావా?". నేను వెళ్తాను అని చెప్పా. అయన ఎంత దూరం, ఎలా వెళ్ళగలవు అని అడిగాడు. మా ఇంటి పక్కనే బస్ స్టాండ్ అని చెప్పాను. మొత్తానికి ఆయన నా ధైర్యానికి (కాన్ఫిడెంట్కి) మెచ్చి వ్యాన్ ఎక్కించి మాఊరు పంపాడు.
          నా అతి తెలివితేటలు తెలిసింది మా తాతయ్య(డాడి ఆఫ్ డాడి :) )కి మాత్రమే. ఎందుకంటే నేను చాల క్లోజ్ అయనికి. అయన ఇంటికి వచ్చి చూస్తే నేను హ్యాప్పి(హ్యాప్పి బర్తడే లో హ్యాప్పి)గా ఇంట్లో అలసిపోయి పడుకొని ఉన్నా(మా నాన్న ముందుగానే ఇంటికొచ్చి ఒక ఫుల్ ఏసి నిద్రపోతున్నాడు లెండి). వెంటనే ఫోన్ చేసి అందరికి చెప్పేసరికి అందరు ఊపిరి పీల్చుకున్నారు. ఇంటికి వచ్చారు. కొందరు తిట్టికున్నారు అనుకోండి అది మనకు సంబంధం లేని విషయం :).
          అప్పుడప్పుడు నాకు అనిపిస్తూ ఉంటుంది అప్పుడు కనక ఆ పోలీసు ఆయన లేకపోతే, ఒక వేల నేను ఇంటికి రాక పోయుంటే మన పరిస్థితి ఏంటా అని.? మొన్నటి వరకు కూడ నన్ను..నేను పలాన అయన మనవడిని(నాకు నా పరిచయం ఇలానే ఇష్టం, ఎందుకో ఇంకో టపాలో చెప్తా)అంటే, మనవడు, ఓహ్.. శోభ(మా పిన్ని) పెళ్ళి లో తప్పిపోయావ్ నువ్వట్రా.. పెళ్ళి పూట ఎన్ని కష్టాలు పెట్టావుర నాయన అంటారు. అంత ప్రఖ్యాత గాంచినాం మనం సంఘటన తో. ఏంటో ఫ్యాన్స్ ()

13 comments:

మనసు పలికే said...

హహ్హహ్హా.. బాగుందండీ టపా..
తప్పుగా అనుకోనంటే, చిన్న సలహా (ఉచితంగా ఇవ్వగలిగేది అదొక్కటే కదా;)) మీ తెలుగులో కొన్ని తప్పులు దొర్లుతున్నాయి. అవి సరిచేసుకున్నారంటే ఇంకా మంచి టపాలు రాయగలరు:))

గిరీష్ said...

@అపర్ణ గారు,
ధన్యవాధములు మీ వాఖ్య కి. నిజమే నేను తెలుగు బాగా మరచిపోయాను. ఈ బ్లాగు లోకం వల్లనైనా తెలుగు బాగా నేర్చుకోవాలని ఆశ. ఐ విల్ ట్రై మై లెవెల్ బెస్ట్.

zzz said...

Babu
Koncham back ground marcha vachu kada
Chadavadam koncham Kastam ga undi

గిరీష్ said...

@zzz,
mithramaa..ok na :)

Unknown said...

anna super appotlo keka aithae...

Anonymous said...

a

Manoj said...

హలో గిరీష్,
వెరీ గుడ్ నీకు మంచి ప్యూచర్ ఉండి,బ్లాగింగ్ ఇరగడీస్తున్నావు
నిజమె ఆ రోజుల్లొ సైకిల్ అంటె చాలా పిచ్చి మరి :)

గిరీష్ said...

@chinni,
em keko, aa polisu ayana evaro ela kanipettadam, ny clue?

గిరీష్ said...

@manoju,
nuvvu kooda modalettava telugulo rayatam..kool amma..inkem blog start maadi..
yes, appatlo cycle ante ado craze..

Hemanth Kumar R said...

:-o
Kevvu keka

గిరీష్ said...

@Hemanth,
thanks..

Unknown said...

Ley @Hemanth (aragonda) Nuvvatra ... ikkademi chestunnavu ... Maa classmate ye lendi ...

Hmmm vishayaniki vaste ... Manamu tappipoyam ... riyyu riyyu riyyu ... Avi manam padava padava chadive rojulu ... vesavi selavullo bevars ga ooru meeda padi tirugutunte ... maa nannaru ... pilichi Nellore velli ra ra annaru ... teera akkadaki velte maa peddamma vallu vere oorellaru ... iha nenu chesedi leka Penukonda vellanu ... maa "chinna" peddamma vallintiki :) .... adi yevariki cheppakunda ... iha choosukondi naa sami ranga ... nenu nellore ki raaledu ani teliya gane andaru urukulu parugulu .... Nenu chesina "tappu" pani entante ... maa naannariki Uttram rayatam ... danto kata sukhantam ... he he he ...

గిరీష్ said...

@రెహమాన్,
హేమంత్ మా కొలీగ్ ఇక్కడ.. :)
ఉత్తరం వ్రాయకుండ ఉంటే మీ పరిస్థితి ఏంటి చెప్మా.. :), ఇప్పటికీ వెతుకుతూ ఉండేవాళ్ళ అతడులో రాజీవ్‌ని వాళ్ళింట్లో వాళ్ళు వెతికినట్టు.. :)