ప్రేమ - పెళ్ళి (నా కథ) కి తరువాయి
ఇంతకు ముందు చెప్పినట్టు మా అమ్మమ్మ ఇంటికి ప్రయాణం. అవి మంచి పాత రోజులు(గుడ్ ఓల్డ్ డేయ్స్ అన్నమాట). అంటే ఒంటి మీద లాగూలు తప్ప, జెట్ లాగులు తెలియని రోజులు. అబ్బాయిలకు గూటిబిళ్ళ, అమ్మాయిలకు తొక్కుడు బిళ్ళ ఆటలు గా చలామణీ అవుతున్న రోజులు.అసలు అమ్మమ్మ ఇంటికి వెళితే వేసవి కాలం కూడా ఒక పండగలాగ ఉంటుంది. అక్కడ రాజు, మంత్రి, భటుడు అన్నీ మనమే ఎందుకంటే మా బంధువుల్లో అంతా నాకన్నా బాగా చిన్న లేదా నాకన్నా బాగా పెద్దవాళ్ళు (అబ్బాయిలు) తప్ప నా ఈడు వాళ్ళు లేరు అందుకనే అప్పుడప్పుడు తోట వెంబడి పక్క వీధి పిల్లలతో బలాదూరు తిరుగుతానన్న మాట.
అలాంటి ఒక వేసవి మధ్యాన్నం, అమ్మమ్మ వేసిన మజ్జిగన్నం లో ఆవకాయ నంజుకొని తిని నాతో పాటు మా పటాలం అంతా పడుకొని ఉండగా. ముందే వేసుకొన్న పధకం ప్రకారం మెల్లగా నిద్రలేచి, పెరటి తలుపు తీసి, ఆడుకొని వచ్చాకా అలమారా మీద మామిడిపళ్ళ రుచి ఊహించుకొంటూ గోడ దూకడానికి సిద్ధం అయ్యా, ఏంటి గోడ దూకడానికి ఎందుకు అంటారా? మరి, వేసవి కాలం అది కూడా మిట్టమధ్యాన్నం ఆడుకోవటానికి వెళతానంటే, మీకు ఒక వెండితొడుగు వేసిన గూటిబిళ్ళ,నవరత్నాలతో చేసిన గోళీలు ఇచ్చి చందనం బొట్టు పెట్టి, విజయుడవై తిరిగిరా అని అశీర్వదిస్తారా? ఏమో మరి మా ఇంట్లో ఐతే ఇంత ఎండలో బయటకు వెళితే, కాకి లాగ మాడిపోతావ్ అనో లేక పోతే తెగులు కోడి లాగ తలవాలుస్తావు అనో ముద్దుగా చెప్తారు. ఇంకా వినలేదు అనుకోండి రెండు మూడుసార్లు బుగ్గ వాచేలాగా ముద్దు పెట్టుకొంటారన్నమాట.
ఇంతకూ పెరటి గోడ దగ్గర నిలబడి దూకుదాం అనుకొంటుండగా, వసారా తలుపులు టక..టకమన్నాయి. ఐనా ఎవరైతే నాకేంటి అని రాజశేఖర్ లాగా గోడ దూకుదాం అనుకొన్నా. కానీ ఈ లోపే ఉన్న కొంచం బుర్ర చురుగ్గా పనిచేసింది. ఇప్పుడు మనం కనపడకపోతే అందరికి, ఆడుకుంటానికి వెళ్ళామని తెలిసిపోతుంది. తరువాత మనకు వీపు పగులుతుంది.కాబట్టి ఈ రోజుకి ఆటలను త్యాగం చేద్దాం అని అనుకొని ఇంటిలోకి అడుగుపెట్టా.
లోపలంతా గోలగోలగా ఉంది ఎండలో నుండి లోపలకు రావటం వల్ల మనుషులు అందరూ నల్లగా కనిపిస్తున్నారు ఎవరా అని చూస్తే ఒక మూలన ఒక ఆకారం చీకిన తాటిటెంకలాంటి జుట్టుతో మామిడి టెంక చీకుతూ ఉంది వెంటనే, వచ్చింది మా రాజు (ఏ దేశానికి అని అడగకండి అదిగో మళ్ళా ప్రశ్నా)మామయ్య అని, ఆ తాటిటెంక మొహం మా మరదలు గజలక్ష్మి (శ్రీ లక్ష్మి) అని అర్ధం అయ్యింది.
ఇప్పుడు మీ అందరికీ మా మరదలు గురించి ఒక చిన్న ఉపోధ్ఘాతం. మా మరదలు పేరు శ్రీలక్ష్మి, మనం ఇచ్చిన బిరుదులు గజలక్ష్మి అలియాస్ బొండం, ఎందుకంటే ఈవిడ ఉదయాన్నే 5 గంటలకు లేచి, పళ్ళు తోముకొని (ఆ..ఆ..ఆ అప్పుడే అదర్శ వనిత అని బిరుదులు ఇవ్వొద్దు..చెప్పేది పూర్తిగా వినండి), తన నోరు అనబడే యంత్రాన్ని ఆడించదం మొదలుపెడుతుంది. ఆ యంత్రం సాయంత్రం ఆవిడ పడుకొనే వరకూ ఆడుతూనే ఉంటుంది. ఎందుకంటే మా ఇంట్లో అటు మూడు తరాలలోనూ ఇటు మూడు తరాలలోనూ ఆడ పిల్లలు లేరంట, కాబట్టి ఈవిడకు అందరూ వంతులు వేసుకొని మరీ తిండి సంతర్పణ చేస్తుంటారు. ఆ తిండి ఏంటే బాబు అని ఎప్పుడైనా అడిగాం అనుకోండి. మా మరదలి కన్నా ముందు మా అమ్మమ్మ సమాధానం ఇస్తుంది, ఏంటంటే ఈ వయసులో తింటే బలం నువ్వు తినవు అందుకే నక్క లాగ ఉన్నావు అంటుంది. ఇంకేమంటాం నక్క, కుక్క అన్న బిరుదుల కన్నా మా మరదలు దుక్క లాగ ఐతే చూడటం మెరుగు కదా అని ఊరుకొన్నా.
ఐనా మనకు బుర్రలు తిన్నంత బాగా తిండి తినడం రాదు కదా. ఏతంతారు ఏటి?
ఉపోధ్ఘాతం సమాప్తం.
ఆ విధంగా రాజు మామయ్యా వాళ్ళతో కబుర్లు చెప్పుకొని , మా మామయ్యను బాగ తొక్కి తన్ని ఆడుకొన్నాకా, అమ్మమ్మ పెట్టిన పనసపొట్టు కూర వేసుకొని తిని, వెన్నెల్లో దోమలు విసురుకొంటూ, రేపు ఆటలకి ఎలా గోడ దూకాలా అని అలోచిస్తూ ప్రశాంతంగా పడుకొన్నా.
ఉపోధ్ఘాతం సమాప్తం.
ఆ విధంగా రాజు మామయ్యా వాళ్ళతో కబుర్లు చెప్పుకొని , మా మామయ్యను బాగ తొక్కి తన్ని ఆడుకొన్నాకా, అమ్మమ్మ పెట్టిన పనసపొట్టు కూర వేసుకొని తిని, వెన్నెల్లో దోమలు విసురుకొంటూ, రేపు ఆటలకి ఎలా గోడ దూకాలా అని అలోచిస్తూ ప్రశాంతంగా పడుకొన్నా.
తెల్లవారుతూనే సూర్యుడితో పాటు నాలో ఒక ఉపాయం ఉదయించింది. గాలిపటం చేసుకొని అది ఎగరేసి ఎక్కడో పడిపోయింది కాబట్టి అది వెదికే నెపంతో దూకేయడం - ఉపాయం అదిరింది కదా ఇంక ఆచరణే మిగిలింది. ఓహో శభాష్ అనుకొని.. పద పదవే వయ్యారి గాలిపటమా అనుకొంటూ, ఉదయం పనులు చేసుకొని వసారాలో కూర్చున్న మా అమ్మమ్మ,అమ్మ, అత్తయ్య, మరదళ్ళ దగ్గరకి చేరా. టి.వి పెట్టుకొని క్రికెట్టు చూస్తూ , ఈనాడు వార్తాపత్రికను, అన్నం మెతుకులనూ, ఈనెలనూ ముందేసుకొని కూర్చున్నా. ఇవన్నీ ఎందుకంటే గాలిపటాలు చేయటానికి అన్న మాట. క్రికెట్టు చూడటం గాలిపటాల తయారీకి ఎలా ఉపయోగపడుతుంది అని మీకు అనుమానం వస్తే ఎందుకైనా మంచిది మీ మోకాలుకు ఒకసారి ఎం.అర్.ఐ స్కాన్ తీయించండి హి..హి..హి.
ఆ విధంగా సరంజామా అంతా సర్దుకొని గాలిపటాల తయారీలో నిమగ్నం అయ్యిఉండగా, మా అత్తయ్య గాలిపటాల తయారీలో నా ప్రజ్ఞ చూసి ఏరా ఇప్పుడే గాలిపటాలు ఇలా తయారు చేస్తున్నావు పెద్దయ్యాకా విమానాలు తయారుచేస్తావా? అని అడిగింది.వెంటనే నేను విమానాలు తయారు చెయ్యడం ఇంత సులువు ఐతే ఇంక దానికి పెద్దవడం ఎందుకు అని అడిగా..ఆ సమాధానం తో మా అత్తయ్యకు దిమ్మ తిరిగి జ్ఞానోదయమై ఒక పలుగు పారా తెచ్చి తను కూర్చున్న చోట ఒక గొయ్యి తీసి రావి చెట్టు పాతి మా ఊరి బొధ్ గయ అని పేరు పెట్టే వరకు శాంతించలేదు.
ఇంతలో మా అమ్మమ్మ కూడా నా తెలివికి మురిసి ముక్కలై ఏరా పెద్దయ్యాకా శ్రీలక్ష్మిని పెళ్ళి చేసుకొంటావా? అంది.
వెంటనే నిద్రపోతున్న జ్ఞాపకాల పొరలలోంచి ఒక ప్రశ్న నిద్ర లేచింది - పెళ్ళంటే ఏమిటి అమ్మమ్మా? ఈ సారి అమ్మ పక్కన ఉన్నా అమ్మమ్మ ఉంది, నా ప్రశ్నకు సమాధానం దొరుకుతుంది అన్న ఆనందం లో అడిగేసా.
వెంటనే నిద్రపోతున్న జ్ఞాపకాల పొరలలోంచి ఒక ప్రశ్న నిద్ర లేచింది - పెళ్ళంటే ఏమిటి అమ్మమ్మా? ఈ సారి అమ్మ పక్కన ఉన్నా అమ్మమ్మ ఉంది, నా ప్రశ్నకు సమాధానం దొరుకుతుంది అన్న ఆనందం లో అడిగేసా.
నా ఊహ నిజం అయ్యింది అమ్మమ్మ సమాధానం చెప్పింది.. పెళ్ళంటే..మొగుడు ..పెళ్ళాం..అవ్వటం అని. హ్మ్మ్ అర్ధం కాలా అందుకే అంటే ఏంటి అన్నా..
అమ్మమ్మ: అంటే నేను, మీ తాతయ్య, మీ అమ్మ, మీ నాన్న, అత్తయ్య, మామయ్య లాగా అన్న మాట.
నేను:ఓ..అంతేనా.
నేను: ఐతే పెళ్ళైతే నేను , శ్రీలక్ష్మి అన్న మాట అంతేనా అన్నా. అమ్మమ్మ అంతేరా అంది.
అడిగిన ప్రశ్నకు సమాధానం రావడంతో ఇంకో సందేహం వచ్చింది. అమ్మమ్మా మరి మా నాన్న అప్పుడప్పుడూ మా అమ్మతో నిన్ను పోషించేది నేను, మీ పుట్టింటి వాళ్ళు కాదు అంటుంటాడు. పోషించడం అంటే ఏంటి? అన్నా (మనకు ప్రశ్న అడగడం తెలుసు కాని ఏ ప్రశ్న ఎక్కడ అడగాలో తెలిసి చావదు కదా). అంతే మా అమ్మ మొహం ఎర్రగా అయ్యింది .ఇప్పుడు మీరు ఏమి అనుకొంటున్నారో నాకు తెలుసు. మా అమ్మ స్రుష్టించిన సునామీ లో నేను కొట్టుకొని పోయాను అని కదూ .హ..హ..హ..హ .అన్నీ అనుకొన్నట్టు జరిగితే అది జీవితం ఎందుకు అవుతుంది.సునామీ వచ్చింది కానీ వేరే వైపునుండి, అదెలాగా అంటే...ఈ క్రింద విధంగా.
నేను:ఓ..అంతేనా.
నేను: ఐతే పెళ్ళైతే నేను , శ్రీలక్ష్మి అన్న మాట అంతేనా అన్నా. అమ్మమ్మ అంతేరా అంది.
అడిగిన ప్రశ్నకు సమాధానం రావడంతో ఇంకో సందేహం వచ్చింది. అమ్మమ్మా మరి మా నాన్న అప్పుడప్పుడూ మా అమ్మతో నిన్ను పోషించేది నేను, మీ పుట్టింటి వాళ్ళు కాదు అంటుంటాడు. పోషించడం అంటే ఏంటి? అన్నా (మనకు ప్రశ్న అడగడం తెలుసు కాని ఏ ప్రశ్న ఎక్కడ అడగాలో తెలిసి చావదు కదా). అంతే మా అమ్మ మొహం ఎర్రగా అయ్యింది .ఇప్పుడు మీరు ఏమి అనుకొంటున్నారో నాకు తెలుసు. మా అమ్మ స్రుష్టించిన సునామీ లో నేను కొట్టుకొని పోయాను అని కదూ .హ..హ..హ..హ .అన్నీ అనుకొన్నట్టు జరిగితే అది జీవితం ఎందుకు అవుతుంది.సునామీ వచ్చింది కానీ వేరే వైపునుండి, అదెలాగా అంటే...ఈ క్రింద విధంగా.
నా ప్రశ్నకు సమాధానం వచ్చింది... పోషించడం అంటే తిండి పెట్టడం అని.వెంటనే నా కళ్ళ ముందు ఒక చలనచిత్రం కనపడింది. నేను మా గజ లక్ష్మిని పెళ్ళి చేసుకొన్న తర్వాత, ఉదయాన్నే 4కు లేచి మా కళ్ళం శుభ్రం చేసి, పాలు పోసి , పేపర్ వేసి , పైసా పైసా కూడబెడితే ఆ డబ్బు మా గజలక్ష్మి గారు పాలలాగ జుర్రేస్తారు.
తరువాత 5-8 ట్యూషన్లు చెప్పి సంపాదించినది ఈవిడ టిపినీలకు సరిపోతుంది. 9-5 ఉద్యోగం చేసింది ఈవిడ మధ్యాన్న భోజన పధకానికి సరిపొతుంది. మళ్ళా 5-7 తరువాత కార్యాలయం నుండి సరదాగా మారువేషం వేసుకొని రిక్షా తొక్కి సంపాదించినది ఈవిడ సాయంత్ర ఉపాహారానికి సరిపోతుంది. మళ్ళా 7:30-9 ట్యూషన్లు చెప్పి రాత్రి భోజనం పెట్టాలి అంటే...ఇంక నా పని అంతే అని భవిష్యత్తుని ముందు జాగ్రత్తతో అలోచించి .....నేను శ్రీలక్ష్మిని పెళ్ళి చేసుకోనూ అని అరిచా.
వెంటనే ఒక రాకాసి అల నా వెన్నును బలంగా తాకింది. ఇప్పుడు మీకొక ప్రశ్న. నన్ను తాకిన అల 1) సునామి అల 2) మా మరదలి చెయ్యి . మీ సమాధానలని వారం లొగా 1 లేదా 2 అని 23456 కి సంక్షిప్త సమాచారం () పంపించండి. సరైన సమాధాలు పంపిన విజేతలకు మా మరదలిని ఎత్తుకొనే భాగ్యం.హి..హి..హి..హి.
ఆ అల తాకిడి నుండి తేరుకొనేలోగా టి.వి లో కపిల్ దేవ్ కొట్టిన సిక్స్ నా తలకు తగిలింది. దానితో నాకు దూరదర్శిని() అవసరం లేకుండానే పట్టపగలే అన్ని రంగులలో చుక్కలు, నక్షత్ర మండలాలు కనిపించాయి. వెంటనే నా వీపు మీద బుధగ్రహం కూర్చున్న భావం. ఒక్క క్షణం నా రోజూ ప్రార్ధనలు ఫలించి దేవుడు తన విశ్వరూపం చూపించడం లేదు కదా అని అనుమానం వచ్చింది.
అది తీర్చుకొందాం అని తల విదిలిస్తే... తల కదలదేంటీ????అయ్యో.. దేవుడా నాకేదో అయ్యింది అనుకునేంతలో నా బుర్ర ఒక్కసారిగా పనిచేయడం మొదలుపెట్టింది. అప్పుడు వెలిగింది "శ్రీలక్ష్మిని పెళ్ళి చేసుకోనూ" అని అరిచిన అరుపుకి మా మరదలి మొదటి రియాక్షన్() 1) నొచ్చుకొని వీపు మీద చరిచిన చరుపు.
ఇంకనూ కసి తీరక నెత్తి మీద ఒకటి మొట్టి నా మీద ఎక్కి గుప్పిళ్ళతో నా జుట్టు పట్టి గుంజి పండగ చేసుకొందన్న మాట.మా అత్త, ఆమ్మ విడిపించబట్టీ కాని లేకపోతే ఈ పాటికి మా ఊరి బోధ్ గయ పక్కనే నేనూ గయా అని రాయించేద్దురు.ఇంత జరిగి దెబ్బలు తిని నేను ఉంటే (ఏడట్లేదులెండి ఎందుకంటే ఏడిస్తే మా మరదలి ముందు నా పరువు పోతుంది + తన కసి తీరినట్టు ఉంటుంది అందుకే ఆ బాధ గుండెలలొ దాచుకొని తర్వాత పగ తీర్చుకొందాం అనుకొన్నా) కాని ఏమి లాభం దెబ్బలు తిని నేను ఎడుస్తుంటే. అందరూ కోపం వచ్చిందామ్మా అని మా మరదలిని ఓదారుస్తున్నారు.
చీ! జీవితం అనుకొని ఇంకేమి వెళ్తాం ఆటలకు అనుకొని పక్క గదిలొకి వెళ్ళా.ఈ లోగా అందరూ ఆ గదిలోకి వచ్చారు ఆహా.. ఇప్పుడు మనకి సామూహిక ఓదార్పు యాత్ర ఉంటుంది అని చంకలు గుద్దుకొంటుండగా. అందరూ నన్ను చూసి నవ్వడం మొదలు పెట్టారు. ఎందుకంటే నేను దెబ్బలు తినడం వాల్లకు నవ్వు తెప్పించిందట. హ్మ్మ్ విషాదం లొ వినోదం అంటే ఇదే అనుకొని, మనసులొ ప్రతిజ్ఞ చేసుకొన్నా.. భారతదేశము నా మాత్రుభూమి.. భారతీయులందరు నా సహోదరుళ్ళు (సహోదరుణిలు) కాదు. నేను నా మరదలిని మనస్పూర్తిగా ద్వేషిస్తాను. ఇంత ఉత్పాతానికి కారణమైన పెళ్ళిని (ఈ గొడవ అంతా పెళ్ళి గురించి అడగటం వల్లే కదా మొదలు) ద్వేషిస్తాను, అనుకొని అ రోజుకి ఆటలకి స్వస్తి చెప్పి పడుకొన్నా.
ఈ సంఘటన నాకు పెళ్ళంటే, నా వయసు ఆడవాళ్ళంటే భయపడతానికి, ద్వేషించడానికి పునాదిని కొంచం బలంగా వేసింది.
కొసమెరుపు:అసలు ఈ గొడవంతా పోషించడం అన్న ప్రశ్న దగ్గర మొదలైంది కదా అని మీరు అడగొచ్చు.కాని అసలు ఆ ప్రశ్న అడగటానికి కారణం, పెళ్ళి గురించి మా అమ్మమ్మను అడిగిన ప్రశ్నకు సమాధానం రావటమే కదా!! పైగా పోషించడం గురించి ప్రశ్న అడిగినప్పుడు మా అమ్మ రియాక్షన్ ఏలా ఉన్నా తర్వాత మాత్రం దగ్గరకు తీసుకొని ఓపికగా లౌక్యంగా ఎలా ఉండాలో చెప్పింది.. కాబట్టి తప్పంతా మొదటి ప్రశ్నదే.వచ్చేసారి మరిన్ని సంఘటనలతో కలుద్దాం.
కొసమెరుపు:అసలు ఈ గొడవంతా పోషించడం అన్న ప్రశ్న దగ్గర మొదలైంది కదా అని మీరు అడగొచ్చు.కాని అసలు ఆ ప్రశ్న అడగటానికి కారణం, పెళ్ళి గురించి మా అమ్మమ్మను అడిగిన ప్రశ్నకు సమాధానం రావటమే కదా!! పైగా పోషించడం గురించి ప్రశ్న అడిగినప్పుడు మా అమ్మ రియాక్షన్ ఏలా ఉన్నా తర్వాత మాత్రం దగ్గరకు తీసుకొని ఓపికగా లౌక్యంగా ఎలా ఉండాలో చెప్పింది.. కాబట్టి తప్పంతా మొదటి ప్రశ్నదే.వచ్చేసారి మరిన్ని సంఘటనలతో కలుద్దాం.
13 comments:
బోధ్ గయ పక్కనే నేనూ గయా అని రాయించేద్దురు---Idi maatram sooperuuu
mee ammagaru valla inti adapillega? atu 3 tharalu adapillalu leru annaru?
mee rathallo parinithi kanipisthundi. English vadatam kuda taggincharu. Mottaniki, baga rasthunnaru !!
"విమానాలు తయారు చెయ్యడం ఇంత సులువు ఐతే ఇంక దానికి పెద్దవడం ఎందుకు"
:D
@Anonymous1,
మీరు కరెక్ట్..ఈ సారికి అలా కానిచ్చేయండి. మావాడికి సీరియస్ వార్నింగ్ ఇచ్చా లేండి :)
@Anonymous2,
ధన్యవాదములు. ఈ ప్రేమ-పెళ్ళి టపాలు రాస్తున్నది నేను కాదు, నా స్నేహితుడు.
@మినర్వా మిత్రమా,
మావాడు నా పర్యవేక్షణలో హ్యాస్యాన్ని ఇరగదీస్తున్నాడు :D
@ఆహ్లాద గారు,
ధన్యవాదములు మీ వాఖ్యకి..
ఇంతకీ మీ ఊరి పేరేమిటో చెప్పనేలేదు...
మరో విషయం ఏమిటంటే విమానాల కంటే గాలి పటాలు తాయారు చేయడమే చాల కష్టం
కాని మీ టపా సూపరు...
మరిన్ని హాస్య రచనలు అందిస్తారని ఆశిస్తున్నాము ....
:) :)
హహహ..గిరీష్ గారు.. :D
బోద్ గయ చూడటానికి కష్ట పాడాలనుకున్న ..అవసరం లేదు.. :P ..మీ ఊరొచ్చెస్తా .. :)
మీ మరదలిని ఒక్క సారి పరిచయం చేయరాదు... :) :P
పోస్ట్ చాలా బాగుంది..
@కథాసాగర్
గోదావరి జిల్లానే..
కరక్టే.. విమానాలకి ఎటు వెళ్ళాలో, ఎలా వెళ్ళాలో అన్నీ వివరాలు ఎప్పటికప్పుడు అందుతాయి. మరి గాలిపటానికి, మనమే అన్నీ, ఎంత దూరం వెళ్ళాలి అనేదానికి దారం, ఎలా వెళ్ళాలి అనేదానికి తోక.. :), ధన్యవాదములు.
@కిరణ్ గారు,
అంతకన్నా మహా భాగ్యమా, రండి రండి.. అయిపోయారు మీరు :D, ధన్యవాదములు.
నేను మా గజ లక్ష్మిని పెళ్ళి చేసుకొన్న తర్వాత, ఉదయాన్నే 4కు లేచి మా కళ్ళం శుభ్రం చేసి, పాలు పోసి , పేపర్ వేసి , పైసా పైసా కూడబెడితే ఆ డబ్బు మా గజలక్ష్మి గారు పాలలాగ జుర్రేస్తారు.
తరువాత 5-8 ట్యూషన్లు చెప్పి సంపాదించినది ఈవిడ టిపినీలకు సరిపోతుంది. 9-5 ఉద్యోగం చేసింది ఈవిడ మధ్యాన్న భోజన పధకానికి సరిపొతుంది. మళ్ళా 5-7 తరువాత కార్యాలయం నుండి సరదాగా మారువేషం వేసుకొని రిక్షా తొక్కి సంపాదించినది ఈవిడ సాయంత్ర ఉపాహారానికి సరిపోతుంది. మళ్ళా 7:30-9 ట్యూషన్లు చెప్పి రాత్రి భోజనం పెట్టాలి
idi keka :)
హహహ లాగూలు తప్ప, జెట్ లాగులు తెలియని రోజులు కేవ్వ్వ్వవ్వ్వవ్వ్వ్!
బుగ్గ వాచేలాగా ముద్దు పెట్టుకొంటారన్నమాట ఇలా కూడా పెట్టుకుంటారా ;)
నక్క,కుక్క అన్న బిరుదుల కన్నా మా మరదలు దుక్క లాగ ఐతే చూడటం మెరుగు కదా అని ఊరుకొన్నా ప్చ్ పాపం!
పాపం బొద్దుగా, ముద్దుగా ఉండే మరదలిని అన్నన్ని మాటలంటారా?హన్నా! ఇది చూపిస్తాను ఉండండి మీ శ్రీలక్ష్మికి.
నా వయసు ఆడవాళ్ళంటే భయపడతానికి, ద్వేషించడానికి పునాదిని కొంచం బలంగా వేసింది. సరే కాని పెళ్లి ఒకే వయసు అమ్మాయిని చేసుకోరు కదా!మీ కన్నా చిన్నవాళ్ళని కదా చేసుకునేది?????????? కమాన్ గుస గుస!
@రసజ్ఞ గారు,
>> సరే కాని పెళ్లి ఒకే వయసు అమ్మాయిని చేసుకోరు కదా!మీ కన్నా చిన్నవాళ్ళని కదా చేసుకునేది?>>
అంత విధి రాత ఎవరూ ఏమీ చెయ్యలేరు.. :), థ్యాంక్స్.
Prasalu danchesthunnaru, keep it up.....
Post a Comment