Monday, January 9, 2012

ఏం చెయ్యాలి..

అవి నేను పదవ తరగతి చదువుతున్న రోజులు. మా పాఠశాలలో స్కాలర్షిప్పు పొందటానికి Income Certificate ని ఇవ్వవలసి ఉంటే మా ఊరు మండల ఆఫీసులో ఎమ్.ఆర్.ఓ గారికి అర్జీ పెట్టాను. వెళ్ళగానే బాబు నేను ఇనిషియల్ వేయిస్తాను. నువ్వు వెళ్ళి వి.ఎ.ఓ ని కలువు. ఆయన సంతకం చేసిన తర్వాత ఆర్.ఐ. ని కలువు. ఆయన సంతకం చేస్తే మళ్ళీ ఈ దరకాస్తు నా దగ్గరకు వస్తుంది. అప్పుడు నేను నీకు Income Certificate ఇస్తాను అన్నారు. సరేనని వి.ఎ.ఓ గారు ఎక్కడుంటారో తెలుసుకొని ఆయన ఉన్న చోటుకి వెళ్తే ఆయన నువ్వు ఈ ఊర్లో ఎన్నేళ్ళుగ ఉన్నావు, ఎక్కడ మీ ఇళ్ళు, మీ తల్లిదండ్రులెవరు అని కొన్ని ప్రశ్నలడిగి, నా దరకాస్తుని ఆర్.ఐ. గారికి ఫార్వార్డ్ చేశారు. తర్వాత ఆర్.ఐ గారు దాదాపుగ మళ్ళీ అవే ప్రశ్నలు అడిగి ఎమ్.ఆర్.ఓ గారికి పంపించారు. మొత్తానికి నాకు సర్టిఫికేట్ వచ్చింది. కాని ఆ సమయానికే పాఠశాలలో సర్టిఫికేట్ ఇవ్వవలసిన గడువు తేదీ దాటిపోవటంతో అది ఉపయోగపడలేదు. నాకు అప్పుడు అర్ధం కాలేదు కానీ, తర్వాత ఆలోచిస్తే నాకు మండలాఫీసులో Income Certificate తీసుకోవటానికి పట్టిన సమయం ఎనిమిది నెలలు పైనే. మొదట నవ్వొచ్చింది. చొప్పులు అరిగిపోయేలా తిరిగాను. ఎండ, వానను లెక్కచేయకుండ తిరిగాను. (ఇప్పుడు తిరగలేననుకోండి, అవసరం కూడ లేదు). అప్పుడు నాకు లంచం, బ్రోకర్ అనే వాటి గురించి అంతగా తెలియదు. తెలిసునుంటే రెండోరోజే నాకు సర్టిఫికెట్ వచ్చుండేది. అప్పుడు తెలియకపోవటమే ఇప్పుడు సంతోషాన్నిస్తుంది

మా ఇంటి ఎదురుగ మేరీ అనే ఒకావిడ ఉండేది. ప్రభుత్వ ట్రెజరీ కార్యాలయంలో సీనియర్ అకౌంటెంట్. కష్టపడి చదివి ఉద్యోగం సంపాదించింది. వచ్చిన ప్రజలకు పెంక్షను తాలూకు డబ్బులు ఇచ్చి, కంప్యూటర్‌లో ఆ లెక్కలను పొందుపరచటం ఆమె పని. లంచం తీసుకునేది కాదు, ఇష్టం లేదు. ఆమె పై అధికారి రోజు ఐదువేలు ఇంటికి పట్టుకెళతాడు. ఆయన మాత్రం జనాల దగ్గర లంచం తీసుకోడు. ఆయన చెప్పేది ఒకటే అతని క్రింద పనిచేసే ఉద్యోగులకి, "నాకెవ్వరిస్తారు. మీరు వచ్చే జనాల దగ్గర డబ్బులు తీసుకోండి, దానిలో కొంత నాకివ్వండి". ఓ రోజు భర్తను పోగొట్టుకున్న ఒక మహిళ, తన భర్త పెంక్షనును తన పేరు మీద మార్చుకోవటానికి ఆఫీసుకొస్తే, మేరీ గారు అలాగే మార్చి ఆమెకు పెంక్షను ఇచ్చారు. లెక్కలో కొద్దిగ తప్పు కూడి ఆమెకు ప్రతినెలా ఐదువేలు ఎక్కువ ఇచ్చేవారు. ఇలా పదినెలలు సాగింది. పెంక్షను తీసుకునే మహిళ ఏమో తనకేమి తెలియదు అన్నట్టు ఎక్కువ వచ్చినా తీసుకునేది. స్క్వాడ్‌కి వచ్చిన ఆ ఏరియా ఎమ్.ఆర్.ఓ ఈ విషయాన్ని కనుకొన్ని మేరీ గారిని అడిగితే చూసుకోలేదు సార్ అని చెప్పి కాస్త ఫీల్ అయ్యి వెళ్ళి పెంక్షను తీసుకునే ఆమెను అడిగితే, నాకేం తెలుసమ్మా మీరిస్తున్నారు నేను తీసుకుంటున్నా అంది. డబ్బులు తిరిగి కట్టమంటే నా దగ్గరలేవు కట్టమంది. అప్పుడు మేరీ గారు సరేనమ్మ నేను ఈ కేసుని కోర్టుకి వేస్తాను. అక్కడే తేల్చుకుందాం అని కోప్పడగ భయపడ్డ ఆమె ఎక్కువ వచ్చిన డబ్బులను తిరిగిచ్చింది. కానీ ఎమ్.ఆర్.ఓ గారు ఇలా అన్నారు. "చూడమ్మా, నువ్వు ఎక్కువిచ్చావ్, ఆమె తిరిగిచ్చింది. కానీ ఈ విషయాన్ని నేను కనిపెట్టాను, నేను ఈ విషయాన్ని ప్రభుత్వానికి తెలియపరచ కుండా ఉండాలంటే నువ్వు నాకు ఏదైనా ఇవ్వాలి. ఏ ఇరవైదు వేలు సద్దావంటే నేను ఈ విషయాన్ని ఎక్కడా చెప్పను". ఇంక ఆ తర్వాత దిక్కు తోచని మేరీగారు ఏం చేసుంటారో చెప్పక్కర్లేదు.

ఇలా చెప్పుకుంటూ పోతే అపరిచితుడు, బ్రోకర్ లాంటి సినెమాలు ఎన్నో తీయొచ్చు.  ప్రభుత్వ ఆఫీసు అంటే ముందు లంచం, ఆ తర్వాతే పని. అది ఏ శాఖ అయినా సరే. ప్రైవేటు కార్యాలయాల్లో లేవని కాదు. కాని (పెద్ద పదమేమో) దేశాన్ని పరిపాలించేది ప్రభుత్వమే కదా. నేరుగా వెళితే పని తొందరగా అవ్వట్లేదని ఇలా అడ్డదారిలో వెళ్తున్నాం. కొంచెం డబ్బు పోతుంది. కానీ ఖచ్చితంగా పనవుతుంది. ఆ తర్వాత మనము ఇచ్చినదానికంటే ఎన్నో రెట్లు తీసుకోవచ్చు. అడిగే వాడెవ్వడు, అడ్డు చెప్పే వాడెవ్వడు అని మన వాళ్ళ ధీమా. ఇలా దేశంలో సగానికి పైగా డబ్బు నలుపు రూపంలోనే ఉంటే, ఇంక డాలరుకి యాభై మూడేంటి, నూట యాభై మూడైనా పెద్దగా ఆశ్యర్య పోవలసిన అవసరం లేదు. అయినా మనం పనిచేసే ఐ.టి ఉద్యోగాలు కూడ వాళ్ళకు డబ్బులు తెచ్చిపెట్టి మన రూపాయి విలువ తగ్గించేవే కదా... రేపు ఎలా బ్రతకాలో అని ఒక భయం, మనకు ఏమీ కానంత వరకు ఏమైనా పర్వాలేదు అనే ఒక స్వార్ధం. ఒక్క సారి ఆ మోజులో పడ్డాక అన్ని సినెమాల్లో చెబుతున్నట్టు మన తర్వాత తర్వాత తరాల వాళ్ళు కూర్చొని తిన్నా తరగనంత. సులువైన మార్గం లంచం. నిజాయితీగా కూడ ఇలా సంపాదించచ్చు. కానీ సమయం పడుతుంది. అంత ఓపిక, ఆత్మ విశ్వాసం లేకపోవటం వళ్ళనే ఇవన్నీ.

నేనేదో వీటికన్నీ వ్యతిరేకంగా/అనుకూలంగా ఉన్నానని ఈ టపా అర్ధం కాదు. అలా బ్రతకలేము అనికూడ నాకు ఇప్పుడిప్పుడే అర్ధం అవుతుంది. కాని నా వంతుగా నేను చేయ దలచుకున్నదేమిటంటే, సాధ్యమైనంత వరకు లంచం ఇవ్వటానికి నిరాకరించండం, ఒకటి రెండు రోజులు ఆలస్యమైనా పని పూర్తవ్వటం కోసం వేచి ఉండటం. మీకు తెలిసినవి చెప్పండి. ప్రయత్నిస్తాను.

తప్పేమైనా బనియన్ సైజా స్మాల్, మీడియం, లార్జ్ అని చెప్పటానికి; అయినా రిజల్ట్స్ చూడండి అన్నీ ఎక్స్‌ట్రా లార్జులే.
                                  (అపరిచితుడు లో విక్రమ్)

మనిషి మారటానికి అవకాశం రావటం ముఖ్యం కాదు.. ఆ అవకాశాన్ని గుర్తించటం ముఖ్యం.
                                                     (బ్రోకర్ సినెమాలో ఆర్.పి)

10 comments:

రాజ్ కుమార్ said...

hmm...
ఏం చెప్పాలా అని ఆలోచిస్తున్నా... రెండేళ్ల క్రితం ఇలాగే అన్నింటిలోనూ కరెక్ట్ గా ఉండాలీ అని ట్రై చేసీ, దెబ్బ తినేసీ, నలుగురితో నారాయణా అనటం మొదలెట్టాను.
చెప్తే ఇంకో పోస్ట్ అవుతాదేమో..

Hemanth Kumar R said...

బాగుంది నీ టపా...
నువ్వు చెప్పింది ౧౦౦% నిజం.
నీ టపా కి కొంచం నేను కలుపుతూ.......
అన్నీ సార్లు ప్రభుత్వ ఉధ్యొగులే లంచానికి కారనంకాదు, మనమూ కొన్ని సార్లు కారనం అవుతాం. ఉ: వారాంతం లొ బస్సులో స్థలం కోసం కండ్కరు కు లంచం, రైల్లో ను లంచం ఇస్తుంటాం,....

ఇలా చెప్పుకుంటు పోతె, మన తప్పులు వుంటాయి. కాని కొందరికి అవసరం కావచ్చు, కొందరికి ఇంకేదో కారణం కావచ్చు.

పరీక్షలో నెగ్గక పొతే, ఒక సంవత్సరము వ్రూధా అవ్వుతొందని, లంచం ఇస్తే ఎవరైనా ఒప్పుకోంటారా!?...

http://corruptionthebigenemy.blogspot.com/2010/09/curruption-big-enemy.html

tarakreddy said...

Its true. Recently I lost my driving licence. I went to RTO office and asked about details. They were telling they need FIR from police station. I went to PS and asked to take a complaint. They refused to take it and I could not able get till now....

rajiv raghav said...

అన్న,
నేను ప్రభుత్వంలో పది సంవత్సరముల నుండి పనిచేస్తున్నాను...
జాయిన్ ఆయినప్పుడే అనుకొన్నా సిన్సియర్ గా పనిచేయాలని...
అనుకున్నట్టుగానే ఇప్పటికీ నిజాయితిగా పనిచేస్తున్ననని గర్వంగా చెప్పుకోగలను....
కాని నా డిపార్టుమెంటులోనే నా సర్వీసు సంబందిత పనులు చేయించుకోడానికి లంచం ఇవ్వవలసివచ్చింది....
లంచం తీసుకోవడం ఎంత తప్పో, ఇవ్వడం కూడా అంతే తప్పు.....
కాని లంచం తీసుకోకపోవడం అనేది నా చేతుల్లో ఉంది.... దానిలో నిజాయితిగా ఉండగలిగాను...
కాని లంచం ఇవ్వడంలో నేను ఏమీ చేయలేకపోయాను... ఎందుకంటే తప్పలేదు... ఇప్పుడు చెప్పండి...
మార్పు ఎక్కడ రావాలో....

Indian Minerva said...

బాగారాసారు. నేనయితే ఈ పోస్టులో ఉన్న విషయంతో ఏకీభవిస్తాను.

http://saahitya-abhimaani.blogspot.com/2011/08/blog-post.html

"అవినీతి నిర్మూలనకు ఒక తరం మొత్తం త్యాగాలు చెయ్యటానికి సిద్ధం కావాలి. ఎవరికీకావాలిసిన పనులు వాళ్ళు లంచం ఇవ్వకుండా ఎన్ని కష్ట నష్టాలు వచ్చినా ఎదుర్కొని తమకు కావలసినవి సంపాయించుకునే మానసిక స్థైర్యం, ఓపిక కావాలి. అలా చేసినప్పుడు జరిగే నష్టాలను భరించి ఉండగల శక్తి ఉండాలి అది లేని నాడు, ఈలోక్ పాల్ బిల్లు కాదుకదా ఆ దేముడే దిగి వచ్చినా అవినీతి పోదు."

గిరీష్ said...

@రాజ్,
కాస్త మంచిగా ట్రై చేద్దాం అనే వాళ్ళ పరిస్థితి అంతా ఇంతేనేమో.., నీ స్టైల్‌లో ఓ పోస్టు రాసెయ్ చెప్తా ముందు.. :), ధన్యవాదములు.


@Hemanth,
నీ టపా చదివాను. నాకనిపించింది ఏంటంటే అతను అంత సులువుగా మాట్లాడటానికి కారణం అతను ఇచ్చే లంచం అతని నెలసరి జీతంలో 0.1% అయిండొచ్చు మరియు టి.సి తప్పకుండ లంచం తీసుకొని సీటు చూపిస్తాడని ధీమా అఅయిండొచ్చు..

>>పరీక్షలో నెగ్గక పొతే, ఒక సంవత్సరము వృధా అవ్వుతొందని, లంచం ఇస్తే ఎవరైనా ఒప్పుకొంటారా!?...>>

మంచి ప్రశ్న. కాకపోతే మన విద్యాసంస్థలు నడిపేవాళ్ళకు ఈ సందేహం ముందుగానే వచ్చి అంతదాక తెచ్చుకోరు.. :), థ్యాంక్స్.

గిరీష్ said...

@Tarak,
It Happens everywhere in India. తొందరగా తెచ్చుకోవటానికి ట్రై చెయ్యి లేకపోతే కనపడిన పోలీసోడికి లంచం ఇవ్వాల్సి వస్తుంది.. :), థ్యాంక్స్.

@రాఘవ్ గారు,
First of all let me appreciate you for your sincerity. Great!. Keep it up. మీలాంటి వాళ్ళ వళ్ళే ఇంకా కొంత మంది నిరుపేదలు ఊపిరి పీల్చగల్గుతున్నారు. మీరు మీ బ్లాగులో తెలిపినట్టు మార్పు ఒక్కడిలో వస్తే సరిపోదు, ప్రతి ఒక్కడిలో రావాలి. ధన్యవాదములు.

గిరీష్ said...

@Minerva మిత్రమా,
Thank You!. మీరిచ్చిన లింక్‌లో ఉన్న పోస్ట్ చదివాను. పెద్దాయన ఇరగదీశాడు టపాని. నేను ఒకటి రెండు పాయింట్లు రాస్తే ఆయన దాదాపుగ అన్నింటినీ మిళితం చేశారు. ఒక తరం అనే ప్రయోగం బాగుంది కానీ, ప్రాక్టికల్‌గా ఎలా, హొవ్..?

kiran said...

liked it :)

గిరీష్ said...

@కిరణ్,
Thank You! :)