Monday, April 18, 2011

ప్రేమ - పెళ్ళి (నా కథ) - 3

          ఆ విధంగా వేసవి సెలవలు గడిచాకా పాఠశాలలు తెరిచారు. అలా కొన్ని రోజులు అయ్యాకా ఒక వేసవి కాలం మధ్యాన్నం కారు మబ్బులు కమ్ముకొన్నాయి.  హోరున వర్షం మొదలయ్యింది , వేసవి లొ వర్షాలు ఏమిటో అనుకొంటుండగా, ఒక అంబాసిడర్ కారు మా పాఠశాల ముందు ఆగింది అందులోంచి ఒక ముగ్గురు దిగడం మా ప్రధానోపాధ్యాయుడు(ఫ్ర.)పరిగెత్తుకొంటూ వెళ్ళి వాళ్ళను వెంటపెట్టుకొని రావడం కనిపించింది. ఎవరా అన్న ఆలోచన ముగిసే లోపే వాళ్ళు మా తరగతి వైపు వచ్చారు. వాళ్ళ లో ముగ్గురు నాకు తెలిసిన వారే , ఒకరు మా ప్ర. గారు, వేరొకరు మా ఊరి ప్రెసిడెంటు(ప్రెసి) గారు, ఇంకొకరు వారి అబ్బాయి, నాలుగో మనిషి ఎవరు అనుకొంటుండగా, మా ప్ర. గారు పరిచయాలు మొదలుపెట్టారు.  అమ్మాయి బాలా త్రిపుర సుందరి (బా.త్రి.సు) అమ్మాయి మన పాఠశాలలోనే మీ తరగతిలో చేరుతుంది అని, అమ్మాయి వైపు తిరిగి అమ్మాయి నువ్వు వెళ్ళి కూర్చోమ్మా అన్నారు. లోపు వాళ్ళ తాతగారు నేను సాయంత్రం కారు పంపిస్తాను..జాగ్రత్తమ్మా అని చెప్పి వెళ్ళి పోయారు.  ఇక చూసుకోండి కారు అన్న మాట వినగానే ఒక్కొకరికి భక్తి భావం పొంగుకు వచ్చి విలన్ ప్రకాష్ రాజ్ చుట్టూ చేరిన ఆకురౌడీల లాగ మూగడం మొదలుపెట్టారు.
          దానితో మా మాస్టారుకి ఒళ్ళుమండి గేదెలను అదిలించినట్టు అందరిని అదిలించి కూర్చోబెట్టారు.  ఇంతలో అమ్మాయి, సార్ నాకు ఇది పాఠశాలలో మొదటి రోజు కావడం వలన అందరికి బిళ్ళలు పంచాలి అనుకొంటున్నా అని చెప్పింది.  అది విని మాస్టారు, దానిది ఏముందమ్మా నా పాఠం ఒక 10 ని. ముందు ముగిస్తా నువ్వు బిళ్ళలు పంచు అన్నారు. హ్మ్మ్! ఏమి చెప్తాం మాములుగా ఒంటికి అని అడిగితే ఇంతెత్తున లేచే మా మాస్టారు కూడా ఎంత సౌమ్యంగా సమాధానం చెప్పారు..అంతేలే అమ్మాయి..అందులోనూ ప్రెసి గారి మనవరాలు అందుకే భోగం అనుకొని ఐనా, మనకెందుకులే ఇప్పటికే అమ్మాయిల చేతుల్లో బాగా దెబ్బై ఉన్నాం గనక మట్లాడకుండా ఉండాలి అనుకొన్నా.
          కాని మనసులో ఎప్పుడెప్పుడు బిళ్ళలు తిందామా అని పీకుతుంది. సర్లే అనుకొని పాఠం వింటూ పక్కకి తిరిగి చూస్తే ఇంకేముంది అమ్మాయిలు అందరూ ఒక అడుగు గాలిలో లేచి పాఠం వింటున్నారు. వార్నీ!! ప్రెసి గారి మనవరాలు(కారులో తిరిగే) వాళ్ళ పక్కన కూర్చున్నందుకే టెక్కంతా అనుకొన్నా. లోపే ఒక అద్భుతమైన ఐడియా వచ్చింది. అసలు ప్రెసి గారి మనవరాలిని మరియు పాఠశాలలో అమ్మాయిలని అందరిని ఒక చోట చేరిస్తే అమ్మాయిలకి బల్లలు వాడే పని ఉండదు కదా అని, ఇంకా ఏమేమి ఆలోచనలు వద్దునో కాని లోపే పాఠం ఆయిపోయి బిళ్ళలు పంచడం మొదలు అయ్యింది. ఎప్పుడెప్పుడు నా వంతు వస్తుందా అని కాసుకొని కూర్చున్నా నా వంతు వచ్చింది ఆత్రం గా బిళ్ళలు తీసుకొన్నా, ఇంతలో ఫెటేల్మని దగ్గరలో పెద్దగా ఉరిమింది నా చేతిలో బిళ్ళలు జారిపడ్డాయి, నేను గట్టిగా అర్జునా, ఫల్గుణా, కిరీటి అని అరిచా ఉరుముకో మరి నా అరుపుకో జడిసి అమ్మాయి చెంగున గెంతి కింద పడ్డ నా బిళ్ళలను తొక్కింది. అవి పచ్చడయ్యాయి , ఇదంతా రెప్పపాటులో జరిగింది మిగిలిన బిళ్ళలు ఇద్దాం అంటే అప్పటికే బిళ్ళలు ఐపోయాయి. వామ్మో మొదటి పరిచయం ఇంత అద్భుతం గా జరిగింది, ఎందుకైనా మంచిది మన జాగ్రత్త లో మనం ఉంటే మంచిది అని అనుకొన్నా.
          తరువాత రెండు రోజులకు అమ్మాయి నా దగ్గరకు వచ్చి నీ నోట్సు ఇస్తావా రాసుకొని ఇస్తాను అంది. అప్పటికే అమ్మాయిల విషయంలో బొప్పి కట్టి ఉండటంతో జాగ్రత్తగా ఉండాలి అనుకోవడం మూలంగా , లేదు నేను చదువుకోవాలి ఇవ్వను అన్నా. సరే అని వెళ్ళిపోయింది. మొదటి యూనిట్ పరీక్ష వచ్చింది షరా మామూలుగా నేను మొదటి స్థానంలో ఉంటే అనుకోని విధంగా అమ్మాయి రెండో స్థానం వచ్చింది. రోజు సాయంత్రం బడి వదిలిపెట్టారు ఇంతలో ఆకాశంలో విమానం ఎగురుతున్న శబ్దం వచ్చింది అందరూ పొలోమని విమానం చూద్దాం అని పరిగెత్తారు, మనకి విమానాలంటే అసలు ఆగదు కదా విమానం మాయమయ్యేంత వరకూ పూర్తిగా చూసి, అది నేనే నడుపుతున్నట్టు కలలు కని పక్కకు తిరిగితే ఎవరూ లేరు ఒక్క బా.త్రి.సు తప్ప. సర్లే తన కారు కోసం చూస్తుంది మనకెందుకులే అనుకొని తనను దాటుకొని వెళ్ళబోయా, ఐతే అనుకోకుండా తను కాలు అడ్డుపెట్టడంతో ముందుకుపడ్డా. ఒక్కసారిగా ఆడ సింహంలాగా నా మీద దూకి పొట్టలో ఒక్కటి గుద్దింది ఏమి జరుగుతుందో అర్ధం అయ్యేలోపే కాలిబంతి లాగా మట్టిలో దొర్లుతున్నా(కాదు తను నన్ను దొర్లిస్తుంది) అమ్మోయి! బాబోయి!! అని ఎలాగో తప్పించుకొని ఎందుకు కొడుతున్నావు అని అడిగా. నీకు యునిట్ పరీక్షలో నాకన్నా ఎక్కువ మార్కులు వచ్చాయి . అది కూడా నువ్వు నోట్సు ఇవ్వకపోవడం వల్ల, అదేంటి నువ్వు వేరే వాళ్ళ నోట్సు తీసుకోవచ్చు కదా అని అడిగా. కానీ ఏమి లాభం అప్పటికే కొట్టే లెక్కలో తప్ప వినేలెక్కలో లేదు.  నన్ను ఎవరైనా దాటేస్తే నేను ఒప్పుకోను ఫలితం ఇలాగే ఉంటుంది అంది.  హతవిధీ! అనుకొని దెబ్బకి కంట నీళ్ళు కుక్కుకొని ఇంటి దారి పట్టా కాని అవమానం నన్ను నిలువెల్లా దహించింది. నేను అమ్మాయిని కొట్టేంత బలం లేకపొవచ్చు కాని మానసికంగా యుద్ధం చేసి ఎలాగైనా తన కళ్ళలో నీరు చూడాలి అని శపధం చేసుకొన్నా.
           రోజునుండి ఎక్కడ కనపడితే అక్కడ వినవే బాలా నా క్లాసు గోలా అంటూ పాటలు లాంటివి మొదలుపెట్టా ఐనా నన్ను లెక్క చేసేదికాదు. !!  ఎలా ఏడిపించడం అనుకొంటుండగా మా బల్ల శ్రీనాధ్ గాడు, ఏరా!! ఏమిటి మధ్యన బాలను చూస్తే నీకు పాటలు పుడుతున్నాయీ అని అడిగాడు. కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడుతుంది అనుకొని ఏమైనా మా శ్రీనాధ్ గాడే కదా అని జరిగిందంతా పూసగుచ్చి చెప్పా. హ్మ్మ్..  అమ్మాయి పద్ధతి నాకూ నచ్చలేదురా కంగారుపడకు నేనూ యేదో ఒక ఉపాయం అలోచిస్తా అన్నాడు. హమ్మయ్యా అనుకొన్నా. చాలా రోజుల తర్వాత నా పగకు ఒక ఊతం దొరికింది అని  ప్రశాంతంగా పడుకొన్నా. తర్వాత రోజునుండి నక్కను వేటాడే సింహాల లాగా అదను కోసం వేచిచూడటం మొదలుపెట్టాం.
          ఇలా ఉండగా ఆగష్టు 15 సందర్భంగా ఆటలపోటీలు ప్రకటించారు. మా శ్రీనాధ్ గాడు, బాలా కూడా పేర్లు ఇచ్చారు తెగ ప్రాక్టీసు చేస్తున్నారు. ఒక రోజు ఇలా ప్రాక్టీసు జరుగుతుండగా నేను చూస్తున్నా మా శ్రీనాధ్ గాడు బాల పక్క లైన్లో నిలబడ్డాడు, పరుగు మొదలైంది ఒక్కసారిగా బాల ఎగిరిపడింది, మోకాలుకి దెబ్బ తగిలినట్టు ఉంది వల వలా ఏడుస్తుంది. ఇంతలో శ్రీనాధ్ గాడు పరుగుపరుగున నా దగ్గరకి వచ్చాడు మా పని ఆస్ట్రేలియాని ఓడించి ప్రపంచకప్ కొట్టిన జింబాబ్వే లాగా ఉంది. రేయ్ ఏమైంది రా!! అని మహదానందంగా అడిగా. వాడు చెప్పడం మొదలుపెట్టాడు. రేయ్ మేము ఇద్దరం లైన్లో నిలబడ్డమా. నాకు నా లైన్ లో ఒక రాయి బయటకు వచ్చి కనిపించింది పరుగెడుతూ నేను రాయిని తన లైన్ లోకి తన్నా తరువాత అంతా దేవుడు చూసుకున్నాడు అని, నువ్వు రా! నా నిజమైన స్నేహితుడివి అని ఆనందంతో వాడిని పట్టుకొని గెంతుతూ వెనక్కి తిరిగా అంతే .......ఆనందం అంతా ఆవిరి ఐపోయింది అక్కడ నిలబడి ....బాల ఉంది. తను ముందుకు వస్తుంటే మా ప్రాణాలు పైనే పోతున్నాయి. సారి మా ఇద్దరికీ పండగ ఐపోయింది. వెళుతూ, వెళుతూ నాకు హెచ్చరిక కూడా చేసింది ఇంకొకసారి నా విషయంలో ఎప్పుడు అడ్డుతగిలినా ఇలాగే ఉంటుంది అని. అమ్మో!బాబో! అనుకొంటూ ఇంటికి చేరా దెబ్బకి మళ్ళా తనను చూడాలంటేనే భయంపుట్టి నా పనేదో నేను అన్నట్టు చదువులో మునిగిపోయా. ఈలోపు ఒక సూక్తి చదివా "చాలా సార్లు మన ప్రయత్నం ఆపేటప్పటికి మనం విజయానికి ఎంత దగ్గరగా ఉన్నామో తెలియదు" వెంటనే నాలోని పౌరుషం నిద్రలేచింది సారి తనను చదువులో ఓడిస్తాను, ఒంటరిగా తనకు దొరకను ఏమి చేస్తుందో చూద్దాం అని శపధం చేసుకొన్నా. అనుకొన్నట్టుగా పరీక్షలు వచ్చాయి, నాకు ఒకటవ స్థానం వచ్చింది వెంటనే సెలవలు అహా పంతం గెలిచింది అని ఆనందంగా ఇంటికి వెళ్ళిపోయా. అలా సెలవలు ఆనందంగా గడుస్తున్నాయి. ఒక రోజు మా అమ్మమ్మగారు తెల్లవారి లేపి రేయ్!కాలవ స్నానానికి వెళ్ళాలి పదా అన్నారు ఇద్దరమూ బయలుదేరి కాలవగట్టుకి చేరాము. అలా చలికి వణుకుతూ నేను ఒడ్డున కూర్చుని అందరినీ చూస్తూ ఉన్నా. లోపు దూరంగా ఒక కారు ఆగింది అమ్మబాబోయి అది బాలా వాళ్ళ కారు  అనుకొంటుండగానే, తను కార్ లోంచి దిగింది. ఇప్పుడు ఎలా రా నాయనా తప్పించుకొనే చోటు కూడా లేదు కదా అనుకొన్నా. కాని ఏమి చేస్తాము. నీటి అడుగున దాక్కొవడానికి నేనేమీ భారతంలో దుర్యోధనుడిని కాదు కదా ఏమైతే అదే అయ్యింది వాళ్ళ నానమ్మగారు ఉన్నారు కదా అని ధైర్యంగా ఉన్నాను, వాళ్ళ నానమ్మ గారు కాలవ లోకి దిగగానే, నా దగ్గరకు వచ్చింది వామ్మో నాకు చలితో పాటు భయం వల్ల వణుకు పుడుతుంది. ఏమి జరిగిందో అర్ధం అయ్యేలోపు నా తల నీటిలో ఉంది...నీటిలో ఊపిరి తీసుకోవడానికి నేనేమీ చేపను కాదు కదా చచ్చేలా ఉంది పరిస్థితి, ఓరి దేవుడా!! తెల్లవారుఝామునే నా జీవితం తెల్లవారిపోనుందా అనుకొంటుండగా ఎందుకో పట్టుసడలింది, లేచి చూస్తే వాళ్ళ నానమ్మ వాళ్ళ డ్రైవర్ గట్టు దగ్గరకు వస్తున్నాడు.. క్షణంలో ఎవరైనా దేవుడిని చూసావా అంటే వాళ్ళ కార్ డ్రైవర్నే చూపిందును.
          వాడు వచ్చి అమ్మాయిగారూ మీరు చలిలో తిరిగితే, మీకు ఏమైనా ఐతే నన్ను సంపేత్తారండి అని తనను తీసుకొని వెళ్ళిపోయాడు. నాయనా తను చలిలో తిరిగితే తనకి కాదు పక్కవాళ్ళకు ఏమైనా అవుతుంది అనుకొని బతుకు జీవుడా అనుకొంటూ మళ్ళా ఎప్పుడూ మొదటి స్థానం కోసం ప్రయత్నించలేదు. మొదటి స్థానం ఇప్పుడు కాకపోతే తర్వాత సంపాదించవచ్చు, కాని ప్రాణాలే పోతే ఎలా అని అనుకొని ఇంక మాట్లాడకుండా ఉన్నా. ఐనా ఇంత దాష్ఠీకాన్ని ఎన్నాళ్ళు భరించాలి. అసలు ఆడవాళ్ళంతా నన్ను వేధించటానికే పుట్టినట్టు ఉన్నారు. సరే! సారికి దేవుడు మన రాత ఇలా రాసాడు ఏమి చేస్తాం . ఐనా ఎణ్ణాళ్ళు ఇలా భయపడుతూ బతకడం అని ఒక నిర్ణయం తీసుకొన్నా.అదేంటో తర్వాత భాగంలో.  

12 comments:

మనసు పలికే said...

పాపం గిరీష్ గారు.. ఎన్నెన్ని కష్టాలో..;);)
టపా బాగుంది.. ఆ బా.త్రి.సు. అంత బలవంతురాలా అండీ.!!!!
అవునూ,, ఇంతకీ ఇదంతా మీ కథా.? మీ స్నేహితుడిదా..?

Unknown said...

గిరీష్ గారు అప్పుడేనా .. ఇప్పుడు కూడా అంతేనా :) .. అమ్మాయిల్ని చుస్తే ఆమడ దూరం పారిపోడం :)

గిరీష్ said...

@అపర్ణ గారు,
త్యాంక్స్ అండి టపా బాగుంది అన్నందుకు.
బా.త్రి.సు. ప్రతాపాలు చూస్తుంటే అలాగే ఉన్నట్టుంది.. :)
రాస్తున్నది మావాడే.. :)

@కావ్య గారు,
మావాడికి చిన్నప్పటినుంచి అనుకుంటా, నాకు ఇంతకముందు ఉండేది, ఇప్పుడు లేదు..:) అయిన అంతలా భయపెట్టే వాళ్ళు తగల్లేదు లేండి :), Thanks.

Manoj said...

very nice narration,intersting,waiting to read the next episode.

గిరీష్ said...

మనోజు,
నేను కూడ వెయిటింగ్ ఇక్కడ :)

Indian Minerva said...

ఈ ఆకురౌడీల పోలిక బాగుంది.

(ఒఖ్ఖసారి ఉదయ్ కిరణ్‌ని గుర్తుతెచ్చుకోండి) ఈ అమ్మాయిలున్నారే వీళ్ళెప్పుడూ ఇంతే ఎప్పుడూ అబ్బాయిల్ని ఏడిపిస్తూనేవుంటారు.

Anonymous said...

**ఈ అమ్మాయిలున్నారే వీళ్ళెప్పుడూ ఇంతే ఎప్పుడూ అబ్బాయిల్ని ఏడిపిస్తూనేవుంటారు.**

అబ్బే! ఎంత బాగ చెప్పారండి, ఇండియన్ మినర్వా గారు. మాంచి ఏడుపుగొట్టు మొహాలను చూస్తే ఎవరికి మాత్రం మెల్లిగా గిల్లాలని అనిపించదండి? గిల్లడం తప్పాండి?

గిరీష్ said...

@Minerva,
:) డైలాగ్ సూపర్..

kiran said...

హహహః..అమ్మైలంటే ఇంత భయపడ్తున్నారా ....:)...
నాకు కొన్ని చదువుతుంటే ఏదో black n white సినిమా ల అనిపించింది..మీ బ.త్రి.సు ఇప్పుడు ఎక్కడుంది..??
మే కామెంట్ - నేను కూడ వెయిటింగ్ ఇక్కడ :) - :):):)

గిరీష్ said...

@కిరణ్ గారు,
భయ పడుతున్నారు, భయ పడుతున్నారు అని అందరూ అంటున్నారే కాని, భయ పెడుతున్నారు అని ఎవరు గుర్తించడం లేదు ఏంటి అధ్యక్షా.. :),
బ.త్రి.సు కి మనకి ఏం సంబంధం లేదండీ.. :)

@Anonymous
ఏడుపుగొట్టు మొహాలను చూస్తే గిల్లేస్తారా.. ఇంకా ఏడిపిస్తారా..మీకు జాలి, దయ ఇలాంటివి ఏంలేవా..,jus kiddin :)

రసజ్ఞ said...

పాపమండీ! జాలేస్తోంది! ఒకపక్క మరదలు, ఇంకోపక్క బాల!

గిరీష్ said...

@రసజ్ఞ గారు,
:))) వరస బెట్టి చదివారు గా.., thanks for the comment.