Wednesday, April 20, 2011

Love Aaj kal

రాద్దామ వద్దా అనుకుంటూనే రాస్తున్నాను.. :)
          నాకు తెలుగు కన్నా హిందీ వెర్షనే బానచ్చింది. టేకింగ్ బాగుంటుంది. తెలుగు కూడ సో సో గ ఉంది అనిపించింది. తెలుగులో ముఖ్యంగా త్రివిక్రమ్ మాటలు బాగున్నాయ్. నేటి హీరోగారికి హ్యాస్యం మేలవించి, పాత తరం హీరో గారికి కాస్త భాద ని కలిపి బాగా రాసారు. ఇంక పవన్ మామూలే, బాగా చేశాడు. సన్నబడ్డాడు ఈ సినిమాలో. కథలోకి వెళితే ఇప్పుడున్న ప్రేమకి పాత తరం/కాలం లో ఉన్న ప్రేమకి తేడ ఏంటనేదే ఈ చిత్రం (నాకు ఇలాంటి సందేహం వచ్చి నేను ఇంతకముందు ఓ టపా రాసాను, వేరే విధంగా ఇక్కడ). కథా రచయిత ఇంతియాజ్ అలి కథనం ప్రకారం నాకు అర్ధమైంది ఏంటంటే, మన సాంప్రదాయాలు, సంస్కృతి ఎంతగా మారినప్పటికీను, అప్పటికి ఇప్పటికి ప్రేమ తీరు మారలేదు కాని ప్రేమించే మనుషులే మారారు. తక్కువ సమయంలో ఎక్కువ మందిని ప్రేమించడం, అదే అదే ప్రేమించాననుకోవడం, తిరగటం, రియలైజ్ అవ్వడం, విడిపోవడం. మళ్ళీ ఇంకొక్కళ్ళని ప్రేమించండం.. while(1); :). నిజంగా ప్రేమించిన అమ్మాయి ఎవరా అని తెలుసుకునేలోగ, అమెకు పెళ్ళైపోవడం జరుగుతుంది ఈ సినిమాలో. కాని అప్పటికే అమ్మాయి రియలైజ్ అవ్వటంతో తర్వాత ఇద్దరు కలుసుకుంటారు (సినిమా కదా అంతేలే :) ). కానీ నిజానికి ఇలా జరగక పోవచ్చు. కలసి తిరుగుతారు, విడిపోతారు, వేరే వాళ్ళని పెళ్ళి చేసుకొని జీవితం అలా గడిపేస్తారు. Actually this movie is Moral based one, కాని జనాలకి అర్ధం అవుతుందో లేక కొత్త బంగారు లోకం సినిమా లాగ First Half enjoy చేసి వదిలేస్తారో మరి వాళ్ళకే తెలియాలి.






FYI: 100% Love పాటలు బాగున్నాయ్, వింటున్నారుగ..! :)

10 comments:

Indian Minerva said...

while(1); :D

C Developer అనిపించుకున్నావుఫో

Anonymous said...

ఫస్ట్ హాఫ్ ఎంజాయ్ చేసి వదలెయ్యట్లేదండీ. సెకండ్ హాఫే బాగుందని టాక్
--సంతోష్ సూరంపూడి

Anonymous said...

ఫస్ట్ హాఫ్ ఎంజాయ్ చేసి వదలెయ్యట్లేదండీ. సెకండ్ హాఫే బాగుందని టాక్
సంతోష్ సూరంపూడి

kiran said...

కాస్త philosophical గా ఉంది..:) మీ రివ్యూ..
నేను ఈ w -end చూసి చెప్తా ..నా రివ్యూ..:)

kiran said...

haaa..funny funny ga unnai..vintunnaa..:P

Unknown said...

:)

గిరీష్ said...

మినర్వా మిత్రమా,
నీ వాఖ్యకు ధన్యుడనైతిని.. :),నా రెజ్యూమ్‌లో ఈ వాఖ్య పెట్టేద్దాం అనుకుంటున్నా.. నెనర్లు.

సంతోష్ గారు,
సినిమా బాగుందండీ, కాని మనోల్లు ఎలా రిసీవ్ చేసుకుంటారోనని అలా వ్రాశాను. ధన్యవాదములు వాఖ్యకి.

గిరీష్ said...

@కిరణ్ గారు,
ఇతే ఈ వారాంతం చూసి మీరు కూడ రివ్యూ రాయండి. తర్వాత మీరే చెప్తారు నేను బానే వ్రాశానని.. :)
పాటలు అన్నీ చిన్న చిన్న పదాలతో భలే ఉన్నాయ్. లిరికల్ వ్యాల్యూస్ బాగున్నాయ్. DSP సంగీతం కూడ డిఫెరెంట్‌గా ఉంది. Thank You.

@కావ్య గారు,
ఆ నవ్వుకి అర్ధం ఏంటండీ? :)

Manoj said...

nicely written while(1), :)
I liked the movie,Trivikram did a good job.
Dialouges in flashback are really good,heart touching and happy to see happy ending.

గిరీష్ said...

@Manoj,
Thanks for the comment :)